నెయిల్ ఆర్ట్ | Nail Art | Sakshi
Sakshi News home page

నెయిల్ ఆర్ట్

Published Sat, Apr 23 2016 10:43 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

నెయిల్ ఆర్ట్

నెయిల్ ఆర్ట్

ఫ్యాషన్ అనగానే డ్రెస్సులు, హెయిర్ స్టయిల్, జ్యూయెలరీ అంటూ ఆలోచిస్తామే తప్ప... గోళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకోం.  పెరిగితే కత్తిరిస్తాం. ఏదో ఒక రంగు నెయిల్ పాలిష్ పూసేస్తాం. అక్కడితో వాటిని వదిలేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు అంటారు ఫ్యాషన్ నిపుణులు. అందంగా తీర్చిదిద్దితే నఖసౌందర్యం మిగతా వాటన్నిటినీ తీసి పారేస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఇటీవలి కాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాధాన్యతను సంతరించు కుంటోంది. మరి ఆ కళలో మీరెందుకు వెనకబడాలి! వారానికో కొత్త డిజైన్ నేర్చేసుకోండి.
 
ఈ డిజైన్ కోసం కావలసినవి నాలుగు రంగుల నెయిల్ పాలిష్‌లు... నీలం, నలుపు, తెలుపు, సిల్వర్. అయితే ఇవే రంగులు వేయాలని లేదు. ఏ రంగులైనా ఎంచుకోవచ్చు. కాంబినేషన్‌ను జాగ్రత్తగా ఎంచుకుంటే సరిపోతుంది.
 
1. ముందుగా గోరు మీద బ్లూ కలర్ నెయిల్ పాలిష్‌ను వేయాలి.
 
2. తర్వాత తెలుపు రంగు పాలిష్‌ను తీసుకుని 2వ నంబర్ ఫొటోలో చూపినట్టు క్రాస్‌గా పూయాలి.
 
3. బ్లాక్ నెయిల్ పాలిష్‌ను తీసుకుని, తెలుపు రంగు ఉన్న భాగంపై చారలుగా వేసుకోవాలి.
 
4. నల్లని చారలపైన, నీలం-తెలుపు కలిసిన చోట సిల్వర్ కలర్ పాలిష్‌ను సన్నగా పూయాలి.
 
5. రంగు బాగా ఆరిపోయిన తర్వాత అన్నిటి మీద మరొక పూత పూయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement