Rashmika Mandanna Explains Why She Recently Went Missing, Deets Inside - Sakshi
Sakshi News home page

అందుకే కొన్ని రోజులు మిస్సయ్యా!

Published Tue, May 2 2023 4:33 AM | Last Updated on Tue, May 2 2023 8:52 AM

Rashmika Mandanna explains why she recently went missing - Sakshi

రష్మికా మందన్నా

‘‘అందరూ క్షమించాలి. కొన్ని రోజులుగా మిమ్మల్ని మిస్సవుతూ వచ్చాను. ఎందుకంటే నెట్‌వర్క్‌ లేని ప్రాంతంలో షూటింగ్‌ చేస్తున్నాను’’ అని రష్మికా మందన్నా సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెయిన్‌ బో’. ఇందులో దేవ్‌ మోహన్‌ హీరో. ఈ చిత్రం షూటింగ్‌ కొన్నాళ్లు నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో జరిగింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయి, నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతానికి రావడంతో రష్మిక పై విధంగా పేర్కొన్నారు.

ఇంకా ఈ చిత్రం గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్‌ చెన్నైలో కొన్ని రోజులు ‘రెయిన్‌ బో’ షూటింగ్‌ చేశాం. ఆ తర్వాత కొడైకెనాల్‌ వెళ్లాం. అక్కడ షూట్‌ చేసి, మున్నార్‌లో మొదలుపెట్టాం. ఈ రెండు ప్రాంతాల్లోనూ నెట్‌వర్క్‌ లేదు. అయితే షెడ్యూల్‌ చాలా కూల్‌గా జరిగింది. కొడైకెనాల్‌లో నా గది నుంచి సూర్యోదయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభూతి. మంచుకి తడిచిన పువ్వులు కంటికి హాయినిచ్చాయి. మున్నార్‌ కూడా అంతే. అందమైన, ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడం మనసుకి ఉల్లాసంగా అనిపించింది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement