వర్షాకాలం వ్యాధుల కాలంగా చెప్పొచ్చు. అదీగాక ఈ కాలంలో వాతారవరణం అంతా చల్లబడిపోవడంతో చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. దీనికి తోడు వాతావరణంలో పెరిగిన తేమ కారణంగా రోగనిరోధక వ్యవస్థ అనారోగ్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో ఇలాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. జీర్ణక్రియకు మద్దతు ఇచ్చేలా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ కూరగాయలని మీ డైట్‌లో జోడించాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే..
ఈ మాన్‌సూన్ డైట్‌లో చేర్చుకోగల కూరగాయల జాబితాన ఏంటంటే..
వర్షాకాలంలో ప్రయోజనకరంగా ఉండే కూరగాయలు ఏవంటే..
కాకరకాయ
దీనిలోని చేదు లక్షణం రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
ఆనపకాయ
కడుపులో తేలికగా ఉంటుంది . సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
పొట్లకాయ
ఇది మంచి డైటరీ ఫైబర్. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. పొట్లకాయలోని పీచు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.
బచ్చలికూర
బచ్చలికూరలో అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. అంతేగాక తేమతో కూడిన వాతావరణం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
మెంతి ఆకులు
మెంతి ఆకులు (మేతి) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. మెంతి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటాంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన మంచి ఆకుకూర కూడా.
మునగకాయలు
మునగకాయలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శ్వాసకోశ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల బారినపడకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
క్యారెట్లు
క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి దృష్టిని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు అంటువ్యాధుల నుంచి రక్షించడానికి, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి.
బీట్రూట్
బీట్‌రూట్‌లోని అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి. వర్షాకాలంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి మెరుగైన రక్త ప్రసరణకు ప్రయోజనకరంగా ఉంటుంది.
గుమ్మడికాయ
గుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ, ఈ తోపాటు ఫైబర్‌లు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అయితే దాని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు చెక్‌పెట్టడంలో కీలకంగా ఉంటుంది.
బెండకాయ
దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫోలేట్, ఫైబర్‌ల మూలం. బెండకాయలో అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రబలంగా ఉండే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
(చదవండి: బరువు తగ్గేందుకు కీటో డైట్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment