ఫెయిరీ ఫౌండేషన్
శీతాకాలంలో పార్టీకి వెళ్లాలా? ఎలాంటి ఫౌండేషన్ వేసుకోవాలో అర్థం కావట్లేదా? మీ చర్మానికి ఎలాంటి ఫౌండేషన్ అబ్బుతుందోనన్న ప్రశ్నా? అయితే ఈ చిట్కాలు మీ కోసం..
కొంతమందికి ఫౌండేషన్ రాసుకోవాలని ఉన్నా అది ముఖంపై బరువుగా ఉన్నట్టు భావిస్తుంటారు. అలాంటి వారు దాన్ని డెరైక్ట్‌గా చర్మానికి రాసుకోకుండా ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది పూర్తిగా చర్మంలోకి ఇంకిపోయాక ఫౌండేషన్ క్రీమ్‌ను కొద్దిగా ముఖానికి అప్లై చేస్తే చాలు. లైట్‌గా అనిపించడమే కాకుండా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
పొడి చర్మం వారు ఫౌండేషన్ క్రీమ్ అంటే భయపడుతుంటారు. ఎందుకంటే అది రాసుకుంటే ముఖంపై ఆ క్రీమ్ ప్యాచులుగా కనిపిస్తుందని. అలాంటి వారు చేతిలో కొద్దిగా ఫౌండేషన్ క్రీమ్‌ను తీసుకొని దానికి మాయిశ్చరైజర్ కలిపి ముఖానికి రాసుకోవాలి.