కలలో రెయిన్ బో! | Rainbow dream | Sakshi
Sakshi News home page

కలలో రెయిన్ బో!

Published Tue, Feb 24 2015 11:13 PM | Last Updated on Mon, Aug 20 2018 3:56 PM

కలలో రెయిన్ బో! - Sakshi

కలలో రెయిన్ బో!

ఇంద్రధనసు... అనే మాట వినబడగానే మనసులో భావుకత తొంగిచూస్తుంది. మరి కలలో కనిపిస్తే? స్థూలంగా చెప్పాలంటే, ‘అంతా బాగుంది’ అనే భావనను ఈ కల ప్రతిఫలిస్తుంది. విజయం ఇచ్చిన ‘కిక్’ కావచ్చు, డబ్బు ఇచ్చిన ‘సౌఖ్యం’ కావచ్చు, కీర్తి ఇచ్చిన ‘సంతోషం’ కావచ్చు. ‘నిన్నటి వరకు కష్టాలు పడ్డావు. ఇక అవి తీరినట్లే’ అనే సందేశాన్ని ఈ కల మార్మికంగా  ఇస్తుంది. స్నేహసంబంధం కావచ్చు, భార్యాభర్తల అనుబంధం  కావచ్చు...ఇలా మానవ సంబంధాల్లో కొనసాగే సంతోషాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు మీలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఈ కల పట్టిస్తుంది. కళాకారులకు, రచయితలకు ఈ కల అనేది ‘సృజనాత్మక అన్వేషణ’ను సూచిస్తుంది.

 కొత్తగా ఆలోచించడం, నిన్నటి వరకు లేని కొత్త ఉత్సాహం పొందడం, తనను తాను కొత్తగా మలుచుకోవడం... ఇలాంటివన్నీ ఈ కల ప్రతిఫలిస్తుంది. అరబ్ దేశాలలో  ఈ కలకు...‘ప్రేమ గాఢత’, ‘జటిల సమస్యలకు పరిష్కారం దొరకడం’, ‘శుభవార్త’, ‘జీవితాన్ని మలుపు తిప్పే అదృష్టం’... మొదలైన అర్థాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఈ కలకు ‘అసాధారణ విజయం’ అనే అర్థం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement