Nail Art
-
Christmas 2024 : బెస్ట్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్..ఇదిగో ఇలా!
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్‌మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..Christmas nail art🎄 [📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024 -
Christmas 2024: శాంటా లవ్, ఈ నైల్ ఆర్ట్ చూశారా? (ఫోటోలు)
-
కాలేజ్‌కి కూడా వెళ్లలేదు.. కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు..!
ఉన్నత చదువులు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందనేది వాస్తవం. ఐతే కొందరూ ఎలాంటి చదువులు చదవకపోయినా..తమలో ఉన్న ప్రతిభతో కోట్లు గడించి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అలంటి కోవకు చెందిందే ఈ యూఎస్ మహిళ. కనీసం డిగ్రీ కూడా చదవలేదు కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు పైనే ఆర్జిస్తోంది. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..యూఎస్‌కి చెందిన జెన్నీ న్గుయెన్ అసాధారణమైన నెయిల్ ఆర్ట్ నైపుణ్యారులు. ఈ కళతోనే ఏడాదికి సుమారు రూ. 5 కోట్లు దాక సంపాదిస్తోంది. కనీసం గ్రాడ్యుయేషన్ చదువులు కూడా చదవలేదు. ఆమె తన జెన్పెయింట్ నెయిల్ లాంజ్ సెలూన్తో ఇన్నికోట్లు గడిస్తోంది. తన సెలూన్ ద్వారా ఆమె చేతుల అందాన్ని తీర్చిదిద్ధే పద్దతి నుంచి కనురెప్పలను వరకు వివిధ బ్యూటీ సేవలను అందిస్తుంది. ఆమె నెయిల్ ఆర్ట్ ఏకంగా రూ. 40 వేల వరకు అమ్ముడవుతుందట.ఆమె డిజైనలను యాపిల్, కాన్వర్స్, ఛానెల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ అడ్వర్టైస్మెంట్లలో వినియోగించుకుంటాయట. ఆమె ఈ జెన్ పెయింట్ సెలూన్‌ని 2022లో ప్రారంభించింది. ఆ ఏడాదిలోనే ఏకంగా రూ.. 5 కోట్లుపైగా లాభాలు అందుకోవడం విశేషం. జెన్నీ నిజానికి న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీని చేయాలనుకుంది, గానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మధ్యలో చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.ఆ టైంలో తాను ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాను గానీ అధిక మొత్తంలో డబ్బు సంపాదించడం సాధ్యం కాదని ఎంటర్ప్రెన్యూర్ వైపుకి మళ్లానని అంటోంది జెన్నీ. తాను 2021ప్రారంభంలో, అడ్వాన్స్ బ్యూటీ కాలేజ్ ద్వారా చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతిలో లైసెన్స్‌ని పొందడంతోనే వెనుదిరిగి చూసుకోలేదని చెబుతోంది. అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా కూడా నెయిల్ బ్యూటీకి సంబంధించిన సేవలందించడం ప్రారంభించటంతో తన డిజైన్లకు విశేష ఆధరణ లభించడం ప్రారంభమయ్యిందని అంటోంది. అంతేగాదు సోషల్ మీడియాలో హప్రోఫైల్ వినియోగదారులు జెన్నీ అపాయింట్మెంట్ అడిగి మరీ ఆమె సెలూన్‌కి వస్తున్నారు. ఉన్నత చదువులు చదవలేకపోయినా..ప్రతిభ ఉంటే ఉన్నత స్థాయిలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చిన ప్రూవ్ చేసి చూపించింది జెన్నీ. టాలెంట్ ఉన్నవాడు ఎలాగైనా ఉన్నత స్థాయికి రాగలడు అంటే..ఇదే కదా..!. (చదవండి: పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్: ఈ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..?) -
నెయిల్ పాలిష్‌తో వచ్చే సమస్యలన్నింటికి ఈ డివైస్‌తో చెక్
పొడవైన, అందమైన గోళ్లు సైతం ఆడవాళ్లకు అలంకరణే! అందుకే సౌందర్యపిపాసులైన కోమలులు.. గోళ్లను ప్రత్యేకంగా పెంచుకుని.. అంతే ప్రత్యేకంగా వాటిని సంరక్షించుకుంటూ ఉంటారు. ఏరోజుకారోజు వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా నెయిల్ పాలిష్ మారుస్తూ ఉంటారు. ట్రెండ్‌ని అనుసరిస్తూ గోళ్ల మీద రకరకాల రంగుల్లో డిజైన్స్ వేస్తూ గోళ్లకు ఎనలేని వన్నెను అద్దుతుంటారు. అలాంటి వారికి ఈ ‘డై జెల్ నెయిల్ కిట్’ భలే ఉపయోగపడుతుంది. సాధారణంగా గోళ్లకు నెయిల్ పాలిష్ వేసిన తర్వాత, ఆరే వరకూ ఏ పనీ చేయలేం. నెయిల్ పాలిష్ వేసుకోగానే చల్లటి నీళ్లల్లో వేళ్లు ముంచడం, ఫ్యా గాలికి ఆరబెట్టుకోవడం.. ఇలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తడి ఆరే వరకూ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి సమస్యలకు చెక్ పెడుతుందీ డివైస్. ఈ మెషిన్ తో పాటు రెండు ప్రత్యేకమైన మినీ టూల్స్ లభిస్తాయి. వాటిలో ఒకటి క్యూటికల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల వైశాల్యాన్ని పెంచడానికి గోళ్లకు, చర్మానికి మధ్య ఉండే భాగాన్ని లోపలికి నొక్కుకోవచ్చు. రెండవది ఫైల్ నెయిల్ స్టిక్. దీని సాయంతో గోళ్ల పగుళ్లు, గరుకుతనం పోగొట్టుకోవచ్చు. ఆ స్టిక్స్‌ని సక్రమంగా వినియోగించిన అనంతరం ఈ డివైస్‌ని ఆన్ చేసుకుని.. నెయిల్ పాలిష్ వేసుకుని.. ఈ టూల్లో ఒక్కో గోరు ఉంచుకోవాలి. దీనిలోని ఎల్ఈడీ లైట్ వెలుగుతూ.. 30 సెకన్ల పాటు ఆన్ లో ఉంటుంది. ఆ సమయంలో నెయిల్ పాలిష్ ఆరిపోతుంది. మరోవైపు 30 సెకన్స్‌లో ఇది ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీన్ని చిన్న టాయిలెట్ బ్యాగ్‌లో పెట్టుకుని, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ కిట్‌తో పాటు 10 నెయిల్ పాలిష్ రిమూవర్ ప్యాడ్లు లభిస్తాయి. ఇందులో డైరెక్ట్ చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకునే డివైస్‌లు కూడా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. -
Nail Art Designs : నెయిల్ ఆర్ట్‌లో నయా ట్రెండ్
-
థీమ్‌కి తగ్గట్లు నెయిల్ ఆర్ట్.. ఇంకెన్ని వెరైటీలు వస్తాయో
వేడుకలు సంప్రదాయమైనా పాశ్చాత్యమైనా టాప్ టు బాటమ్ స్పెషల్‌గా కనిపించాలనుకునేవారికి నెయిల్ ఆర్ట్ కూడా తనదైన ముద్ర వేస్తోంది.సందర్భానికి తగిన డిజైన్లతో నఖ శిఖ పర్యంతం ఆకట్టుకోవడానికి కొత్తగా ముస్తాబు అవుతోంది. వేడుకలకు తగినట్టుగా రెడీ అవడానికి తగిన డ్రెస్‌లను ఎంపికచేసుకుంటాం. అలాగే, వాటికి తగిన మ్యాచింగ్ పట్ల కూడా శ్రద్ధ పెడతాం. అయితే, మరింత ప్రత్యేకత చూపడానికి నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు నేటి యువత. ఫ్రెండ్షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, కృష్ణాష్టమి.. వంటి రాబోయే వేడుకలను నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లో చూపుతూ సందర్భానికి తగినట్టుగా రెడీ అవుతున్నారు. కొనుగోరు చేయవచ్చు! ఎంత బాగా షేప్ చేసినా, గోళ్లు విరిగిపోవడం సహజంగా జరుగుతుంటుంది. నెయిల్ ఆర్ట్‌తో వేళ్లు అందంగా ఉండాలనుకునేవారు ఆర్టిఫిషియల్ నెయిల్స్‌తో సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఈ మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని మన నెయిల్ షేప్‌ను బట్టి, జెల్‌తో సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాలిష్‌తో డిజైన్ చేసుకోవచ్చు. నచ్చిన డిజైన్ సరైన విధంగా రాదనుకునేవారు నిపుణుల సాయం తీసుకోవచ్చు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ►చేతులకు పెడిక్యూర్‌లో భాగంగా వేలి కొసల్లో క్యుటికల్స్, డెడ్స్కిన్ అంతా క్లీన్ చేసి అప్పుడు మన వేళ్లను బట్టి ఏ షేప్‌లో కావాలో ఆ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అమర్చుకోవాలి. (నెయిల్స్ పెరిగినప్పుడు, వీటిని మళ్లీ క్లియర్ చేసుకోవచ్చు). ►కొన్ని రంగుల నెయిల్ పాలిష్‌లు తెచ్చుకొని, డ్రెస్‌కు లేదా చీరకు మ్యాచ్ అయ్యే రంగును గోళ్లకు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు చీర లేదా డ్రెస్ రంగుతో పాటు ఆ డిజైన్‌కు మ్యాచ్ అయ్యే, పండగ థీమ్ ఆర్ట్‌ను నెయిల్స్‌పై ఎంచుకుంటున్నారు. అందుకు నెయిల్ ఆర్ట్ స్పా లు ప్రత్యేకంగా తోడ్పడుతున్నాయి. -
మందారాలు - మకరందాలు
మేకప్‌కు అగ్రస్థానం ఇచ్చే ఈ ట్రెండీ రోజుల్లో మోడర్న్ మగువలకు... నెయిల్ ఆర్ట్ అంటే భలే ఇష్టం! రంగురంగుల నెయిల్ పాలిష్‌లతో పాటు.. ఒక నెయిల్ రిమూవర్ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో చూసుకోవచ్చు! కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపూలను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల నుంచి ప్రశంసలు పొందేయొచ్చు! ఈ నెయిల్ ఆర్ట్‌ని చూడండి! భలే ఉంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం..? ఈ చిత్రంలో చూపించినట్లుగా... లేదా మీరు వేసుకున్న డ్రెస్ కలర్‌కు తగ్గట్టుగా కలర్స్ ఎంచుకునైనా.. నిమిషాల్లో ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోండి. ట్రై చేయండి. 1. ముందుగా నెయిల్స్ శుభ్రం చేసుకుని షేప్ చేసుకోవాలి. తర్వాత నెయిల్స్ అన్నింటికీ వైట్ కలర్ అప్లై చేసుకోవాలి 2. తర్వాత సన్నని బ్రష్ తీసుకుని టైట్ పింక్ కలర్ లేదా మెచ్చిన కలర్‌తో చిత్రాన్ని అనుసరించి మందార పూల రేకులు వేసుకోవాలి. 3. ఇపుడు కాస్త డార్క్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని సన్నని బ్రష్‌తో ఇంతకు ముందు వేసిన లైట్ పింక్ మందార పూలరేకులను చిత్రంలో చూపిన విధంగా హైలెట్ చేసుకోవాలి. 4. తరువాత గ్రీన్ కలర్ తీసుకుని చిత్రంలో ఉన్న విధంగా సింబల్ వేసుకోవాలి. 5. ఇపుడు వైట్ కలర్ తీసుకుని సన్నని బ్రష్‌తో గ్రీన్ కలర్ సింబల్‌కి చిత్రాన్ని గమనిస్తూ గీతలు పెట్టుకోవాలి. 6. ఇపుడు బ్లాక్ కలర్ లేదా డార్క్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని ఆకుపచ్చ ఆకు మధ్యలో ఈనుల్లా గీతలు పెట్టుకోవాలి. తరువాత ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని మందార పువ్వు పైన మూడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిపై రెడ్ కలర్ నెయిల్ కలర్ చుక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నెయిల్స్ కి మందార పూలు , ఆకులను డిజైన్ చేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది. -
గోటి తలుపులు...
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ చూడటానికి ఎంత స్టైల్‌గా ఉంటుందో... వేసుకోవడానికీ అంతే సులువుగా ఉంటుంది. ఈ డిజైన్ చూడటానికి తెరిచిన ఉన్న డోర్లలా కనిపిస్తాయి. ఈ ఆర్ట్‌ను మీరూ వేసుకోవాలంటే... ముందుగా లావెండర్ (లేత వంకాయ రంగు), తెలుపు లేదా నెయిల్ కలర్ పాలిష్‌లు, ఫొటోల్లో కనిపిస్తున్న హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్ (షాపుల్లో దొరుకుతాయి), ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్‌ను సిద్ధం చేసుకోవాలి. అంతే.. వీటితో కింద చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే మీ గోళ్లు అందంగా మారతాయి. 1. ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోవాలి. ఆపైన వాటిపై లావెండర్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి. 2. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు హోల్ రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేబుల్స్‌ను గోరుకు రెండు వైపులా పెట్టి, మధ్యభాగంలో వైట్ లేదా నెయిల్ కలర్ పాలిష్‌ను అప్లై చేయాలి. 3. ఒకదాని తర్వాత మరో గోరుపై ముందు స్టెప్‌లో చెప్పిన విధంగా చేసుకుంటూ పోవాలి. 4. అన్ని గోళ్లపై పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేయాలి. దాంతో మీ గోళ్లు మరింత ఆకర్షణీయంగా తయారవుతాయి. -
నవ్వులు రువ్వే పువ్వులు
నెయిల్ ఆర్ట్ గోళ్లు నవ్వడం ఎప్పుడైనా చూశారా! మునివేళ్లలో నవ్వులు ఎప్పుడైనా వీక్షించారా! గులాబీ, బంతి, చామంతి, గోరింట అందాలతో మురిసిపోతూ నవ్వే గోళ్లు మీవి కావాలని ఉందా! అయితే చాలా సింపుల్‌గా ఆ నవ్వులను మీ గోళ్లకు అతికించవచ్చు. పువ్వుల కాంతులను వెదజల్లవచ్చు. మార్బుల్ ఆర్ట్ ద్వారా మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు. ముందుగా గోళ్లకు బేస్ కోట్ వేసుకోవాలి. దీని వల్ల డిజైన్ బ్రైట్‌గా కనిపించడమే కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ తర్వాత తెలుపు రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆరనివ్వాలి. గోరును మాత్రమే వదిలేసి చుట్టూతా (వేలికి) పెట్రోలియమ్ జెల్లీ రాయాలి. చుట్టూ గ్లూ ఉండే టేప్ అతికించాలి. 1. చిన్న గాజు గిన్నెలో ముప్పావు వంతు నీళ్లు పోయాలి. నచ్చిన నెయిల్ పాలిష్‌ను ఎంచుకోవాలి. (ఇక్కడ గులాబీ రంగు నెయిల్‌పాలిష్‌ను ఎంచుకున్నాం) ఒక చుక్క నెయిల్‌పాలిష్‌ను నీళ్ల మధ్యలో వేయాలి. 2. నెయిల్ పాలిష్ చుక్క నీటి పై భాగంలో స్ప్రెడ్ అవగానే తెలుపు రంగు నెయిల్ పాలిష్ డ్రాప్ వేయాలి. ఇలా ఒకసారి గులాబీ రంగు, మరోసారి తెలుపు రంగు నెయిల్‌పాలిష్ డ్రాప్స్ నాలుగైదు సార్లు వేయాలి. 3. టూత్ పిక్ తీసుకొని మధ్యలో పువ్వు వచ్చేలా నెయిల్‌పాలిష్‌ను కదపాలి. 4. టేప్ వేసిన వేలి గోరు మునిగేలా డిజైన్ చేసిన నెయిల్‌పాలిష్‌లో నెమ్మదిగా ముంచి, తీయాలి. 5. నెయిల్ పాలిష్ ఆరాక టేప్ తీసేయాలి. 6. పువ్వుల రేకలతో అందమైన డిజైన్ గోళ్ల మీద సాక్షాత్కరిస్తుంది. దీని మీద మళ్లీ ట్రాన్స్పరెంట్గా కనిపించే బేస్‌కోట్ వేయాలి. ఇలా చూడముచ్చటైన డిజైన్లు మీ గోళ్ల మీద అందంగా కనువిందు చేయవచ్చు. -
విదేశీ పూలు విరిశాయి..!
నెయిల్ ఆర్ట్ ఇది ‘హవాయిన్ ఫ్లవర్స్’ నెయిల్ ఆర్ట్. ఈ హవాయిన్ ఫ్లవర్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ఫేమస్. వీటి డిజైన్స్ ఎక్కడ ఉన్నా... వాటి క్రేజే వేరు. డ్రెస్సులు, చీరలు, దుప్పట్లు... ఇలా వేటిపై ఈ ఫ్లవర్ డిజైన్ వేసినా, వాటి సేల్ విపరీతంగా పెరిగిపోతుంది. అంతటి స్పెషల్ ఫ్లవర్లను మీ గోళ్లపైనా వేసుకోవాలని ఉందా...? అయితే.. ముందుగా మీ గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకొని, అందంగా కత్తిరించుకోండి. తర్వాత ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోండి. ఎలా అంటారా? ఇలా... 1. ముందుగా ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, తెలుపు రంగుల నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని గోళ్లకూ ఆరెంజ్ కలర్ పాలిష్‌ను పూయాలి. 2. తర్వాత ఏదైనా సూది లాంటి పరికరాన్ని తీసుకొని, వైట్ కలర్ పాలిష్‌లో ముంచండి. ఆ పాలిష్‌తో ఇప్పుడు చూపుడు, మధ్య వేళ్లపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా గీయాలి. 3. ఇప్పుడు మిగతా వేళ్లకు కూడా ఫొటోలను చూసుకుంటూ వైట్ పాలిష్‌తో డిజైన్ వేసుకోవాలి. 4. సూది లాంటి పరికరం తీసుకొని, పెట్టిన తెల్ల చుక్కలను మామూలు పూరేకుల్లా మార్చుకోవాలి. 5. అదే పరికరంతో ఆ పూరేకులను హవాయిన్ పూల డిజైన్లోకి తీసుకురావాలి. 6. మళ్లీ వైట్ కలర్ పెయింట్‌తో అన్ని వేళ్లకూ అక్కడక్కడా చుక్కలు పెట్టుకోవాలి. చివరగా ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. అలా ఎంతో అందమైన పూలు మీ గోళ్లపై పూస్తాయి. ఆరెంజ్‌కి బదులుగా ఏ రంగునైనా వేసుకోవచ్చు. -
గోరంతా హరివిల్లు
నెయిల్ ఆర్ట్ ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ట్రాన్స్పరెంట్, ఆరెంజ్, వయొలెట్, పింక్, వైట్, గ్రీన్, స్కై బ్లూ రంగుల నెయిల్ పాలిష్‌లు, ఓ స్పాంజి ముక్క ఉంటే చాలు. ఈ ఆర్ట్ మీ గోళ్లకు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకోవడం చాలా సింపుల్. ఇంద్రధనుస్సులో ఏడు రంగులుంటాయి. కానీ ఈ డిజైన్‌లో ఆ ఏడు రంగులు లేకున్నా... ఇంద్ర ధనుస్సులాగే కనిపిస్తుంది. మరి మీకూ ఈ డిజైన్ కావాలంటే, ముందుగా గోళ్లన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. ఆపైన డిజైన్‌ను వేసుకోండి... 1. ముందుగా గోళ్లన్నిటికీ వైట్ కలర్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. తర్వాత స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా అన్ని రంగుల పాలిష్‌లను పూయాలి. 2. ఇప్పుడు ఆ స్పాంజిని గోళ్లపై అద్దాలి. దాంతో ఆ రంగులన్నీ గోళ్లకు అంటుకుంటాయి. 3. ఒకే కోటింగ్ కావడం వల్ల రంగులు గోళ్లపై లైట్‌గా కనిపిస్తాయి. కాబట్టి మరోసారి స్టెప్ 1,2 లను రిపీట్ చేయాలి. అలా చేస్తే నెయిల్ పాలిష్ రంగులు డార్క్‌గా అందంగా కనిపిస్తాయి. 4. ఒక స్టిక్లాంటిది తీసుకొని, దాన్ని వైట్ కలర్ నెయిల్ పాలిష్‌లో ముంచాలి. ఇప్పుడు ఆ పెయింట్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూల రేకులను డ్రా చేయాలి. 5. పూల రేకులు పూర్తిగా వేస్తే... 5వ నంబర్లో కనిపిస్తున్నట్టుగా వస్తాయి. ఆ రేకులు కాస్త దూరం దూరంగా వేస్తేనే, అవి ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. ఇప్పుడు మరో గీతను చాపంలా గీసి, చిన్న సైజు ఆకులను గీయాలి. ఆపైన గోళ్లపై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఫినిషింగ్ కోట్ ఇవ్వాలి. -
రంగు పడుద్ది...
నెయిల్ ఆర్ట్ ఇది స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి గ్రీన్, పింక్, ఆరెంజ్, రెడ్, వైట్, బ్లూ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. అలాగే వీటితో పాటు ట్రాన్స్పరెంట్ పాలిష్, నెయిల్ రిమూవర్, కూల్‌డ్రింక్ స్ట్రాలు ఉంటే చాలు. ఎంతో అందంగా ఉండే స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్‌ను మీ గోళ్లపైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్‌ను చూస్తే... హోలీ రోజు రంగులతో నిండిన మన దుస్తులే గుర్తొస్తాయి. మరి ఆ రంగుల అందం మీకూ కావాలంటే.. ఈ డిజైన్‌ను ట్రై చేయండి. 1. ముందుగా స్ట్రాలను కత్తెరతో ముక్కలు చేసుకోవాలి. 2. ఇప్పుడు అందంగా కత్తిరించుకున్న గోళ్లపై ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేసుకోవాలి. 3. తర్వాత గోళ్లన్నిటికీ తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి. 4. ఆపైన మొదటగా బ్లూ కలర్ పాలిష్‌లో ఓ స్ట్రా ముక్కను ముంచాలి. 5. ఆ స్ట్రాలో ఉన్న పాలిష్‌ను ఇప్పుడు గోళ్లపై చల్లాలి. 6. అలాగే పింక్, రెడ్ పాలిష్లలో స్ట్రాలను ముంచి చల్లుకోవాలి. 7. ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ రంగుల పాలిష్‌లను చల్లాలి. ఇవే కాకుండా, మీకు నచ్చిన రంగులు ఎన్నింటినైనా వాడొచ్చు. 8. తర్వాత గోళ్ల చుట్టూ అంటుకున్న పాలిష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌తో క్లీన్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత, ట్రాన్స్పరెంట్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. -
గోరంత అందాలు
నెయిల్ ఆర్ట్ ఇది ‘సెయింట్ ప్యాట్రిక్స్ డే’ నెయిల్ ఆర్ట్ రకాలలో ఒకటి. దీన్ని వేసుకోవడానికి ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగుల నెయిల్ పాలిష్‌లు, ట్రాన్స్పరెంట్ టేప్, సిల్వర్ గ్లిట్టర్, ట్రాన్స్పరెంట్ పాలిష్‌లు సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్‌గా అందంగా కనిపిస్తుంది. దీన్ని వేసుకోవడం చాలా సులువు కూడా. ముందుగా గోళ్లను శుభ్రం చేసి, అందంగా కత్తిరించుకోవాలి. తర్వాత ఈ డిజైన్‌ను వేసుకోవాలి. ఎలా అంటారా? ఇదిగో ఇలా... 1. ముందుగా గోరుపై క్రాస్‌గా ట్రాన్స్పరెంట్ టేప్‌ను అతికించాలి. తర్వాత మిగిలిన భాగం గోరుపై ఆకుపచ్చ రంగు పాలిష్‌ను పూయాలి. 2. ఆ తర్వాత టేప్‌ను తొలగించాలి. అలా చేయడం వల్ల టేప్ పెట్టిన భాగానికి పాలిష్ అంటకుండా ఉంటుంది. 3. ఇప్పుడు ఆకుపచ్చరంగు పూర్తిగా ఆరాక ట్రాన్స్పరెంట్ పాలిష్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత నలుపురంగు పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా గీతలు గీయాలి. 4. అలాగే తెలుపురంగు పాలిష్‌తో నల్ల గీతల పక్కన తెల్ల గీతలు గీయాలి. 5. తర్వాత టేప్ తొలగించిన భాగంలో నలుపురంగు పాలిష్‌తో చిన్న చిన్న పువ్వులు గీయాలి. 6. మూడు పువ్వుల కింద ఓ చిన్న గీతను కూడా గీయాలి. పాలిష్ పూర్తిగా ఆరాక వాటిపై ఆకుపచ్చరంగును అద్దాలి. అలాగే ఆకుపచ్చ డిజైన్, పువ్వుల భాగం మధ్యలో సిల్వర్ గ్లిట్టర్‌తో ఓ డివైడింగ్ లైన్ గీయాలి. ఇదే విధంగా అన్ని గోళ్లకూ సేమ్ డిజైన్‌ను వేసుకొని, చివరగా ట్రాన్స్పరెంట్ పాలిష్‌ను పూయాలి. -
తియ్య తియ్యగా...
నెయిల్ ఆర్ట్ ఇది స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్... చూడగానే అందరికీ నోరూరించే పండ్లు - స్ట్రాబెర్రీలు.. ఇకపై మీ గోళ్లనే వాటిలా చేసుకోవాలనుకుంటే ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోండి. పూలను మాత్రమే కాకుండా ఈసారి పండ్ల డిజైన్స్‌నూ నేర్చుకుందాం. ఈ డిజైన్ కోసం లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ ఎల్లో, ఎరుపు రంగుల నెయిల్ పాలిష్‌లు ఉంటే చాలు. పెద్దలే కాదు.. చిన్నపిల్లలకూ ఈ స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్‌ను వేస్తే.. వాళ్లు భలే థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే డిజైన్‌ను ట్రై చేయండి.. ఎలా అంటే. 1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కోగోరుపై ఎరుపు రంగు నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి. 2. ఆ పాలిష్ ఆరిన తర్వాత ఎల్లో కలర్ పాలిష్‌లో టూత్ పిక్‌ను ముంచి ఫొటోలో కనిపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకోవాలి. 3. తర్వాత గోరు అడుగు భాగంలో డార్క్ గ్రీన్ పాలిష్‌తో ఆకులు గీసుకోవాలి. 4. రంగు పూర్తిగా ఆరిన తర్వాత లైట్ గ్రీన్ నెయిల్ పాలిష్‌తో ఆకుల డిజైన్‌కు బార్డర్స్ గీయాలి. అలా చేస్తే నిజమైన ఆకుల్లా కనిపిస్తాయి. అంతే, ఎంతో అందమైన స్ట్రాబెర్రీలు మీ చేతి సొంతం. -
సీతాకోకమ్మకు... గోరుముద్ద
నెయిల్ ఆర్ట్ ఇది బటర్‌ఫ్లై నెయిల్ ఆర్ట్... దీన్ని వేసుకోవడానికి ఆరెంజ్, పసుపు, తెలుపు, నలుపు, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్‌లు కావాలి. వాటితో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్, స్పాంజి ముక్కను కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిజైన్‌ను జాగ్రత్తగా వేసుకోండి. ఎలా అంటే.. 1. ముందుగా గోళ్లన్నిటికీ పూర్తిగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. 2. అది పూర్తిగా ఆరిపోయాక.. అన్ని గోళ్లకు తెలుపు రంగు పాలిష్ వేసుకోవాలి. 3. ఇప్పుడు స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్నట్టుగా పసుపు, ఆరెంజ్ రంగులు పూయాలి (ఎక్కువ భాగం ఆరెంజ్ కలర్ ఉండేలా చూసుకోవాలి). 4. ఆ స్పాంజీని గోళ్లపై అద్దాలి. అప్పుడు ఆ రెండు రంగులు మీ గోళ్లకు అతుక్కుంటాయి. రెండు మూడు కోటింగ్స్ వేసుకుంటే రంగులు ముదురుగా అందంగా వస్తాయి . 5. నెయిల్ పాలిష్ గోళ్లకే కాదు.. వేళ్లకూ అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్‌తో అలా అంటుకున్న పాలిష్‌ను తొలగించండి. ఆపైన గోళ్లకు ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేయండి. 6. ఇప్పుడు బ్లాక్ పాలిష్‌ను తీసుకొని, అందులో సన్నని బ్రష్‌ను ముంచి గోళ్లపై ఓ ఆర్క్ (చాపం) గీయాలి. 7. తర్వాత అదే కలర్ పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోవాలి. 8. ఆపైన గోళ్ల పై చివర ఖాళీగా ఉన్న చోట బ్లాక్ పాలిష్‌ను పూర్తిగా రాయాలి. 9. ఇప్పుడు తెలుపు రంగు పాలిష్‌తో బ్లాక్ పాలిష్‌పై చుక్కలు పెట్టుకోవాలి. 10. పాలిష్ పూర్తిగా ఆరిపోయాక, ట్రాన్స్పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేసుకుంటే గోళ్లు అందంగా షైన్ అవుతాయి. అంతే, ఎంతో అందమైన సీతాకోక చిలుకలు మీ గోళ్లపై ఎగిరి తీరాల్సిందే. -
ఫ్రెంచ్ ఫ్లవర్ ఆర్ట్
నెయిల్ ఆర్ట్ ఇది ఫ్రెంచ్ స్టయిల్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేయడానికి నాలుగు రంగుల నెయిల్ పాలిష్ కావాలి. నెయిల్ కలర్, వయొలెట్, తెలుపు, యాపిల్ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్‌లు సిద్ధం చేసుకోండి. ముందుగా గోళ్లను అందంగా కత్తిరించండి. ఆ తర్వాత ఈ డిజైన్ వేసుకోండి. ఎలా అంటే... 1 ముందుగా గోరుకి నెయిల్ కలర్‌ను పూయాలి. ఆరిన తర్వాత గోరు మీద క్రాస్‌గా వయొలెట్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూయాలి. 2 అది ఆరిన తర్వాత సన్నని సూదిలాంటిది తీసుకుని, తెలుపు రంగు పాలిష్‌లో ముంచి, వయొలెట్ కలర్ ఉన్న చోట చుక్కల్లాగా అద్దాలి. 3 వయొలెట్ కలర్ పాలిష్ లైన్‌ను ఆనుకుని తెలుపు రంగుతో పూల రేకుల్లాగా వేయాలి. 4 ఐదు రేకులు వేశాక పువ్వులాగా అవుతుంది. 5 ఆ పువ్వు పక్కనే అలాంటి మరో పువ్వును వేయాలి. 6 మరోపక్క కూడా ఒక పువ్వు వేయాలి. 7 వయొలెట్ కలర్ ఉన్న మిగతా భాగంలో సన్నని బ్రష్‌తో చుక్కలు పెట్టాలి. 8 యాపిల్ గ్రీన్ పాలిష్‌ను అక్కడక్కడా ఆకుల్లా అద్దాలి. 9 చివరగా పువ్వుల మధ్యలో కూడా యాపిల్ గ్రీన్ పాలిష్‌తో చుక్కలు పెట్టాలి. -
నెయిల్ ఆర్ట్
ఫ్యాషన్ అనగానే డ్రెస్సులు, హెయిర్ స్టయిల్, జ్యూయెలరీ అంటూ ఆలోచిస్తామే తప్ప... గోళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకోం. పెరిగితే కత్తిరిస్తాం. ఏదో ఒక రంగు నెయిల్ పాలిష్ పూసేస్తాం. అక్కడితో వాటిని వదిలేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు అంటారు ఫ్యాషన్ నిపుణులు. అందంగా తీర్చిదిద్దితే నఖసౌందర్యం మిగతా వాటన్నిటినీ తీసి పారేస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఇటీవలి కాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాధాన్యతను సంతరించు కుంటోంది. మరి ఆ కళలో మీరెందుకు వెనకబడాలి! వారానికో కొత్త డిజైన్ నేర్చేసుకోండి. ఈ డిజైన్ కోసం కావలసినవి నాలుగు రంగుల నెయిల్ పాలిష్‌లు... నీలం, నలుపు, తెలుపు, సిల్వర్. అయితే ఇవే రంగులు వేయాలని లేదు. ఏ రంగులైనా ఎంచుకోవచ్చు. కాంబినేషన్‌ను జాగ్రత్తగా ఎంచుకుంటే సరిపోతుంది. 1. ముందుగా గోరు మీద బ్లూ కలర్ నెయిల్ పాలిష్‌ను వేయాలి. 2. తర్వాత తెలుపు రంగు పాలిష్‌ను తీసుకుని 2వ నంబర్ ఫొటోలో చూపినట్టు క్రాస్‌గా పూయాలి. 3. బ్లాక్ నెయిల్ పాలిష్‌ను తీసుకుని, తెలుపు రంగు ఉన్న భాగంపై చారలుగా వేసుకోవాలి. 4. నల్లని చారలపైన, నీలం-తెలుపు కలిసిన చోట సిల్వర్ కలర్ పాలిష్‌ను సన్నగా పూయాలి. 5. రంగు బాగా ఆరిపోయిన తర్వాత అన్నిటి మీద మరొక పూత పూయాలి. -
రంగు... హంగు
నెయిల్ ఆర్ట్ గోళ్లను అందంగా అలంకరించుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. గోళ్లను క్యాన్వాస్గా చేసుకొని ఎన్నో డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటి పుణ్యమా అని సింపుల్‌గా ఉంటూనే, చూడచక్కగా గోళ్లను కళకళలాడేలా చేసుకోవచ్చు. 1. తయారీ ఇలా! గోళ్లను నచ్చిన షేప్‌లో తీర్చిదిద్దుకోవాలి. ఏ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలో ఎంచుకోవాలి. ’ఠి’ ఆకారంలోని నెయిల్ స్టికర్ తీసుకొని పై ఫొటోలో చూపినట్లు గోటిపై అతికించాలి. (పెయింటర్స్ టేప్ అని హార్డ్‌వేర్ షాప్‌లో లభిస్తుంది. దీన్ని ఇంగ్లీష్ ‘వి’ షేప్‌లో కత్తిరించి, వాడచ్చు) 2. ముందుగా బేస్‌కోట్: బేస్‌కోట్ పాలిష్ తీసుకొని, బ్రష్‌తో ఒక పొర వేయాలి. స్టికర్ చివర్ల వరకు బేస్‌కోట్ వేయాలి. 3. నెయిల్ పాలిష్: బేస్‌కోట్ ఆరిన తర్వాత ఎరుపు, పసుపు, నీలం.. ఏదైనా నచ్చిన నెయిల్పాలిష్తో రెండు పూతలు వేయాలి. టేప్ చివర్లకు కూడా సరిగ్గా పాలిష్ అంటేలా వేయాలి. 4. టేప్ తొలగింపు: నెయిల్‌పాలిష్ పూర్తిగా ఆరేంతవరకు టేప్‌ను అలాగే ఉంచకూడదు. 3-4 నిమిషాలవ గానే గోరుకు అతికించిన స్టికర్ లేదా టేప్‌ను ఒకవైపు పట్టుకొని తీసేయాలి. సన్నని బ్రష్‌తో నెయిల్‌పాలిష్ రిమూవర్ అద్దుకొని, ఎక్కడైనా అదనంగా పాలిష్ అంటితే అక్కడ జాగ్రత్తగా తుడిచేయాలి. పాలిష్ ఆరాక మరో టాప్ కోట్ వేశారంటే గోళ్లు చూడముచ్చటగా ఉంటాయి.