
హైదరాబాద్ నగరంలో అద్భుతమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అద్భుతమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆకాశంలో బుధవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు, భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరంలో సూర్యుడి చుట్టూ రెయిన్ బో (ఇంద్రధనస్సు) అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘సన్ హాలో’ అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సన్‌హాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
కాగా మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్ బో చాలా స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగానే ఇంద్రధనస్సు దర్శనమిచ్చిందంటూ నగర వాసులు మురిసిపోతున్నారు. వర్షం కారణంగా, వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయనీ, అవి క్రిస్టల్స్‌గా మారతాయని, క్రిస్టల్స్‌గా మారిన నీటి బిందువులలో సూర్యుడి కాంతి ప్రసంరించినప్పుడు ఇలా రెయిన్ బో ఏర్పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.