ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌కు చెక్‌! అందానికి అందం! | Check these Health Benefits of Eating Vegetables | Sakshi
Sakshi News home page

ఇవి తింటే! బీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌కు చెక్‌! అందానికి అందం!

Published Mon, Feb 26 2024 3:22 PM | Last Updated on Mon, Feb 26 2024 3:38 PM

Check these Health Benefits of Eating Vegetables - Sakshi

మనలో చాలా మందికి కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉండదు. అలాగే  కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన అలవాటు అని తెలిసినా, పెద్దగా  పట్టించుకోరు. కార్బోహైడ్రేట్లు లేకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు  రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కూరగాయలు-ప్రయోజనాల  గురించి తెలుసుకుందాం.

కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి.  కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. విటమిన్‌-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్‌, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌ కూరల్లో ఎక్కువగా దొరుకు తాయి. ఇది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్‌ నియంత్రకు దోహదపడుతుంది. బీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. 

ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నంటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినడం ఉత్తమం. ఈమధ్య  కాలంలో మైక్రో గ్రీన్స్‌ వాడకం బాగా పెరిగింది. 

బీర,సొర, దొండ, బెండ,  లేత చిక్కుళ్లు, గుమ్మడి కాయ కూరను కూడా తినాలి. క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్‌ ఓవెన్‌లో బేక్‌ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని,  కాస్త ఎక్కువ పరిమాణంలోనైనా  తినొచ్చు. ఇష్టమైన వాళ్లు కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది.  కడుపు నిండిన ఫీలింగ్‌  కూడా కలుగుతుంది. 

ఇన్‌ఫ్లమేషన్‌ : ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించుకోవాలంటే  కూరగాయలు  ఉత్తమమైన ఆహారం. వీటిల్లో పుష్కలంగా ఉండే  యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో  సహాయపడతాయి.

రక్తపోటు
అధిక బీపీతో బాధపడేవారు పోషకాలులభించే కూరగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సోడియం బాడీలోకి చేరుతుంది. ఈ నష్టాన్ని తగ్గించుకోవాలంటే బచ్చలికూర వంటి కూరగాయలు పొటాషియం, ఇతర పోషకాలు లభించే  కూరగాలు  తీసుకోవాలి. వీటిల్లోని  ఫైబర్ కూడా  గుండెకుచాలామంది.

ఫైబర్: 2020-2025 ఆహార మార్గదర్శకాల ప్రకారం, 2,000 క్యాలరీల ఆహారంలో రోజుకు  28 గ్రాముల ఫైబర్ కూడ  అందదు. అందుకే తృణధాన్యాలు, పండ్లు, చిక్కుళ్ళు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి.  చిలగడదుంపలు , బఠానీల్లో  ఆపిల్ కంటే ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. 

కళ్ళు: రోజంతా కంప్యూటర్స్‌ ఫోన్ వైపు చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యంమీదప్రభావం పడు తుంది.  కళ్ళను రక్షించు కోవాలనుకుంటే, ఎక్కువ కూరగాయలు తినడంతోపాటు  మధ్య మధ్యలో స్క్రీన్ బ్రేక్‌లు తీసు​కోవడం మంచింది. తులసి, క్యారెట్లు, మొక్కజొన్న, ఎర్ర మిరియాలు, బచ్చలికూర ,బ్రోకలీలో కంటినిరక్షించే కెరోటినాయిడ్లు దొరుకుతాయి.  అలాగే లుటీన్ , జియాక్సంతిన్ అనేవి రెండు కెరోటినాయిడ్లు, వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత (AMD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మం:  చర్మ తేమగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తినాలి.  టొమాటోల్లోని  లైకోపీన్‌  చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది  అవకాడోలు ,నీటి కంటెంట్‌  ఎక్కువగా ఉండే దోసకాయలు  ఆకుకూరలు లాంటివి  చర్మంలోని తేమను, మృదుత్వాన్ని కాపాడతాయి.

బ్లడ్ షుగర్
కూరగాయలలో కేలరీలు తక్కువ, ఫైబర్ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  పిండి పదార్థం ఎక్కువ గా ఉండే దుంప కూరలుమినహా మిగిలినవి రక్తంలో చక్కెర  స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అందుకే సహజసిద్ధంగా పండించిన కూరగాలు కేన్సర్‌ నివారణలో పనికొస్తాయి. బ్రస్సెల్స్ మొలకలు , కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్టు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి , ఫైటోకెమికల్స్, అలాగే సల్ఫోరాఫేన్ (బ్రోకలీలో అత్యధికం)లో ఎక్కువగా ఉంటాయి. 

మెదడు
మెదడును పదునుగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం సరైన మార్గం. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, మైండ్ డైట్‌లో కీలకం, అల్జీమర్స్ వ్యాధి, మతిభ్రమణం ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి  సాయపడతాయని పరిశోధకులు తేల్చారు. యాంటీఆక్సిడెంట్లు,ఫోలేట్ మీ మెదడుకు కీలకమైన పోషకాలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement