Fashion Experts
-
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు)
-
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు)
విజయవాడ: ఫ్యాషన్ షోలో తళుక్కుమన్న మోడల్స్ (ఫొటోలు) -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది! -
Komal Pandey: మిడిల్ క్లాస్ నుంచి ఫ్యాషన్ స్టార్‌గా..
సోషల్ మీడియా వేదికగా నేటి యువతరం తమలోని ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ సోషల్ స్టార్లుగా ఎదుగుతూ.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కొందరు మాత్రం ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటారు. కానీ, ఇండియన్ యూట్యూబర్, ఫ్యాషన్ బ్లాగర్, మోడల్, స్టైలిస్ట్, కంటెంట్ క్రియేటర్ ఫ్యాషన్ క్వీన్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ‘కోమల్ పాండే’ ఆరేళ్లుగా సోషల్ స్టార్‌గా నిలుస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఫ్యాషనబుల్‌గా ఎలా ఉండాలో వివరిస్తూ... రీయూజబుల్ ఫ్యాషన్‌ను పరిచయం చేస్తూ డిజిటల్ వరల్డ్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల కోమల్ పాండే 1994లో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. బి.కామ్ చేసిన కోమల్‌కు చిన్నప్పటినుంచి ఫ్యాషనబుల్‌గా ఉండడమంటే ఎంతో ఇష్టం. దీంతో రోజుకోరకంగా తయారై కాలేజీకి వెళ్లేది. ఆమెను చూసిన ఫ్రెండ్స్ ‘నువ్వు చాలా స్టైలిష్‌గా ఉన్నావు! మోడలింగ్ ట్రై చేయెచ్చు కదా!’ అనేవారు. అయితే ఆ సమయంలో .. బాయ్‌ఫ్రెండ్ తో ప్రేమలో ఉన్న కోమల్... వాళ్ల మాటలు అంతగా పట్టించుకోలేదు. అలా నాలుగేళ్లు గడిచిన తరువాత బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది. లుక్ ఆఫ్ ది డే.. లవ్ బ్రేకప్ను మర్చిపోవడానికి తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ రంగంలోకి తనదైన శైలిలో అడుగులు వేసింది. 2015లో ‘లుక్ ఆఫ్ ది డే’ పేరిట తన ఫ్యాషన్ కెరీర్ ను ప్రారంభించింది. రోజుకోరకంగా తయారై ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టేది. కోమల్ ఫ్యాషన్ బుల్ ఫోటోలు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌కు నచ్చడంతో ఫాలోవర్స్ సంఖ్య పదివేల నుంచి 50 వేలకు చేరింది. ఈ ప్రోత్సాహంతో కోమల్ ‘‘ది కాలేజీ కోచర్’’ పేరిట బ్లాగ్‌ను ప్రారంభించింది. దీనిలో తక్కువ ఖర్చుతో ఫ్యాషన్, పాకెట్ ఫ్రెండ్లీ స్టైల్, బ్యూటీ, లుక్ బుక్స్, లేటెస్ట్ ట్రెండ్స్‌పై వీడియోలు పోస్టు చేసేది. ఉద్యోగం వదిలేసి.. 2015 నవంబర్‌లో కోమల్ బ్లాగ్‌ను గుర్తించిన ‘పాప్‌క్సో’ చానెల్ కోమల్‌కు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. పాప్క్సోలో చేరిన ఏడాదిన్నరలోనే 400 వీడియోలు చేసి కోమల్ మరింత ఫేమస్ అయ్యింది. అప్పుడే కోమల్‌కు ఓ ఆలోచన వచ్చింది. ‘‘నాలో ఇంత టాలెంటు దాగుందా? అయితే నేను ఎందుకు ఒకరి దగ్గర పనిచేయాలి? నా ప్రతిభను నమ్ముకుంటే నేనే బాస్‌గా ఎదుగుతాను!’’ అనుకోని వెంటనే పాప్క్సోలో ఉద్యోగం మానేసింది. అ తరువాత 2017లో తన సొంత యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. యూట్యూబ్ చానల్ల్లో రోజూ రకరకాల ఫ్యాషన్ లపై వీడియోలు రూపొందించి పోస్టుచేసింది.. వాటికి మంచి స్పందన రావడంతో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. దీంతో ఆదాయం లక్షల్లో వస్తోంది. 2015 నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియా స్టార్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ.. మరోపక్క హనర్, వివో, గార్నియర్, మెబ్లిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను చిన్నప్పటి నుంచి స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు ఇష్టపడేదాన్ని. ఆ ఇష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చాలామంది ఫ్యాషన్ అంటే ధనవంతులకే సొంతమనుకుంటారు. అది నిజం కాదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఫ్యాషన్ స్టార్‌గా ఎదిగాను. ఫ్యాషన్‌గా ఉండాలంటే రోజూ కొత్తగా, ట్రెండీగా ఉండేలా ప్రయత్నించాలి. అయితే మీ ఫ్యాషన్ చాలా సింపుల్‌గానూ, సౌకర్యంగానూ ఉండేలా చూసుకోవాలి’’ అని కోమల్ చెప్పింది. -
నెయిల్ ఆర్ట్
ఫ్యాషన్ అనగానే డ్రెస్సులు, హెయిర్ స్టయిల్, జ్యూయెలరీ అంటూ ఆలోచిస్తామే తప్ప... గోళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకోం. పెరిగితే కత్తిరిస్తాం. ఏదో ఒక రంగు నెయిల్ పాలిష్ పూసేస్తాం. అక్కడితో వాటిని వదిలేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు అంటారు ఫ్యాషన్ నిపుణులు. అందంగా తీర్చిదిద్దితే నఖసౌందర్యం మిగతా వాటన్నిటినీ తీసి పారేస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఇటీవలి కాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాధాన్యతను సంతరించు కుంటోంది. మరి ఆ కళలో మీరెందుకు వెనకబడాలి! వారానికో కొత్త డిజైన్ నేర్చేసుకోండి. ఈ డిజైన్ కోసం కావలసినవి నాలుగు రంగుల నెయిల్ పాలిష్‌లు... నీలం, నలుపు, తెలుపు, సిల్వర్. అయితే ఇవే రంగులు వేయాలని లేదు. ఏ రంగులైనా ఎంచుకోవచ్చు. కాంబినేషన్‌ను జాగ్రత్తగా ఎంచుకుంటే సరిపోతుంది. 1. ముందుగా గోరు మీద బ్లూ కలర్ నెయిల్ పాలిష్‌ను వేయాలి. 2. తర్వాత తెలుపు రంగు పాలిష్‌ను తీసుకుని 2వ నంబర్ ఫొటోలో చూపినట్టు క్రాస్‌గా పూయాలి. 3. బ్లాక్ నెయిల్ పాలిష్‌ను తీసుకుని, తెలుపు రంగు ఉన్న భాగంపై చారలుగా వేసుకోవాలి. 4. నల్లని చారలపైన, నీలం-తెలుపు కలిసిన చోట సిల్వర్ కలర్ పాలిష్‌ను సన్నగా పూయాలి. 5. రంగు బాగా ఆరిపోయిన తర్వాత అన్నిటి మీద మరొక పూత పూయాలి.