ఇంద్రధనుస్సు చీరకట్టే..!
ఎండావాన కలసిన వేళ... ప్రకృతిలో ఒక పులకింత... ఆకాశంలో ఒక వినూత్న తేజస్సు ఆకాశ వీధికి తోరణం కట్టినట్లు ఆకర్షణీయమైన ఇంద్ర ధనుస్సు. చూపరుల మదిలో ఉల్లాసాల ఉషస్సులు ప్రసరింపజేస్తున్న ఈ సోయగాల ఇంద్ర ధనుస్సు కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం కనిపించింది. ఆకాశపు తెల్ల కాగితంపై కోణమానిని పెట్టి వెలుగు రేఖ గీసినట్టనిపించే ఈ దృశ్యం నిర్మలాకాశ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసింది.
సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
ఇంద్రధనుస్సు చీరకట్టే..!