మనుషుల వ్యర్థాన్ని దానం చేస్తే ఏడాదికి కోటిన్నర
హ్యూమన్ మైక్రోబ్స్ కంపెనీ షాకింగ్ ఆఫర్, వైరల్
గతంలో చనిపోయిన మనిషి శరీరం వ్యర్థం ఎందుకూ పనికిరాదు అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుతం అలా కాదు. చనిపోయిన (నిబంధనల ప్రకారం) వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణ దానం చేయవచ్చు. లేదంటే మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు నిమిత్తం దానం చేయవచ్చు. తాజాగా ఒక సంస్థ మానవుల మలాన్ని దానం చేయాలని కోరుతోంది. ఇందుకు వారికి కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది షాకింగ్‌గా అనిపించినా, మీరు చదివింది నిజమే. ఎందుకో తెలుసుకోవాలటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
అమెరికా, కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే సంస్థ వైద్య పరిశోధనలు, ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయిత ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది.
మానవ మలాన్ని కంపెనీ ఏమి చేస్తుంది?
ఆరోగ్యకరమైన, కలుషితంకానీ, వ్యాధి-నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారినుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాదిరకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారి తీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.
There's a man currently paying $500 per 💩 sample on a hunt to try and find the "0.1% of people with healthy, unperturbed, disease-resistant microbiomes".
He's screened over 1 million people and still hasn't found what he's looking for. https://t.co/xyEyL1NXcp https://t.co/9Rt2hZdYzI pic.twitter.com/m0ZXQB7kcR— Katherine Champagne (@keccers) March 18, 2024
ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తోంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్ల ఒక్కో శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తారు. రోజూ మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు 180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) చెల్లించనుంది. అయితే దాదాపు 10లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది.
హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1 శాతం కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది, తద్వారా వారు ఈ "అధిక నాణ్యత గల మలం దాతలను" పరిశోధకులతో కనెక్ట్ చేస్తుంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ ,వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే, సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయనీ, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తర తరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయోమ్ పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1 శాతం మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు, వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.
హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్‌సైట్‌లో ఉన్న ఒక వీడియోలో “స్టూల్ డోనార్” కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరినైనా కాపాడవచ్చని వివరించింది. అలాగే సెలక్ట్ అయిన డోనార్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment