అక్షరాలు నేర్పిస్తాయి
నెయిల్ ఆర్ట్
ఇది న్యూస్ పేపర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి తెలుపు, గులాబి, ట్రాన్స్‌పరెంట్, ఆకుపచ్చ రంగుల నెయిల్ పాలిష్‌లు, కొన్ని న్యూస్ పేపర్ ముక్కలు ఉంటే సరిపోతుంది. ఎన్నోరకాల నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లో ఇదొకటి. ఈ ఆర్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ డిజైన్‌కు కొన్ని గులాబి అందాలు జోడిస్తే.. మీ గోళ్ల అందం మరింత పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం..ఈ డిజైన్‌ను మీరూ వేసుకోండి. ఎలా అంటే...
1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని.. అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటికి పూర్తిగా తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి.
2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా న్యూస్‌పేపర్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి.
3. ఆపైన వెనిగర్‌లో ముంచిన దూది ఉండను గోళ్లపై రాయాలి. (వెనిగర్‌కు బదులుగా నీళ్లను కూడా వాడొచ్చు. కాకపోతే గోళ్లపై న్యూస్‌ప్రింట్ లైట్‌గా పడుతుంది)
4. ఆ వెనిగర్ ఆరకముందే.. న్యూస్‌పేపర్ ముక్కను గోరుపై పెట్టి ప్రెస్ చేయాలి. అర నిమిషం తర్వాత ఆ పేపర్‌ను తొలగిస్తే.. పేపర్‌పై అక్షరాలు మీ గోళ్లపై ప్రత్యక్షమవుతాయి.
5. ఇప్పుడు ఆ ప్రింటెడ్ గోళ్లపై గులాబిరంగు పాలిష్‌తో పెద్ద సైజు చుక్కలు పెట్టుకోవాలి.
6. తర్వాత తెలుపురంగు పాలిష్‌తో ఆ చుక్కలపై అక్కడక్కడా పూయాలి. (అది గులాబి పువ్వు ఆకారంలోకి వచ్చేలా గీయాలి)
7. చివరగా ఆకుపచ్చ రంగు పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఆకులు గీసుకోవాలి. వాటి మధ్యలో వైట్‌పాలిష్‌తో ఓ లైన్ గీస్తే సరి. పువ్వులు, ఆకులు, అక్షరాలతో మీ గోళ్లు ఎంతో అందంగా కనిపిస్తాయి.