
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణాన్ని అధికారికంగా ప్రకటించిన కొన్ని నిమిషాలకే లండన్‌లోని బకింగ్‌హమ్ ప్యాలెస్‌పై జంట ఇంద్రధనుస్సులు కనిపించడం నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. రాణి మరణవార్త తెలియగానే ప్రజలు పెద్ద ఎత్తున ప్యాలెస్ వద్దకు చేరుకొని ‘గాడ్ సేవ్ ద క్వీన్’అంటూ జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా వారికి ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు కనిపించడంతో వాటిని రాణి ఎలిజబెత్–2, ఆమె భర్త ఫిలిప్‌కు ప్రతీకగా ప్రజలు భావించారు. రాణి, రాజు తిరిగి ఆకాశంలో కలుసుకున్నారంటూ చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం