ఏమిటిది.. ఇంద్రధనస్సు ఇలా వర్ణరహితంగా పాలిపోయినట్లు కనిపిస్తోందని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఏడు రంగుల రెయన్‌బో కాదు.. అరుదుగా కనిపించే ‘తెల్ల ఇంధ్రధనుస్సు’. దీన్ని ‘ఫాగ్‌బో’ అని కూడా పిలుస్తారు. అంటే పొగమంచులోని నీటి బిందువులపై సూర్యకాంతి పరావర్తనం, వక్రీభవనం చెందినప్పుడు ఇలా కనిపిస్తుందన్నమాట. పొగమంచులోని నీటి బిందువులు 0.05 మిల్లీమీటర్లకన్నా చిన్నవిగా ఉండటం వల్ల వాటిపై సూర్యకిరణాలు పడగానే అవి అలికినట్లు అయిపోయి ఇలా ఒకే రంగు కనిపిస్తుందట.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న మారిన్ హెడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో కనిపించిన ఈ ‘ఫాగ్‌బో’ను స్టూ బెర్మన్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వాస్తవానికి ఫాగ్‌బోలోనూ కొన్ని రంగులు అత్యంత స్వల్పస్థాయిలో కనిపిస్తాయని.. ఇంద్రధనుస్సు బయటి, లోపల అంచుల వెంబడి ఎరుపు, నీలం రంగులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్ సలహా
Comments
Please login to add a commentAdd a comment