సీజన్ మారేకొద్దీ మనం డైట్ కూడా మార్చాలి. ఆ సీజన్ లో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం, కొన్నింటిని తీసుకోక΄ోవడం వంటివి చేయాలి. దీంతో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది వర్షాకాలం. ఈ సీజన్‌లో కొన్ని పుడ్స్ తీసుకోకac΄ోవడమే మంచిది. అవేంటో తెలుసుకుందాం.
ఫ్రూట్ సలాడ్.
మార్కెట్లో చాలా మంది ఫ్రూట్స్‌ని కట్ చేసి ఇస్తారు. వీటిని తీసుకోవడం తగ్గించాలి. వారు ఎలా నిల్వ చేస్తున్నారో తెలియదు. ఇందులో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది.
నిల్వ ఉన్న ఆహారం
కొన్నిసార్లు మన ఇంట్లో ఆహారం మిగిలి΄ోతుంది. దీనిని ఎక్కువ సమయం స్టోర్ చేసి తినడం తగ్గించాలి. ఎందుకంటే ఈ టైమ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫుడ్‌పాయిజన్‌లా మారే అవకాశం ఉంది. అందుకనే ఈ ఫుడ్‌ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.
వేపుళ్లు, జంక్ ఫుడ్
చల్లని వాతావరణంలో చాలా మంది సమోసా, పకోడి వంటి ఫ్రై ఐటెమ్స్ ఎక్కువగా తింటారు. అయితే, వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా తక్కువగా తినాలి. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. బయట చేసే ఈ ఫుడ్స్‌లో ఏ నూనె కలుస్తుందో తెలియదు కాబట్టి అలాంటి వాటి జోలికిపోకుండా ఉండటం చాలా ఉత్తమం.
సీఫుడ్..
చేపలు, ఇతర సీ ఫుడ్‌ని ఈ టైమ్‌లో తీసుకోవడం తగ్గించడం, లేదా పూర్తిగా మానడం మంచిది. ఎందుకంటే వర్షం నీటిలో ఉన్న ఈ సీ ఫుడ్స్ తీసుకుంటే డయేరియా, వాంతులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆకుకూరలు..
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఆకుకూర, క్యాబేజీ వంటి వాటి వాడకాన్ని వర్షాకాలంలో తగ్గిస్తే మంచిది. ఇందులో బ్యాక్టీరియా, ΄ారాసైట్స్ పెరగడమే ఇందుకు కారణం. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే చక్కగా కడిగి ఉడికించి వండితే రిస్క్ తగ్గుతుంది.
స్పౌట్స్..
మొలకల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. కానీ, వీటిలో ఈ సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్ ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తినాలనుకుంటే చక్కగా క్లీన్ చేసి
డెయిరీ ప్రొడక్ట్స్:
అయిన పాలు, చీజ్, పనీర్ కూడా ఈ టైమ్‌లో తక్కువగా తీసుకోవాలి. దీనికి కారణం వీటిని ఎక్కువగా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని తీసుకున్ననప్పుడు కూడా సరిగ్గా పాశ్చరైజ్డ్ అయ్యాయా, ఎక్స్‌పైర్ డేట్ ఎప్పటివరకూ ఉందనేది తెలుసుకుని తీసుకోవాలి. లేదంటే వీటి బదులు పెరుగు, పాలని తీసుకోవచ్చు.
(చదవండి: బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!)
Comments
Please login to add a commentAdd a comment