ఆరోగ్యానికి ఇంద్రధనుస్సు రుచులు
తిండిగోల
వాన వచ్చినప్పుడు మాత్రమే ఇంద్రధనుస్సు వస్తుంది. కానీ ఇంద్రధనుస్సులో ఉండే రంగుల్లో కూరగాయలన్నీ ఉంటాయి. వానల్లేనప్పుడు కూడా వాన పడేటప్పుడు మాత్రమే వెల్లివిరిసే రంగుల కూరగాయలు తింటుంటే మన ఆరోగ్యం ఎప్పుడూ ఇంద్రధనుస్సంత అందంగా ఉంటుంది. విబ్జియార్ అని పిలిచే ఆ రంగు కూరగాయలను తినాలంటే... వి ఫర్ వయొలెట్ అంటూ వంకాయ; ఐ ఫర్ ఇండిగో అంటూ ఆలివ్స్, ఇండిగో కలర్‌లో ఉండే సోయాబీన్స్, బి ఫర్ బ్లూ అంటూ నేరేడు, జీ ఫర్ గ్రీన్ అంటూ ఆకుకూరలూ, వై ఫర్ ఎల్లో అంటూ పైనాపిల్, గుమ్మడి, ఓ ఫర్ ఆరెంజ్ అంటూ నారింజలు, ఆర్ ఫర్ రెడ్ అంటూ స్ట్రాబెర్రీస్, పుచ్చకాయలు తింటే మేలు. అయితే తెల్లరంగులో ఉండే ఉప్పు, వరి, నెయ్యితో కాస్త జాగ్రత. కానీ తెల్లగా ఉండే ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు.