వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..! | How To Prevent Colds And Flu In This Rainy Season | Sakshi
Sakshi News home page

వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Published Tue, Jul 16 2024 1:49 PM | Last Updated on Tue, Jul 16 2024 3:55 PM

How To Prevent Colds And Flu In This Rainy Season

సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!

వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జలుబు, జ్వరం..
ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

దోమలు..
రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.

డెంగ్యూ..
డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.

కలరా..
కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.

టైఫాయిడ్..
టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.

హెపటైటిస్..
కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. 

ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్‌ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

  • పోషకాహారం తీసుకోవాలి.

  • ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.

  • కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

  • దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.

  • దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.

  • అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. 

(చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement