chronic diseases
-
మందులు ఇవ్వండి మహాప్రభో
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: వరదలో చిక్కుకున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వైద్య సేవలు, మందులు అందక అగచాట్లు పడుతున్నారు. కావాల్సిన ఆహారం, మందులు బయటకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితులు లేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వద్దామంటే ప్రభుత్వం కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైద్య శాఖ మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ వరదల్లో చిక్కుకుపోయిన వ్యాధిగ్రస్తులకు ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. వరద ప్రాంతాల్లో అనారోగ్య సమస్యల బారినపడిన వారు వేసుకోవాల్సిన మందులపై వైద్య శాఖ సోమవారం ప్రి్రస్కిప్షన్ను జారీ చేసింది. మందులు ఇవ్వకుండా ఈ ప్రి్రస్కిప్షన్ జారీ చేసి ఏం ప్రయోజనం అని బాధితులు మండిపడుతున్నారు. మా కష్టం పగవాడికి కూడా రాకూడదు నాకు రెండు కాళ్లు లేవు. పైగా గర్భిణిని కూడా. దీనికి తోడు మా అమ్మ మెదడు సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. ఇద్దరం నిస్సహాయులం. ఎవరైనా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తారని చాలా ఎదురుచూశాం. కానీ ఎవరు రాలేదు. రెండు రోజులుగా నాకు, మా అమ్మకు ఆహారం లేదు. మాకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. – ఎస్కె. తాహిరున్నిసా, డాబాకొట్లు సెంటర్, సింగ్నగర్ఇదో విషమ ‘పరీక్ష’విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి, ప్రతినిధి : కుమార్తెలు ఐఐటీ మద్రాస్‌లో చదవాలన్న సంకల్పానికి వరద ముంపు విషమ పరీక్ష పెడితే.. ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఇద్దరు ఆడ బిడ్డలతో ఊరుకాని ఊర్లో.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాడు. పలకరించిన నాథుడు లేడు. తిన్నావా అని అడిగే దిక్కులేదు. కళ్ల ముందు బోట్లు తిరుగుతున్నా.. ఎక్కించుకునే వాడే లేడు. భీమవరానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్.. ఇద్దరు బిడ్డలతో కండ్రిగలోని ఓ పరీక్ష కేంద్రంలో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ ప్రవేశానికి సంబంధించి ఎంట్రన్స్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం వచ్చారు. పరీక్ష కేంద్రానికి ఉదయాన్నే చేరుకున్నారు. అయితే వరద ఉధృతి పెరగడంతో ఆకస్మాత్తుగా పరీక్ష రద్దయ్యింది. అప్పటికే ఆ ప్రాంతాన్ని నీళ్లు చుట్టుముట్టాయి. అక్కడి నుంచి బయట పడేందుకు ట్రాక్టర్ ఎక్కితే.. డ్రైవర్ మధ్యలో దించేశాడు. ఇక అంతే.. సోమవారం ఉదయం 11 గంటలకు వరకూ తిండీతిప్పల్లేకుండా నీళ్లలో ఇద్దరు ఆడ బిడ్డలతో ఉండిపోయారు. ప్రాణాల కోసం ఆరాటం.. ఆకలితో పోరాటం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న ‘చిన్నా’ కన్నవారి కోసం పడిన ఆవేదన వర్ణనాతీతం. సింగ్‌నగర్‌లోని డాబాకొట్లు సెంటర్లో మనిషి ఎత్తు లోతులో నీళ్లు చేరాయి. చిన్నా నివాసం ఉంటున్న ఇల్లు మొత్తం నీటిలో మునిగిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున కట్టుబట్టలతో ఇంటి మేడపైకి చేరుకున్నారు. వర్షం వచి్చనా తడుస్తూనే అక్కడే ఉండిపోయారు. ఇంటిలో వంట సామగ్రి మొత్తం తడిచిపోయింది. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. సోమవారం ఉదయం 11 గంటలకు పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లయ్ఓవర్పైకి చేరుకున్నాడు. ఆహారం కోసం వెతుకులాట తప్ప దక్కిందేమీ లేదు. కనుచూపు మేరలో వరద నీళ్లు తప్ప.. తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి దాతలు ఇచ్చిన పాల ప్యాకెట్లతో కన్నవారి కోసం మళ్లీ నీటిలో నడక ప్రయాణం ప్రారంభించాడు.’’ జీవితం ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ పడవలు షో కోసమే నీళ్లలో తిరుగుతున్నట్టు ఉంది. మాలో ఏ ఒక్కరినీ వాళ్లు ఒడ్డుకు తీసుకురాలేదు. ఇంకెన్నీ రోజులు చస్తూ బతకాలో తెలియడం లేదు – చిన్నా. దెబ్బతిన్న విద్యుత్ సరఫరాసాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దెబ్బతిన్న వ్యవస్థను సరిచేయడానికి 356 మంది సిబ్బందిని 102 బృందాలుగా నియమించినట్లు ఇంధనశాఖ తెలిపింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్‌లోకి బుడమేరు బ్యాక్ వాటర్ భారీగా రావడంతో ఒక్కోటీ 210 మెగావాట్ల సామర్థ్యం గల 6 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. -
మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
గతంలో చనిపోయిన మనిషి శరీరం వ్యర్థం ఎందుకూ పనికిరాదు అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుతం అలా కాదు. చనిపోయిన (నిబంధనల ప్రకారం) వారి అవయవాలను దానం చేయడం ద్వారా మరో నలుగురికి ప్రాణ దానం చేయవచ్చు. లేదంటే మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు నిమిత్తం దానం చేయవచ్చు. తాజాగా ఒక సంస్థ మానవుల మలాన్ని దానం చేయాలని కోరుతోంది. ఇందుకు వారికి కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది షాకింగ్‌గా అనిపించినా, మీరు చదివింది నిజమే. ఎందుకో తెలుసుకోవాలటే ఈ కథనాన్ని చదవాల్సిందే.అమెరికా, కెనడాలో పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే సంస్థ వైద్య పరిశోధనలు, ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. ఇందుకు వారికి పెద్ద ఎత్తున డబ్బును కూడా ముట్టచెప్పనుంది. అయిత ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్. ఒక ప్రత్యేకమైన బాక్టీరియా ఉండే మలం కోసమే కంపెనీ వెతుకుతోంది.మానవ మలాన్ని కంపెనీ ఏమి చేస్తుంది?ఆరోగ్యకరమైన, కలుషితంకానీ, వ్యాధి-నిరోధక సూక్ష్మజీవులు ఉండే వారినుంచి మలాన్ని సేకరిస్తుంది. పేగుల్లో ఉండే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఎందుకు ఉంటాయో నిర్ధారించుకునేందుకు వీరి మలాన్ని పరీక్షించనుంది కంపెనీ. సాధారణంగా మన పేగుల్లో వేలాదిరకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒకే రకమైన బ్యాక్టీరియాలో వివిధ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇవి పలు వ్యాధులకు దారి తీస్తాయి. ఇవి గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయి అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు.There's a man currently paying $500 per 💩 sample on a hunt to try and find the "0.1% of people with healthy, unperturbed, disease-resistant microbiomes". He's screened over 1 million people and still hasn't found what he's looking for. https://t.co/xyEyL1NXcp https://t.co/9Rt2hZdYzI pic.twitter.com/m0ZXQB7kcR— Katherine Champagne (@keccers) March 18, 2024 ఈ క్రమంలోనే మానవుల మలాన్ని కొనుగోలు చేస్తోంది హ్యూమన్ మైక్రోబ్స్. డోనర్ల ఒక్కో శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తారు. రోజూ మల విసర్జన చేసే వారికైతే ఏడాదికి దాదాపు 180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) చెల్లించనుంది. అయితే దాదాపు 10లక్షల మందిని పరీక్షిస్తే ఒక్కరు కూడా దొరకలేదని తెలుస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ తరతరాలుగా 0.1 శాతం కంటే తక్కువ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వ్యక్తులను ఎంపిక చేయనుంది. అంటే పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న కొద్ది మంది వ్యక్తుల కోసం కంపెనీ వెతుకుతోంది, తద్వారా వారు ఈ "అధిక నాణ్యత గల మలం దాతలను" పరిశోధకులతో కనెక్ట్ చేస్తుంది. సదరు వ్యక్తులను వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్ ,వ్యక్తులతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మలాన్ని డొనేట్ చేయవచ్చు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్ ప్రకారం, సంస్థ ఇచ్చే డబ్బు సరిపోకపోతే, సొంత ధరను నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలు గత కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరుగుతున్నాయనీ, జనాభాలో ఎక్కువ భాగం ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితి తర తరానికి విపరీతంగా క్షీణిస్తున్న సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇటీవలి మైక్రోబయోమ్ పరిశోధన ఆవిష్కరణలు ఈ ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయనే ఆశలను రేకెత్తించిన ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న 0.1 శాతం మంది వ్యక్తులు తమ పరిశోధనకు అవసరమని వెల్లడించింది. తద్వారా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు, వివిధ జీర్ణకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్సైట్లో ఉన్న ఒక వీడియోలో “స్టూల్ డోనార్” కావాలని పోస్ట్ చేసింది. ఈ హ్యూమన్ వేస్ట్ ఎవరినైనా కాపాడవచ్చని వివరించింది. అలాగే సెలక్ట్ అయిన డోనార్లకు హ్యూమన్ మైక్రోబ్స్ ముందుగానే డబ్బు చెల్లిస్తుంది. దాతలు డ్రై ఐస్ ఉపయోగించి శాంపిల్స్ షిప్పింగ్ చేయాలి. అంతేకాదు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. -
ఆమె వ్యాధి 'మెడికల్ మిస్టరీ'! ఏ భావోద్వేగాన్ని వ్యక్తం చేసినా ఇక అంతే..!
కొన్ని రకాల వ్యాధులు వైద్యానికి అంతు చిక్కని మిస్టీరియస్ వ్యాధుల్లా ఉంటాయి. బాబోయ్ ఇదేం వ్యాధి! అనేలా జుగుప్సకరంగా ఉంటాయి. ఆ వ్యాధిని ఫేస్ చేస్తున్న బాధితులకే కాదు చూస్తున్న వాళ్లను కూడా హడలెత్తిస్తాయి. అలాంటి అంతు చిక్కని విచిత్రమైన వ్యాధిని ఎందుర్కొంటోంది 20 ఏళ్ల బెత్ త్సంగరైడ్స్. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన బెత్ త్సంగరైడ్స్ అనే 20 ఏళ్ల అమ్మాయి వైద్య విధానానికి అందని ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎలాంటి భావోద్వేగాలకు స్పందించిందా ఇక అంతే!.. ఆమె శరీరీం యాసిడ్ పోసినట్లు భగభగమని మండిపోతుంటుంది. వెంటనే చర్మంపై దద్దుర్లతో కూడిన ర్యాషస్ వచ్చేస్తాయి. అవి అచ్చం కాలిన గాయాల మాదిరిగా దారుణంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఆమెకు సరిగ్గా 15 ఏళ్ల ప్రాయం నుంచి ఫేస్ చేస్తోంది. వైద్యులు సైతం ఆమె వ్యాధిని 'మెడికల్ మిస్టరీ'గా వ్యవహరించారంటే.. అది ఎంత విచిత్రమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని వైద్య భాషలో 'చలనశీత సమస్యలని' అంటారు. నవ్వడం దగ్గర నుంచి ఏడుపు వరకు ప్రతిదానికి ఆమె ముఖంపైన చర్మం రియాక్షన్ ఇచ్చేస్తుంది. దీంతో ఆమె ఆ బాధను భరించలేక బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయింది. అదీ కూడా ఓ గదిలో ఒంటిరిగా ఉండటమే. కనీసం బయటకు వెళ్లి గడిపే అవకాశం కూడా లేదు. వీచే గాలులకు, మంచి సుగంధభరితమైన వాసనలకు ఆమె చర్మం వెంటనే రియాక్షన్ చెంది ర్యాషస్ వచ్చేయడం మొదలైపోతుంది. ఈ అసాధారణ దీర్ఘకాలిక వ్యాధి కారణంగా సరిగా స్కూల్ ఎడ్యుకేషన్ సాగలేదు, స్నేహితులు కూడా లేకుండా పోయారని ఆవేదనగా చెబుతోంది. ఈ వింత వ్యాధిని టాచీకార్డియో సిండ్రోమ్(పీవోటీఎస్)గా నిర్థారించారు వైద్యులు. అమెరికా నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం..ఈ పీవోటీఎస్ వ్యాధికి సాధారణంగా మైకము, మూర్ఛ, దడ, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి కానీ ఆమెకు మాత్రం అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా అరుదుగా కొద్దిమందిలోనే కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి కారణంగా ఆమె ప్రేగులు, మూత్రపిండాలు సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధి కారణంగా ఆమె మొత్తం ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆమె ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదీపడితే అది తినేందుకు కూడా వీలులేదు. కనీసం బయట ఫుడ్‌ని కూడా ఆస్వాదించలేదు. ఒకవేళ తినాలనుకున్నా చాలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ చెఫ్‌లకు తనకు ఇచ్చే ఆహారం ప్రిపరేషన్‌కి సంబంధించిన జాగ్రత్తలు వివరించాలి. ఇంత తతంగం ఉంటేనేగానీ బయటకీ రాలేని స్థితి ఆ అమ్మాయి పరిస్థితి. ఈ రియాక్షన్లతో ఆమె ముఖం మచ్చలు మచ్చలుగా అసహ్యంగా తయారయ్యింది. కనీసం అద్దంలో చూసుకుంటేనే ఒక విధమైన ఇబ్బందికి అనిపిస్తుంది ఆమెకు. అయినప్పటికీ ఆ ఇబ్బందులన్నింటిని తట్టుకుని నూతన ఉత్సహాంతో గడిపేయత్నం చేస్తోంది. తన పరిస్థితి ఇంతే..! తానే బాగుండటానికి ప్రయత్నించాలని సమస్యతో పోరాడేలా తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే యత్నం చేస్తోంది. పైగా ముఖానికి మేకప్ వేసుకుని ఆకర్షణీయంగా కనిపించే యత్నం కూడా చేస్తోంది. . అయితే వైద్యులు ఈ మేకప్‌ని కూడా అస్సలు వినియోగించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే 'ఆమెకు ఆమె ఎలర్జీ' కదా!. ఐతే బెత్ త్సంగరైడ్స్కి మేకప్ వేసుకోవడమంటే చాలా ఇష్టమంటా..!. అలా మేకప్ వేసుకుని తనను తాను చూసుకోవడం ఇష్టం అని చెబుతుంది బెత్ త్సంగరైడ్స్. నిజానికి ఇలాంటి వ్యాధి పగవాడికి రాకూడదనిపిస్తోంది. అసలు ఎలాంటి భావోద్వేగం చెందించలేని స్థితి అంటే.. ఎంతటి దారుణమైన స్థితి. ఒకరకంగా చెప్పాలంటే జీవనమే స్థంబించనట్లు ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి తనలో ఆత్మవిశ్వాసాన్ని కూడగొట్టుకుని బతికే యత్నం చేస్తున్నందుకు హ్యాట్సాప్ అని చెప్పాలి కదూ..!. View this post on Instagram A post shared by Beth Tsangarides (@bethtsangarides) (చదవండి: జస్ట్ హెయిర్ డ్రైయర్ వాడినందుకు.. ఏకంగా రూ. 78 వేలు వసూలు చేసిన హోటల్ యాజమాన్యం!) -
విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఊపిరి సలపనివ్వడం లేదా? ఐతే ..
ఇది పొగచూరడం లాంటి ఏవో అడ్డంకులతో, ఊపిరిత్తుల్లో వచ్చే సమస్యతో, దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధితుల్ని వేధించే జబ్బు అని పేరును బట్టి తెలుస్తుంది. దగ్గు, ఆయాసంతో వ్యక్తమయ్యే ఈ సమస్య ప్రధానంగా పెద్దవారినే వేధిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక (జన్యు) కారణాలతో చిన్న వయసువారిలో కూడా కనిపించవచ్చు. పొగతాగే అలవాటుతో పురుషుల్లో, ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉంటే... ఈ కారణంగా మహిళల్లో ఈ జబ్బు కనిపించే అవకాశాలెక్కువ. అసలే దగ్గుతో ఊపిరి సలపనివ్వని ఈ సమస్య, చలి కాలంలోని చల్లటి వాతావరణానికి మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది. దీని పేరే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. సంక్షిప్తంగా సీఓపీడీ అని పిలిచే ఈ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. దగ్గు ప్రధానంగా లక్షణంగా వ్యక్తమయ్యే సీవోపీడీ సమస్య పెద్దల్లో... అందునా 40 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లూ, బీడీలూ, చుట్టలూ, హుక్కా కాల్చే వారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్మూ, ధూళితో పాటు బొగ్గుగనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండేవారిలోనూ, ఆభరణాలకు పూతపూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసేవారిలో కూడా ఇది ఎక్కువ. కారణాలు.. పొగతాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్నవారిలో ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే శ్వాసనాళాలు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా, కాస్త బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఛాతీ పట్టేసినట్లుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోని సందర్భాల్లో... దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సీవోపీడీ రావచ్చు. లక్షణాలు.. సీవోపీడీలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్రా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలా తీవ్రతను బట్టి ఈ వ్యాధిని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... గోల్డ్ 1 (మైల్డ్), గోల్డ్ 2 (మోడరేట్), గోల్డ్ 3 (సివియర్), గోల్డ్ 4 (వెరీ సివియర్). ఇక్కడ గోల్డ్ అనేది ‘గ్లోబల్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్’ అనే సంస్థకు సంక్షిప్త రూపం. ‘గోల్డ్’ సంస్థ... సీవోపీడీ మీద పరిశోధనలు చేస్తూ పల్మనాలజిస్టులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తుంది. సీవోపీడీ అనగానే కేవలం ఊపిరితిత్తుల సమస్య అనే అనుకుంటాం. కానీ బాధితులలో వివిధ అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలూ ఎక్కువే ఉంటాయి. మచ్చుకు... ఆస్టియో పోరోసిస్, హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కార్పెల్ పల్మొనాలె... మొదలైన సమస్యలతో ఇది కలిసి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలను గుర్తిస్తూ, చికిత్స అందించాల్సి ఉంటుంది, దీనినే ‘సిండమిక్ అప్రోచ్’ అంటారు. ఈ నెలలోనే 2024కు సంబంధించిన కొత్త చికిత్స మార్గదర్శకాలను ‘గోల్డ్’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి నిర్ధారణ.. స్పైరోమీటర్ అనే పరికరం సహాయంతో సీవోపీడీని నిర్ధారణ చేస్తారు. దీనితో కొన్ని శ్వాస పరీక్షలు చేసి, సమస్య తీవ్రత ఎంతో తెలుసుకుంటారు. అంటే మైల్డ్, మోడరేట్ లేదా సమస్య తీవ్రం (సివియర్)గా ఉందా అని తెలుసుకుంటారు. ఈ పరీక్షకు ముందరే... బాధితులను వ్యక్తిగతంగా / క్లినికల్‌గా పరీక్షించడంతో డాక్టర్లకు కొంత అవగాహన వస్తుంది. ఇలా చేసే క్లినికల్ పరీక్షల్లో బాధితుల వృత్తి వివరాలూ (ప్రొఫెషనల్ హజార్డ్స్), వారు పనిచేసే చోటు, వారుండే చోట కాలుష్య ప్రభావాలూ, పొగతాగడంలాంటి వారి అలవాట్లు... ఇవన్నీ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఐఓఎస్ అనే పరికరం ప్రారంభ దశలో ఉన్న సీవోపీడీని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అపోహ–వాస్తవం ఈ వ్యాధి ఉన్నవారు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ ఉంటారు. దాంతో ఇదో అంటువ్యాధిలా అనిపిస్తుంది గానీ నిజానికి ఇది అంటువ్యాధి కానే కాదు. చికిత్స.. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సీవోపీడీ లక్షణాలు కనిపించినప్పుడు దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి, సీవోపీడీని అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ (ఇన్హేలర్స్ / నెబ్యులైజర్స్)ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా, తేలిగ్గా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. సీవోపీడీకి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలో అప్‌కు వెళ్తూ చికిత్స పూర్తయ్యేవరకు కొనసాగించాలి. నాన్ ఫార్మలాజికల్ థెరపీ.. సీవోపీడీతో బాధపడేవారిలో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దానిని క్లియర్ చేసే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది. హోమ్ ఆక్సిజన్ థెరపీ : ఇది చికిత్సలో మరో ప్రక్రియ. తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారికి 19 గంటల పాటు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది. పల్మునరీ రీ–హ్యాబిలిటేషన్: ఇది చికిత్సలో ఇంకో ప్రక్రియ. తేలిక నుంచి ఓ మోస్తరు వరకు అవసరమున్న వ్యాయామాలు (పర్స్ లిప్ బ్రీతింగ్), అబ్డామినల్ బ్రీతింగ్‌తో పాటు చిన్న బరువులతో కండరాలను బలంగా చేసే (మజిల్ స్ట్రెంతెనింగ్) వ్యాయామాలు చేయడం అవసరం. నివారణ.. పొగతాగే అలవాటునుంచి దూరంగా ఉండటం / అప్పటికే పొగతాగే అలవాటుంటే వెంటనే మానేయడం మంచి నివారణ. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్తున్నకొద్దీ అది వాయునాళాలను మరింతగా మూసుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్లేష్మం/కళ్లె మరింత ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మోతాదు బాగా తగ్గి, పనిచేసే శక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) ∙ -
యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్
యాపిల్ వాచ్ భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. AFib అనేది క్రానిక్ హార్ట్ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది ఒక రకమైన అరిథ్మియా. గుండె దడ , వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. (US H1B visa: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త) ఎవరికి పనిచేస్తుంది? ♦ యాపిల్‌వాచ్ 4, తర్వాత వాచ్ ఏఓస్ 9లోని వినియోగదారులకు ఈ ఫీచర్ పని చేస్తుంది. ♦ భారతదేశంలోని వాచ్ యూజర్లు ఐఫోన్లో ఐఓఎస్ 16ని ఉపయోగించాలి ♦ AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్ సపోర్ట్ పేజీ స్పష్టంచేసింది. ఇదీ చదవండి : శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? ♦ ఐఫోన్లో హెల్త్యాప్ ఓపెన్ చేసి, బ్రౌజ్ క్లిక్ చేసి హార్ట్ ఆప్షన్నుఎంచుకోవాలి ♦ AFib హిస్టరీ సెట్ చేసిన స్టార్ట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మీ పుట్టిన తేదీని నమోదు చేయండి ♦ AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి ♦ తరువాత AFib చరిత్ర, ఫలితాలు , లైఫ్ ఫ్యాక్ట్ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్ చేయాలి. -
30% మందికి బీపీ.. 9.9% మందికి షుగర్
సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు. 79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. పట్టణాల్లోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది. ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది. పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు. అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు. ♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది. ♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
మూలికా వైద్యం..కేరాఫ్ గంధసిరి
అంతరించిపోతున్న సనాతన వనమూలికా వైద్యానికి ఓ గ్రామం నెలవుగా మారింది. మొండి రోగాలను సైతం ఈ వైద్యం మాయం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ వారి ప్రశంసలందుకుంటోంది. లక్షలాది మంది సాధారణ ప్రజల జబ్బులు సైతం తగ్గిస్తూ ఈ మూలికా వైద్యం అపర సంజీవనిగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గంధసిరి గ్రామం ఇందుకు వేదికగా మారింది. వనమూలికా వైద్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన, ఈ గ్రామానికి చెందిన పస్తం సహదేవరాజ్ తాను వైద్య సేవలందిస్తూనే, తన తెగకు చెందిన 150 మందికి ఇందులో శిక్షణ ఇచ్చారు. ఈ వైద్యం తనతోనే అంతరించి పోకుండా తన పిల్లలకు సైతం నేర్పించారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం తాతల కాలం నాటి విద్య.. శబరికోయ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఏళ్ల క్రితం భద్రాచలం ప్రాంతం నుంచి గంధసిరి గ్రామానికి వలస వచ్చాయి. తమ తాతలు, తండ్రులు నేర్పిన మూలికా వైద్యాన్ని వంట బట్టించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్యం చేయడం ప్రారంభించాయి. ఈ కుటుంబాలకు చెందిన సహదేవరాజ్ 1979లో మొదలుపెట్టిన మూలికా వైద్యం దేశ విదేశాలకు విస్తరించింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు తొలిసారిగా 1996లో లండన్ వెళ్లారు. అక్కడ బ్రిటన్ రాణిని కూడా కలిశారు. ఈ క్రమంలోనే నేపాల్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాల్లోనూ వైద్య సేవలందించారు. మరోవైపు అమెరికా, కెనడా నుంచి కూడా పలువురు ఇక్కడకు వచ్చి మూలికా వైద్యం చేయించుకున్నారు. పక్షవాతం, ఆస్తమా, సోరియాసిస్, కీళ్లవాతం తదితర దీర్ఘకాల రోగాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అడవుల్లో సేకరించి అనువుగా మార్చి.. ఈ వైద్య విధానంలో 364 రకాల మూలికలను ఉపయోగిస్తామని సహదేవరాజ్ చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, బస్తర్, శ్రీశైలం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవుల్లో వనమూలికలను సేకరించి గంధసిరి, కోయంబత్తూరులోని సహదేవరాజ్ ఆశ్రమాల్లో వైద్యానికి అనువుగా తయారుచేస్తారు. గ్రామానికి చెందిన 150 మంది ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొంది అడవుల నుంచి మూలికలు తీసుకురావడంలో సహకరిస్తున్నారు. ఎలిజబెత్ రాణి ప్రశంసలు.. గంధసిరి మూలికా వైద్యం సామాన్యులతో పాటు ప్రముఖుల మన్ననలు కూడా పొందింది. మాజీ ప్రధానులు ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాం«దీ, చంద్రశేఖర్, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్, ఉమ్మడి ఏపీలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ వైద్యం తీసుకున్నారు. ఇక నాటి బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 కూడా సహదేవ్రాజ్ ములికా వైద్యాన్ని ప్రశంసించారు. దీంతో ఆయన ఆ్రస్టేలియాలో బ్రాంచ్ ఏర్పాటు చేయగా మరిన్ని దేశాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మన దేశం, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా ఆయన వద్ద వైద్యం పొందుతున్నారు. గంధసిరిలో ఈ నెల 6న వైద్య వనమూలిక ట్రస్ట్ ప్రారంభించేందుకు సహదేవ్రాజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తెగకు చెందిన ఇంకొందరికి ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ధన్వంతరి స్ఫూర్తిగా.. మా ముత్తాతలు, తాతలు, తండ్రులు చేసిన వైద్యాన్నే మేమూ చేస్తున్నాం. కుటుంబంలో ఎవరికి జబ్బుచేసినా అదే కుటుంబంలోని మరొకరు కాపాడటంతోనే ఈ మూలికా వైద్యం పుట్టింది. మాకు ధన్వంతరి భగవాన్ స్ఫూర్తి. దేశ, విదేశాలకు వెళ్లి ప్రముఖులకు చికిత్స చేశాం. ఈ విధానం అంతరించిపోకుకుండా దీన్ని మా పిల్లలకూ నేరి్పంచాం. మూలికా వైద్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. నెలరోజుల్లో సైనస్ తగ్గింది.. నాకు సైనస్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండేవి. ఇవి తగ్గడానికి గతంలో వేల రూపాయలు ఖర్చు చేశా. ఫలితం లేకపోవడంతో గురూజీ సహదేవరాజ్ వనమూలిక వైద్యం గురించి తెలుసుకుని గత నెల గంధసిరికి వచ్చా. నాతోపాటు నా కుమారుడికి సైనస్, భార్యకు బీపీ, థైరాయిడ్‌కు సంబంధించి కూడా వనమూలికలు తీసుకున్నా. నాకు నెలరోజుల్లో సైనస్ తగ్గింది. వారికి కూడా ఉపశమనం కలిగింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూలికా వైద్యం చాలా బాగుంది. – పసునూరు జయపాల్‌రెడ్డి, ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్ చైర్మన్, చంపాపేట, హైదరాబాద్ -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్‌తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
WHO Report: ‘భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు’.. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారు. చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా దీర్ఘకాలికవ్యాధులు పెరుగుతున్నాయి. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారం’పై ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11–17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడంలేదు. 70 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతు న్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ. 25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం కరువు దేశంలో చనిపోయేవారిలో 66% మంది దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులే. మొత్తం మరణాల్లో 30 శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తి వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతరాలతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండటంలేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, చిన్నపిల్లలకు లేదు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలే లేవు. సాధారణ సిఫార్సులు... ► 2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15 శాతానికి తగ్గించాలి. ► ప్రపంచంలో వచ్చే పదేళ్లలో సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్లమంది దీర్ఘకాలికవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళల్లో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడం కారణమే. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయి. అంటే మనలాంటి దేశాల్లోనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ► నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాలి. ► వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలి. ► డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ నడపడంపై నియంత్రణ ఉండాలి. ► శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలి. ► ప్రతి ఒక్కరికీ వారానికి 300 నిముషాల వ్యాయామం తప్పనిసరి ► 18 ఏళ్లు పైబడినవారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి. ► 11–17 మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి. ► 18 ఏళ్లు పైబడినవారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. ► 50 ఏళ్లు పైబడినవారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్లు చేయాలి. మానసిక రుగ్మతలపైనే ఖర్చు ఎక్కువ: డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యాయామం లేకపోవడం వల్ల ప్రధానంగా బీపీ, డిప్రెషన్, మతిమరుపు సమస్యలు వస్తాయి. ప్రపంచంలో 75 శాతం మరణాలకు దీర్ఘాకాలిక జబ్బులే కారణం. ఈ జబ్బులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే వీటిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్లో కేవలం రెండు శాతమే ఖర్చు చేస్తున్నారు. -
ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోŠ, గ్రామాల్లోని కిరాణా దుకాణాలో కొందరు చిన్న మాత్ర, పెద్ద మాత్ర, ఒళ్లునొప్పుల మాత్రలివ్వాలంటూ అడుగుతూ కనిపిస్తారు. ఇందులో ఒకటి పెయిన్‌కిల్లర్ కాగా.. మరొకటి స్టెరాయిడ్. మద్యానికి అలవాటు పడ్డట్లే నొప్పులను తగ్గించేందుకు వాడే ఈ మాత్రలకు చాలా మంది ప్రజలు అలవాటు పడ్డారు. నొప్పులను భరించలేక వైద్యుల నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా లభించే ఈ మాత్రలను వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1800కు పైగా మెడికల్ షాపులు, 2 వేలకు పైగా ఏజెన్సీలు ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే పలు మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ మాత్రలను ప్రజలకు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతుంటారు. ముఖ్యంగా రోజంతా కాయకష్టం చేసి ఇంటికి వచ్చి ఒళ్లునొప్పులతో బాధపడేవారు, కీళ్లనొప్పులు, పలు రకాల శారీరక నొప్పులతో బాధపడేవారు ఆయా బాధలు తగ్గించుకునేందుకు ఈ మందులు వాడుతుంటారు. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే వారు పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి మందులు వాడాలని చెబుతారు. అత్యవసరం అయితే తప్పా స్టెరాయిడ్స్ సూచించరు. దీంతో నేరుగా దగ్గరలో ఉన్న తెలిసిన మెడికల్ షాప్‌లకు వెళ్లి ఈ మాత్రలను కొని తెచ్చుకుని వాడుతుంటారు. మురికివాడల్లో, గ్రామాల్లోని పలు కిరాణాదుకాణాల్లో సైతం వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా తెచ్చుకుని వేసుకున్న మాత్రల వల్ల వారికి ఆ రోజుకు ఉపశమనం కలుగుతుంది. ఇలా ప్రతి ఐదు రోజులకు ఒకసారి మాత్రలు తెచ్చి వేసుకోవడం పరిపాటిగా మారుతోంది. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్ఎంపీ చేతిలో అస్త్రాలివే గ్రామాల్లో, మురికివాడల్లోని ప్రజలు ఏ రోగమొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్)లే. వెంటనే వారి వద్దకు వెళ్లడం చికిత్స తీసుకోవడం, మరునాడే పనులకు వెళ్లడం పరిపాటి. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే ఇంత త్వరగా రోగం తగ్గదు. అందుకే ఆర్ఎంపీలకు అంత గిరాకీ. సదరు ఆర్ఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు ఒక చేతికి పెయిన్ కిల్లర్, మరో చేతికి స్టెరాయిడ్ మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. గ్రామాల్లోనే కాదు కర్నూలు పట్టణంలోని బుధవారపేట, ఓల్డ్‌సిటీ, శ్రీరామనగర్, శరీన్‌నగర్, కల్లూరు, వీకర్‌సెక్షన్‌కాలనీ వంటి ప్రాంతాల్లో ఆర్ఎంపీలు చేసే వైద్యం ఇదే. దీంతో ఫలానా డాక్టర్ రెండు సూదులు వేయగానే రోగం తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుని దీర్ఘకాలంలో వచ్చే వ్యాధులను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారు. స్టెరాయిడ్స్ అంటే.. స్టెరాయిడ్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఒక రకమైన మందులు. ఈ మందులను ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో వాడతారు. వీటిని మొట్టమొదటిసారిగా 1949లో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వాడారు. అప్పటినుంచి వీటిని రకరకాల వ్యాధుల్లో (ఆస్తమా, అలర్జి, ఎస్‌ఎల్‌ఈ, ఆర్థరైటిస్, వ్యాస్కులైటిస్ మొదలైన) సూదులు, మాత్రలు, పూతమందులు, ఇన్హేలర్ రూపంలో వాడుతూ ఉన్నారు. ఇందులో చాలా రకాలున్నాయి. డెక్సామిథసోన్, ప్రెడ్నిసోన్, ట్రైయామ్సిలోన్ మొదలైనవి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల నష్టాలు మన శరీరంలోని రక్తంలో మామూలుగానే స్టెరాయిడ్స్ చిన్న మోతాదులో ఉంటాయి. ఇవి మన జీవక్రియకు సంబంధించిన ప్రక్రియల్లో ఉపయోగపడతాయి. రక్తంలోని షుగర్‌ను నియంత్రించడం, బీపీ నియంత్రణలో ఉంచడం, ఎముకల శక్తిని నిర్ధారించడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం లాంటివి. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా వీటిని వాడటం వల్ల చాలా జబ్బులు కోరి తెచ్చుకుంటారు. ఇందులో బీపీ, స్థూలకాయం, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత), కంట్లో శుక్లాలు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఇష్టమొచ్చినట్లు వాడొద్దు స్టెరాయిడ్స్ కొన్ని జబ్బుల్లో సరైన సమయంలో సరైన మోతాదులో వాడితే ప్రాణాలు కాపాడబడతాయి. అయితే ఇష్టం వచ్చినట్లు వాడితే చాలా సమస్యలు వచ్చి ప్రాణాంతకం అవుతుంది. ఇప్పటికీ చాలా మంది స్టెరాయిడ్స్ అతిగా వాడి కిడ్నీలు దెబ్బతిని, ఎముకలు గుల్లబారి, బరువు పెరిగి కీళ్లనొప్పులు తెచ్చుకుని మా వద్దకు వస్తుంటారు. మాలాంటి కీళ్లవాత నిపుణులు సైతం అవసరమైన మేరకు మాత్రమే స్టెరాయిడ్స్ ఇచ్చి సమస్య తీవ్రత తగ్గాక తగ్గిస్తారు. ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. – డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత నిపుణులు, కర్నూలు -
తోడొకరుండిన అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..
ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.శంకర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్ : ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్ ప్రవీణ్ చెప్పారు నిద్రలేమి, బీపీ తగ్గాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది. –కోటేశ్వరరావు ఆ‘పరేషాన్’ తీరింది... వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్ రిలేషన్ షిప్స్ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. –రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (చదవండి: ‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు) -
ఆలోచన ‘సిరి’.. ఆరోగ్య దరి
కర్నూలు (హాస్పిటల్): దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండడంతో ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సిరి ధాన్యాలతో(మిల్లెట్స్‌తో) తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉండగా, మరికొందరు వాటిని ఎలా వండుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొందరు వినూత్న ఆలోచన చేశారు. సిరి ధాన్యాలతో అల్పాహారాన్ని తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. సాధారణ ప్రజలు సైతం వీటిని ఇష్టంగా తింటున్నారు. రోగులను గమనించి... కర్నూలుకు చెందిన టి. చంద్రకాంత్ ఎంబీఏ పూర్తి చేశాడు. నాలుగేళ్లు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో డయాబెటీస్, బీపీ రోగుల ఇక్కట్లను గమనించాడు. వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలని భావించి, కర్నూలు ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశాడు. తల్లి సహాయంతో రాత్రి సమయాల్లో రాగి ఇడ్లి, కొర్ర ఇడ్లి, రాగి దోశ, కొర్ర దోశలను పల్లీ, గోంగూర చట్నీతో అందిస్తున్నాడు. రెండు ఇడ్లీలు రూ.25, దోశ రూ.40 చొప్పున అమ్ముతున్నాడు. వ్యాపారం బాగా జరుగుతోందని, తన ఇద్దరు చెల్లెళ్ల వివాహం కూడా జరిపించినట్లు చంద్రకాంత్ తెలిపారు. పల్లె నుంచి వచ్చి.. అందరూ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్లు చేస్తారు కానీ వాటికి భిన్నంగా, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తయారు చేయాలని భావించాడు ఎ. మద్దయ్య. సొంత ఊరు అవుకు. అక్కడ ఊళ్లో పొలం పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పిల్లల చదువు కోసం 1999లో కర్నూలుకు వచ్చి శ్రీకృష్ణకాలనీలో స్థిరపడ్డాడు. 2020 నుంచి స్థానిక వెంకట రమణ కాలనీలో రోడ్డులో మిల్లెట్స్ ఫుడ్స్ పేరుతో మొబైల్ క్యాంటీన్ కొనసాగిస్తున్నాడు. కొర్ర ఇడ్లీ, కొర్ర నెయ్యి దోశ, కొర్ర పొంగలి, పాలకూర పూరీలను రుచిగా, శుచిగా అందించడం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే వీటికి ప్రజల ఆదరణ లభించింది. వచ్చిన ఆదాయంతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నట్లు మద్దయ్య తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, జీర్ణకోశ సమస్యలు ఉన్న వారికి జీవనశైలి మార్చుకోవాలని, కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉన్న వరి, గోధుమలు, మైదాతో వండి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో చిరుధాన్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొర్రలు, సామలు, ఆరికెలు, ఊదలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాల విక్రయ కేంద్రాలు జిల్లాలో పలు చోట్ల వెలిశాయి. చాలా మంది చిరు ధాన్యాల ఆహారంవైపు మళ్లుతున్నారు. తాము ఈ ఆహారాన్ని వాడటం వల్ల దీర్ఘకాలిక జబ్బులు తగ్గినట్లు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. దీంతో మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు నేను సీడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. కర్నూలులోనే ఉంటూ ఇక్కడి నుంచి ఇతర ఊళ్లకు ప్రతిరోజూ వ్యాపార నిమిత్తం వెళ్తుంటాను. వెంకటరమణ కాలనీలో మిల్లెట్స్ ఫుడ్స్ రుచి చూశాను. ప్రతిరోజూ ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తున్నాను. నా లాంటి వారికి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. – కేశవరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా రాగి దోశ ఇష్టం నాకు రాగి దోశ తినడం ఇష్టం. అందుకే వారంలో కనీసం మూడు, నాలుగు రోజులైనా వచ్చి ఆర్ఎస్ రోడ్డులో టిఫిన్ చేస్తాను. ఇక్కడ దోశలు రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యం కూడా. –భవానీ శివనరేష్, కర్నూలు షుగర్ నియంత్రణలో ఉంటుంది చిరుధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విరేచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణాశయ సమస్యలు తగ్గిపోతాయి. వరి అన్నం తింటే 45 నిమిషాల్లోనే శరీరంలో గ్లూకోజ్‌గా మారుతుంది. అదే చిరు ధాన్యాలు అయితే 4 నుంచి 5 గంటలు సమయం పడుతుంది. దీని వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒకసారి తింటే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు తగ్గుతారు. చిరుధాన్యాల్లో అన్ని రకాల మైక్రో న్యూట్రిషిన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. – డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
నవ్విందంటే నిద్రపోతుంది, కొంచెం ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి!
నవ్వడం ఒక భోగం.. నవ్వకపోవడం ఓ రోగం అన్నారు జంధ్యాల.. బ్రిటన్‌కు చెందిన బెల్లా కిల్మార్టిన్(24)కి మాత్రం నవ్వడమే ఓ రోగం.. ఎందుకో తెలుసా? తను నవ్విందంటే.. వెంటనే నిద్రలోకి వెళ్లిపోతుంది.. దానికి ప్లేస్ టైంతో సంబంధం ఉండదు.. ఒకసారి ఇలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు సడన్‌గా నవ్వడంతో అక్కడే నిద్రపోయింది.. పక్కనే ఉన్న స్నేహితురాలు వెంటనే రక్షించడంతో మునిగిపోకుండా ప్రాణాలతో బయటపడింది. ఇంకోసారి నిల్చుని ఉన్నప్పుడే నిద్రపోవడంతో కిందపడి దెబ్బలు కూడా తగిలాయి. ‘ఇంద్రుడు’ అనే సినిమాలో హీరో విశాల్ ఇలాగే.. నిద్రపోతుంటాడు.. దీనికి కారణం.. నాకోలెప్సీ.. నిద్రకు సంబంధించి ఇదో రుగ్మత. రోజంతా నిద్రమత్తుగా ఉండటంతోపాటు సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ఈ రుగ్మత ఉన్నవారికి స్లీప్ ఎటాక్ వస్తుందన్నమాట. అలాగే బెల్లా కాటాప్లెక్సీతోనూ బాధపడుతోంది. అంటే.. ఏదైనా బలమైన భావోద్వేగానికి లోనైనప్పుడు తన కండరాలన్నీ ఒక్కసారిగా బలహీనమైపోతాయి. బెల్లా విషయంలో ఆ భావోద్వేగం నవ్వు.. ఈ అరుదైన రుగ్మత వల్ల ఆమె ఆఫీసులో, నైట్ క్లబ్లో ఇలా ఎక్కడ పడితే.. అక్కడే నిద్రపోతుంది. అయితే, తనకు అన్నీ తెలుస్తుంటాయట.. మనం ఏమి మాట్లాడుతున్నాం.. ఇలా అన్నీ వినిపిస్తూనే ఉంటాయి.. కాకపోతే.. నిద్ర నుంచి లేవలేదు అంతే.. నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.. కాకపోతే.. అది కొంతవరకే ఉపయోగపడుతోందని బెల్లా చెప్పారు. పాపం.. బెల్లా..! – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు -
జనంలోకి వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందజేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలసి డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుందని వివరించారు. మున్ముందు వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. రెండు ప్రాధాన్య వర్గాలకు నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రెండో డోస్ కూడా అదే కేంద్రంలో వేస్తామన్నారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేస్తామని వెల్లడించారు. వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీచేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ప్రజల్లో 50 లక్షల మంది రెండు ప్రాధాన్య వర్గాలకు టీకాలు వేస్తామన్నారు. ‘ధ్రువీకరణ’ సమర్పించాలి... దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఆపై స్థాయి వైద్యుడి నుంచి తాము జారీ చేసే నమూనా ఆధారంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దాన్ని కోవిన్ యాప్‌లో అప్లోడ్ చేశాకే టీకా వేస్తామని తెలిపారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తామన్నారు. లబ్ధిదారులు వారంలోగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు దగ్గరలో ఉన్న బూత్‌కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా పొందవచ్చన్నారు. అన్ని టీకాలు సురక్షితమేనని, ఎవరికి ఏ కంపెనీ టీకా ఇస్తామనేది బయటకు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా అనెక్జర్–1బీ కాపీ ఇంటర్నెట్లోనూ, కోవిన్ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ ఫార్మాట్‌ను ఆధారం చేసుకొని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తారని శ్రీనివాసరావు వివరించారు. కోవిన్ 2.0 వెర్షన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చిందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సోమవారం టీకా ఇస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి కూడా అదే రోజు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రతి సెంటర్లోనూ సాధారణ ప్రజలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు కూడా టీకా వేస్తామన్నారు. నిర్దేశించిన రోజున టీకా వేయించుకోలేనివారు తదుపరి రీ షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. జ్వరం లేదా ఒళ్లు నొప్పులు సాధారణమే... టీకా వేసుకున్నాక జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉండటం చాలా మందిలో సహజమేనని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎవరికైనా టీకా వేసిన అరగంటలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని, కాబట్టి వారు అరగంటపాటు తమ పరిశీలనలోనే ఉండాలన్నారు. ఇంటికి వెళ్లాక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని, లేకుంటే 104 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అన్ని వసతులున్న ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే టీకా వేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాల్లో టీకాలు వేయరని, ప్రైవేటులో మాత్రం వారమంతా వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దశలవారీగా కేంద్రాల పెంపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్ది సెంటర్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మున్ముందు 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా ఆసుపత్రుల్లో, 9 బోధనాసుపత్రుల్లో కరోనా టీకా వేస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 215 ప్రైవేటు ఆసుపత్రులను టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర రూ. 150, సర్వీస్ చార్జీ రూ. 100 వరకు వసూలు చేసుకోవడానికి కేంద్రం అనుమతించిందన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదన్నారు. అందుబాటులో డాక్టర్: డీఎంఈ టీకా కేంద్రాల్లో లబ్దిదారులు వేచి ఉండే గది వద్ద ఒక డాక్టర్, టీకా వేశాక అరగంట సేపు పరిశీలనలో ఉండే చోట మరో డాక్టర్ అందుబాటులో ఉంటారని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రెండో ఫేజ్ కరోనా వ్యాక్సిన్ రెండు ప్రాధాన్య వర్గాలతో ప్రారంభం అవుతుందన్నారు. తొలుత కొన్నిచోట్ల మాత్రమే టీకా ప్రారంభిస్తామన్నారు. ఒకేసారి జనం పోటెత్తకుండా ఉండేందుకు కొన్ని సెంటర్లలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే టీకాలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర టీకా కేంద్రం నుంచి జిల్లా కోల్డ్‌చైన్ పాయింట్లకు వ్యాక్సిన్లను సరఫరా చేసి వారికి ఇస్తామన్నారు. అంతకుముందే వారు టీకాలకు డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటారని, ఆ మేరకు వాటికి పంపిణీ జరుగుతుందన్నారు. 29–42 రోజుల మధ్య రెండో డోసు కరోనా రెండో డోసును తొలి డోసు తీసుకున్న 28వ రోజున లబ్ధిదారులు తీసుకోవాలన్న నిబంధన ఇప్పటివరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తాజాగా మార్చింది. తొలి డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు మధ్య ఎప్పుడైనా లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆసుపత్రికి రావల్సిందేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకపోతే వారిని అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించింది. 50 లక్షలు: టీకాలు పొందబోయే సాధారణ ప్రజానీకంలోని రెండు ప్రాధాన్య వర్గాల వారి సంఖ్య. 4.43 లక్షలు: జనవరి 16 ఇప్పటివరకు టీకా వేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల సంఖ్య. (మొదటి డోస్ 2.95 లక్షల మంది, రెండో డోస్ 1.47 లక్షల మంది) 215: టీకా వేసేందుకు గుర్తించిన ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య. టీకాలు ఇచ్చే కేంద్రాలు... 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 19 ఏరియా ఆసుపత్రులు 29 జిల్లా ఆసుపత్రులు 9 బోధనాసుపత్రులు 215 ప్రైవేటు ఆసుపత్రులు నేటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా... ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 45 ప్రైవేటు ఆసుపత్రులు 48 ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,600 మందికి టీకాలు -
ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే వ్యాధులు ఆ కేటగిరీలోకి వస్తాయో వెల్లడించింది. వాటిని వైద్యులు ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఆ వ్యాధులు ఏమిటంటే... 1. గుండె వైఫల్యం సమస్యకు గత ఏడాది కాలంలో ఆస్పత్రిలో చేరినవారు. 2. గుండె మార్పిడి లేదా ఒక కవాటం సమస్యకు పరికరాన్ని అమర్చుకున్నవారు. 3. గుండె ఎడమ కవాటం పనిచేయకుండా ఇబ్బంది పడుతున్నవారు. 4. గుండె పని సామర్థ్యం 40 శాతం కంటే తక్కువ ఉన్నవారు లేదా కవాటం సమస్యతో బాధపడుతున్నారు 5. పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నవారు. 6. హైపర్ టెన్షన్ (బీపీ), డయాబెటిస్ (షుగర్)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారు. 7. సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలో పక్షవాతం నిర్ధారణ అయి హైబీపీ లేదా డయాబెటీస్‌కు చికిత్స పొందుతున్నవారు. 8. గుండెపోటుకు గురై ఇప్పటికే బైపాస్ సర్జరీ లేదా స్టంట్ వేయించుకున్నవారు. 9. ఊపిరితిత్తుల్లో రక్తపోటు సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 10. పదేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు లేదా దాంతోపాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు. 11. కిడ్నీ, లివర్ మార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు, స్టెమ్ సెల్ థెరఫీ తీసుకున్నవారు. 12. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, ఇప్పటికే డయాలసిస్‌లో ఉన్నవారు. 13. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే జబ్బులతో బాధపడుతున్నవారు. 14. దీర్ఘకాలిక కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు. 15. గత రెండేళ్లలో శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 16. లింఫోమా, లుకేమియా, మైలోమా లాంటి కేన్సర్లతో బాధపడుతున్నవారు. 17. గతేడాది జూలై తర్వాత కేన్సర్ బారినపడినవారు లేదా ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నవారు. 18. దీర్ఘకాలిక రక్తకణాల సమస్యలతో బాధపడుతున్నవారు, స్టెరాయిడ్స్ మాత్రలు దీర్ఘకాలికంగా వాడేవారు. 19. హెచ్ఐవీతో బాధపడుతున్నవారు. 20. కండరాల బలహీనతతో బాధపడుతున్నవారు, యాసిడ్ దాడికి గురై శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మూగ–చెవిటి–అంధత్వ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు. రాష్ట్రంలో 2,222 ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజన్లకు నేటి నుంచి టీకా సాక్షి, అమరావతి: నేటి నుంచి రాష్ట్రంలో అతిపెద్ద కోవిడ్ టీకా ప్రక్రియ జరగనుంది. రెండు మాసాల పాటు 48 రోజులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రమారమి 60 లక్షల మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45–59 ఏళ్లలోపు వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ టీకా వేస్తారు. 28 రోజుల వ్యవధిలో తొలిడోసు, రెండో డోసు వేయడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,222 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దీనికోసం వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్ జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి అక్కడకు చేర్చారు. కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేరు నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకునే అవకాశమూ ఉంది. ఒకే దశలో ఇంత మందికి టీకా వేయడం అతిపెద్ద ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు. -
దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు జీవిత కాలం భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి సర్కారు కొండంత అండగా నిలిచింది. ఏ పనీ చేయలేక కుటుంబానికి భారమై, కుటుంబ సభ్యుల ఈసడింపులతో క్షణక్షణం జీవితంతో పోరాటం చేస్తున్న వేలాది మంది ఇప్పుడా పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడ్డారు. చాలా మంది జబ్బు నయం చేసుకునేందుకు మందుల కొనుగోలుకు డబ్బులు లేని పరిస్థితి. వారికి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 వేల నుంచి గరిష్టంగా 10 వేల రూపాయల వరకు నెలనెలా పెన్షన్ ఇస్తూండటంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పెన్షన్ ఇవ్వలేదు. ఇలా రాష్ట్రంలో దీర్ఘకాలిక జబ్బులతో పెన్షన్ పొందుతూ లబ్ధి పొందుతున్న వారు నవంబర్ 23 నాటికి 45,871 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా పక్షవాతంతో కదలలేని స్థితిలో ఉన్నవారే ఎక్కువ. ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు ► దీర్ఘకాలిక జబ్బులు లేదా మంచానికే పరిమితమైన వారికి ఏ రాష్ట్రంలోనూ పెన్షన్లు లేవు. అలాంటి వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 45,871 మంది పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరిలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారు 17,443 మంది ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ► దీర్ఘకాలిక జబ్బు బాధితులకు నెలవారీ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.23.17 కోట్లు ఖర్చు చేస్తోంది. బాధితుల సంఖ్య పెరిగితే ఈ వ్యయం కూడా పెరుగుతుంది. ప్రతి నెలా 1వ తేదీనే గ్రామ లేదా వార్డు వలంటీర్లు పింఛన్‌దారుల ఇంటికెళ్లి సొమ్ము అందజేస్తున్నారు. ► ఏపీలో మెడికల్ కాలేజీల్లో వైద్యుల బృందం సర్టిఫై చేసి, అర్హత పొందిన వారికే పెన్షన్ ఇస్తారు. తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్ బాధితులు ప్రతినెలా మందులకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వారికి ఉచితంగా మందులివ్వడమే కాకుండా నెలకు రూ.10 వేలు ఇస్తుండటంతో ధైర్యంగా ఉన్నారు. ► ఏప్రిల్‌లో 39 వేలు పింఛన్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 45 వేలకు పైగా పెరిగాయి. ఈ లెక్కన 15 % పింఛన్లు ఈ ఆరు నెలల్లోనే పెరగడం గమనార్హం. సచివాలయాల ఏర్పాటు వల్ల బాధితులకు త్వరితగతిన లబ్ధి చేకూరుతోంది. ఆ సాయమే బతికిస్తోంది నేను రైతును. ఆరు మాసాల క్రితం ఆసుపత్రికి వెళ్లగా రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నెలకు రూ.10 వేలు పింఛన్ మంజూరు చేసింది. డయాలసిస్ ఉచితంగా చేస్తున్నారు. ఆ సాయమే నన్ను బతికిస్తోంది. – పి.మోహనరావు, అన్నాపురం, శ్రీకాకుళం జిల్లా ఈ సాయం మరువలేనిది పేద గిరిజన కుటుంబానికి చెందిన నాకు తండ్రి చనిపోయాడు. సికిల్‌సెల్ ఎనీమియా వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఈ ఏడాది మార్చినుంచి రూ.10 వేల పింఛన్ అందుతోంది. ఈ సాయం మరువలేనిది. – సాంబే చరణ్, ఇంటర్ విద్యార్థి, గుత్తులపుట్టు, విశాఖ అప్పుడు మందులు కొనలేని పరిస్థితి మాది చాలా పేద కుటుంబం. నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. మందులు కూడా కొనుక్కోలేని స్థితి. ఈ పరిస్థితుల్లో నాకు ఈ ప్రభుత్వం రూ.5 వేలు íపింఛను ఇస్తోంది. దీంతో జీవనం సాగిస్తున్నా. – ఎన్.ఎర్నిమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా భరోసా దొరికింది మా కుమారుడు ఉదయ్‌కుమార్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి వచ్చింది. గతంలో వైద్యం చేయించేందుకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. జగన్ పుణ్యమా అని ఈ ఏడాది జనవరి నుంచి బాబుకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నారు. వైద్యానికి ఇబ్బంది లేదు. – మీసాల లక్ష్మీ, రాజమహేంద్రవరం -
మనకు కరోనా రిస్క్ తక్కువే..!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెద్దగా లేదు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేగం కాస్త అటూఇటుగా ఉన్నప్పటికీ మరణాన్ని జయిస్తున్నవారే అధికం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్కువగా ఉండడమే. దేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అతి తక్కువగా ఉంది’అని ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) నివేదిక వెల్లడించింది. జూలై 2017 నుంచి జూన్ 2018 మధ్యకాలంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారి గణాంకాలను ఆధారం చేసుకుని రాష్ట్రాల వారీగా కోవిడ్–19 బారిన పడి కోలుకున్న.., మరణించిన వారి సంఖ్యను లెక్కిస్తూ ఐఐపీఎస్ అధ్యయనం చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారి గృహాలను ప్రామాణికంగా తీసుకుంటూ గణాంకాలను విశ్లేషిస్తే జాతీయ స్థాయిలో 9.38 శాతం గృహాలు రిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. రాష్ట్రంలో రిస్క్ 6.12 శాతమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణాంకాలను సేకరించిన ఐఐపీఎస్.. రాష్ట్రాల వారీగా జాతీయ సగటును పోల్చుతూ పరిశీలన చేసింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో సగటున 9.38 శాతం గృహాలు రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే రిస్క్ కేవలం 6.12 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా రిస్క్ ఉన్న గృహాలు కేరళలో (33.19 శాతంతో) ఉన్నట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఆ తర్వాతి వరుసలో ఆంధ్రప్రదేశ్ 19.82 శాతం, గోవా 15.89 శాతం, పంజాబ్ 15.51 శాతం, హిమాచల్‌ప్రదేశ్ 14.49 శాతంతో రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఇక రిస్క్ జాబితాలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 11వ స్థానంలో ఉంది. ఈ లెక్కన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే కోవిడ్–19 మరణాలు తక్కువగా సంభవిస్తున్నట్లు తేల్చింది. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్–19 మరణాల్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 55.04 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా 44.96 శాతం మరణాల్లో అత్యధికులు సకాలంలో వైద్యం తీసుకోకపోవడం వల్లే చనిపోయినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అరవై దాటిన వారే ఎక్కువ వయసు రీత్యా పరిశీలిస్తే అరవై సంవత్సరాలు దాటిన వారిలో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఐఐపీఎస్ పరిశీలన చెబుతోంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో అరవై ఏళ్లు దాటిన వారు 52.25 శాతం ఉండగా, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవారు 40.82 శాతం ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో 15 నుంచి 44 సంవత్సరాల వారుండగా.. 15 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ల సంఖ్య అతి తక్కువగా ఉంది. -
ఆయుష్మాన్‌భవ
సాక్షి, హైదరాబాద్ : దేశంలో సగటు మనిషి ఆయుః ప్రమాణం పెరుగుతోంది. 1990తో పోలిస్తే ఏకంగా పదేళ్లకుపైగా జీవితకాలం పెరిగింది. దేశవ్యాప్తంగా స్త్రీల జీవితకాలం 70.3 ఏళ్లు, పురుషుల జీవితకాలం 66.9 ఏళ్లకు పెరిగింది. అదే తెలంగాణలో దేశవ్యాప్త సగటుకన్నా అధికంగా స్త్రీల జీవితకాలం 73.2 ఏళ్లకు, పురుషుల జీవితకాలం 69.4 ఏళ్లకు పెరిగింది. భారత వైద్య పరిశోధన మండలి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ సంస్థలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, వైద్య సౌకర్యాలు వంటివి ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. కానీ ఇదే సమయంలో మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని, మరణాలకు కారణమవుతున్నాయని స్పష్టమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య విభాగాల ద్వారా ఈ అధ్యయనం చేసి.. నివేదిక రూపొందించారు. పెరుగుతున్న జీవన ప్రమాణం 1990లో భారత మెడికల్ కౌన్సిల్ ప్రజారోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా మహిళల సగటు జీవితకాలం 59.7 ఏళ్లుగా, పురుషుల జీవితకాలం 58.3 ఏళ్లుగా తేల్చింది. తాజాగా 2016–17 ఏడాదికిగాను నిర్వహించిన అధ్యయనంలో మహిళ ఆయుష్షు 70.3 ఏళ్లకు, పురుషుల ఆయుష్షు 66.9 ఏళ్లకు పెరిగినట్లు గుర్తించింది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు, శాతాలను లెక్కించింది. తెలంగాణలో 1990లో సగటు జీవితకాలం మహిళల్లో 61.8 ఏళ్లు, పురుషులకు 60.2 ఏళ్లుగా ఉండగా.. 2016–17లో స్త్రీలలో 73.2 ఏళ్లకు, పురుషుల్లో 69.4 ఏళ్లకు పెరిగినట్లు తేల్చింది. తగ్గుతున్న శిశు మరణాల రేటు దేశవ్యాప్తంగా కొన్నేళ్లలో శిశు మరణాల రేటు బాగా తగ్గిందని మెడికల్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. 1990లో ప్రతి 1,000 మంది శిశువుల్లో 100 మంది వరకు మరణించగా.. 2016–17 నాటికి 39కి తగ్గినట్లు పేర్కొంది. ఇదే తెలంగాణలో 30కి తగ్గిందని తెలిపింది. ఏ వయసులో ఏ సమస్యతో.. వివిధ వయసుల్లో అనారోగ్య కారణాలతో మరణిస్తున్న వారి శాతాన్ని సైతం కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో.. గర్భస్థ దశలో సరిగా ఎదగక, వివిధ లోపాలతో పుట్టినవారి శాతమే 42.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 30.5 శాతం మరణాలకు మలేరియా, తట్టు వంటి సాంక్రమిక వ్యాధులు కారణమని, వివిధ ఇతర వ్యాధులతో 8.7 శాతం, ప్రసూతి సమస్యలతో 2.4 శాతం, పోషకాహార లోపంతో 1.2 శాతం మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. ► ఇక 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లలోపు వారిలో సంభవిస్తున్న మరణాల్లో... 13.5 శాతం శ్వాసకోశ వ్యాధులతో, ఎయిడ్స్‌తో 13 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 10.4 శాతం, కేన్సర్‌తో 10 శాతం, మలేరియా వంటి వ్యాధులతో 8.9 శాతం మరణిస్తున్నారు. ► 40 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో... 38.1శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 12.2 శాతం కేన్సర్‌తో, 10 శాతం శ్వాసకోశ వ్యాధులతో, 8.5 శాతం డయేరియా, 5.5 శాతం ఎయిడ్స్‌తో మృత్యువాత పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం ► అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ డిసీజెస్‌తో 8 శాతం మంది స్త్రీలు, 10 శాతం మంది పురుషులు సతమతమవుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. ► ఐరన్ లోపంతో వచ్చే వ్యాధులతో 13 శాతం స్త్రీలు, 5 శాతం పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. ► వెన్నునొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులతో 7 శాతం స్త్రీలు, 6 శాతం పురుషులు జీవితం నెట్టుకొస్తున్నారు. ► మానసిక వ్యాధులతో 6 శాతం మహిళలు, 7 శాతం పురుషులు వేదనకు గురవుతున్నారు. ► నెలలు గడవక ముందు పుట్టినవారిలో 3 శాతం స్త్రీలు, 2 శాతం పురుషులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ► రోడ్డు ప్రమాదాల్లో 1 శాతం స్త్రీలు, 3 శాతం పురుషులు వైకల్యం బారిన పడుతున్నారు. ► డయాబెటిక్‌తో 2 శాతం స్త్రీలు, 4 శాతం పురుషులు దీర్ఘకాలంగా కాలం గడుపుతున్నారు. దీర్ఘకాలిక వైకల్యం, అనారోగ్యాలకు ఇవీ కారణాలు 1990 లో.. ►విరేచనాలు, సంబంధిత వ్యాధులు ►శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు ►తట్టు, సంబంధిత వ్యాధులు ►నియోనాటల్ వ్యాధులు ►క్షయ వ్యాధి ►తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►గర్భస్థ, శిశు సంబంధిత వ్యాధులు ►పక్షవాతం ►మధుమేహం (డయాబెటిస్) 2016-17లో.. ►గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు ►తీవ్ర (క్రానిక్) ఊపిరితిత్తుల వ్యాధులు ►విరేచనాల సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ వ్యాధులు ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►పక్షవాతం ►రోడ్డు ప్రమాదాలు ►నడుంనొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులు ►మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్ ►శ్వాసకోశ వ్యాధులు ►రోడ్డు ప్రమాదాలు ఈ పదీ మరణ హేతువులు! జీవితకాలంలో వివిధ అనారోగ్యాలకు గురికావడానికి పది ప్రధాన కారణాలను సర్వే గుర్తించింది. 1990 నాటి కారణాలను, ప్రస్తుత కారణాలను నిగ్గు తేల్చింది. మొత్తంగా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉందని, మహిళల్లో అధికశాతం దీనితో బాధపడుతున్నారని గుర్తించింది. కారణాలను ర్యాంకుల వారీగా పరిశీలిస్తే.. మారిన రిస్క్ ఒకప్పుడు విరేచనాలు (కలరా) వంటి వ్యాధులతో భారీగా మరణాలు సంభవించగా.. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువమంది చనిపోతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. అప్పుడు, ఇప్పుడు ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న పది ప్రధాన అంశాలను నివేదికలో పేర్కొంది. పోషకాహార లోపమే పెద్ద సమస్య.. 1990 నాటి నుంచి ఇప్పటికీ పోషకాహార లోపమే పెద్ద సమస్యగా ఉందని మెడికల్ కౌన్సిల్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు తగిన పోషకాహారం అందక ఆరోగ్య సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నట్లు పేర్కొంది. ఇక నగర ప్రాంతాల్లో అధిక కొవ్వు, ఊబకాయం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జంక్ ఫుడ్ అలవాటు ఆయుష్షును తగ్గిస్తోందని స్పష్టం చేసింది. అరక్షిత శృంగారంతో.. దేశంలో అరక్షిత శృంగారం కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో 627 మంది దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులుగా ఉండిపోయారని పేర్కొంది. అరక్షిత శృంగారంతో తెలంగాణ నుంచే ఎక్కువ శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గుర్తించింది. తర్వాతి స్థానాల్లో మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక లైంగిక వేధింపుల కారణంగా మతిస్థిమితం కోల్పోయినవారు తెలంగాణలో 124 మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ బాధితుల సంఖ్యలో తమిళనాడు (159) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (140) రెండో స్థానంలో నిలిచింది. -
ఆహార మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
వాషింగ్టన్: రోజువారీ ఆహార పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పద్ధతి పాటించడంతో తక్కువ ఖర్చు తో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపారు. కెన్యాలోని మెరులో చేపట్టిన ఓ ప్రాథమిక పరిశోధనలో గ్లుటమేట్ అనే ఉప్పు రకానికీ.. దీర్ఘకాలిక వ్యాధులకూ మధ్య ఉన్న సంబంధంపై వారు పరీక్షలు జరిపారు. దీని కోసం 3 నెలలు లేదా అంతకంటే అధిక సమయం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 30 మంది రోగులపై పరీక్షలు జరిపారు. మొదటగా వారికి గ్లుటమేట్ లేని ఆహారాన్ని అందించడంతోపాటు అధిక నీరును తాగమని కోరారు. కొన్ని వారాల్లోనే వారిలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గడం గుర్తించినట్లు అమెరికాలోని మిచిగాన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు డేనియల్ వివరించారు. గ్లుటమేట్ అనేది సోయా, జున్నుతోపాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభిస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. -
జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి
సాక్షి, హైదరాబాద్: క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కు జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్, మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్‌కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురిం చింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆదివారం సీసీఎంబీ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించారు. అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని మా పరిశోధనలో తేలింది. దక్షిణ భారతదేశంలో క్లోమ గ్రంధి వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్‌ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నయం చేయకపోతే క్లోమగ్రంధికి కేన్సర్ వస్తుంది’’ అని సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వివరించారు. క్లోమగ్రంధి పనిచేయకపోవడానికి కారణాలపై ఏఐజీ నిపుణులు నాగేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరావు, సీసీఎంబీకి చెందిన జీఆర్ చంద్రక్ తదితరులు 13 ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల బృందంతో కలిసి వీరు చేసిన పరిశోధన ఫలితాలను ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ ప్రచురించిందని తెలిపారు. పది శాతం మందికి కేన్సర్ ప్రమాదం... ప్రతి వంద మంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో పది మందికి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘దక్షిణ భారతదేశంలో కర్రపెండలం తినడం, ఆల్కహాల్ తాగడం వల్లే ప్యాంక్రియాటైటిస్ వస్తుందని గతంలో భావిస్తూ వచ్చాం. జన్యుపరమైన మార్పులు, వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఇది వస్తుందని మా తాజా పరిశోధనల్లో తేలింది. ఆదిలోనే వ్యాధిని నిర్ధారిస్తే మందులతోనే నయం చేయడం సులువవుతుంది. గత పదమూడేళ్లుగా సీసీఎంబీ, అంతర్జాతీయ నిపుణులతో కలిసి అధ్యయనం చేశాం. మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. ఆ తరువాతే తగిన మందులు తయారు చేయాల్సి ఉంటుంది. 3 వేల మంది రోగులపై పరిశోధనలు చేశాం. రక్తపరీక్షతో ప్యాంక్రియాటైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష కోసం ప్రస్తుతం రూ. 5 వేలు ఖర్చవుతోంది. హోల్బాడీ జీనోమ్ సీక్వెన్స్ స్క్రీనింగ్‌కు రూ. 70 వేలు వ్యయమవుతోంది. భవిష్యత్తులో ఈ ఖర్చు రూ. 30 వేలకు తగ్గుతుంది. ప్యాంక్రియాటైటిస్ రావడానికి కారణాలు స్పష్టంగా తేలితే వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించొచ్చు. ఆదిలోనే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు, మందులతో 95 శాతం నయం చేయవచ్చు. ఈ దిశగానే మా పరిశోధనలు సాగిస్తున్నాం. ఒకవేళ వ్యాధి ముదిరిన తరువాత గుర్తిస్తే శస్త్రచికిత్స చేయాలి. అయితే ఇందులో సక్సెస్ రేట్ 30 శాతం మాత్రమే’’ అని ఆయన వివరించారు.