ఉన్నత చదువులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందనేది వాస్తవం. ఐతే కొందరూ ఎలాంటి చదువులు చదవకపోయినా..తమలో ఉన్న ప్రతిభతో కోట్లు గడించి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అలంటి కోవకు చెందిందే ఈ యూఎస్ మహిళ. కనీసం డిగ్రీ కూడా చదవలేదు కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు పైనే ఆర్జిస్తోంది. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..
యూఎస్‌కి చెందిన జెన్నీ న్గుయెన్ అసాధారణమైన నెయిల్ ఆర్ట్ నైపుణ్యారులు. ఈ కళతోనే ఏడాదికి సుమారు రూ. 5 కోట్లు దాక సంపాదిస్తోంది. కనీసం గ్రాడ్యుయేషన్ చదువులు కూడా చదవలేదు. ఆమె తన జెన్‌పెయింట్ నెయిల్ లాంజ్ సెలూన్‌తో ఇన్నికోట్లు గడిస్తోంది. తన సెలూన్ ద్వారా ఆమె చేతుల అందాన్ని తీర్చిదిద్ధే పద్దతి నుంచి కనురెప్పలను వరకు వివిధ బ్యూటీ సేవలను అందిస్తుంది. ఆమె నెయిల్ ఆర్ట్ ఏకంగా రూ. 40 వేల వరకు అమ్ముడవుతుందట.
ఆమె డిజైనలను యాపిల్, కాన్‌వర్స్, ఛానెల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ అడ్వర్టైస్‌మెంట్‌లలో వినియోగించుకుంటాయట. ఆమె ఈ జెన్ పెయింట్ సెలూన్‌ని 2022లో ప్రారంభించింది. ఆ ఏడాదిలోనే ఏకంగా రూ.. 5 కోట్లుపైగా లాభాలు అందుకోవడం విశేషం. జెన్నీ నిజానికి న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీని చేయాలనుకుంది, గానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మధ్యలో చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఆ టైంలో తాను ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాను గానీ అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం సాధ్యం కాదని ఎంటర్‌ప్రెన్యూర్ వైపుకి మళ్లానని అంటోంది జెన్నీ. తాను 2021ప్రారంభంలో, అడ్వాన్స్ బ్యూటీ కాలేజ్ ద్వారా చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతిలో లైసెన్స్‌ని పొందడంతోనే వెనుదిరిగి చూసుకోలేదని చెబుతోంది. అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా కూడా నెయిల్ బ్యూటీకి సంబంధించిన సేవలందించడం ప్రారంభించటంతో తన డిజైన్‌లకు విశేష ఆధరణ లభించడం ప్రారంభమయ్యిందని అంటోంది.
అంతేగాదు సోషల్ మీడియాలో హప్రోఫైల్ వినియోగదారులు జెన్నీ అపాయింట్‌మెంట్ అడిగి మరీ ఆమె సెలూన్‌కి వస్తున్నారు. ఉన్నత చదువులు చదవలేకపోయినా..ప్రతిభ ఉంటే ఉన్నత స్థాయిలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చిన ప్రూవ్ చేసి చూపించింది జెన్నీ. టాలెంట్ ఉన్నవాడు ఎలాగైనా ఉన్నత స్థాయికి రాగలడు అంటే..ఇదే కదా..!.
(చదవండి: పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..?)
Comments
Please login to add a commentAdd a comment