ఫస్ట్‌ టైమ్‌ కాళ్లు పట్టుకున్నాడు! | First time ... My nail paint is cleaning ...kruthi | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ టైమ్‌ కాళ్లు పట్టుకున్నాడు!

Published Sun, Jul 30 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ఫస్ట్‌ టైమ్‌ కాళ్లు పట్టుకున్నాడు!

ఫస్ట్‌ టైమ్‌ కాళ్లు పట్టుకున్నాడు!

ఇన్‌సెట్‌లో ఫొటో చూశారా? సుకుమారి కృతీ సనన్‌ పాదాలను చేతిలోకి తీసుకుని చక్కగా ఓ అబ్బాయి తుడుస్తున్నాడు కదా! అతనెవరో కాదు... హిందీ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌. ఇంతకీ, కృతీ పాదాన్ని సుశాంత్‌ ఎందుకు పట్టుకున్నాడు? అంటే... ఆమె నెయిల్‌ పాలీష్‌ను క్లీన్‌ చేస్తున్నాడు. అదీ చక్కగా కింద కూర్చుని.

అప్పుడు కుర్చీలో కూర్చున్న కృతి ఓ ఫొటో తీసుకుని, ‘ఫస్ట్‌ టైమ్‌... నా నెయిల్‌ పెయింట్‌ను క్లీన్‌ చేస్తున్నాడు’ అని క్యాప్షన్‌ పెట్టారు. బీ–టౌన్‌ జనాలు ఈ ఫొటోకి కొత్త అర్థాలు తీస్తున్నారు. ‘ఫస్ట్‌ టైమ్‌... నా కాళ్లు పట్టుకున్నాడు చూడండి’ అన్నది కృతి అర్థమని చెబుతున్నారు. వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని బీ–టౌన్‌ టాక్‌. వీళ్లు మాత్రం ఎప్పుడూ తమ ప్రేమను పబ్లిగ్గా అంగీకరించలేదు. వీలైనప్పుడు ఇలా వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement