![Britain Woman Who Falls Asleep When Laughs Rare Chronic Disorder - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/29/bella.jpg.webp?itok=pGwcsWJZ)
నవ్వడం ఒక భోగం.. నవ్వకపోవడం ఓ రోగం అన్నారు జంధ్యాల.. బ్రిటన్‌కు చెందిన బెల్లా కిల్‌మార్టిన్(24)కి మాత్రం నవ్వడమే ఓ రోగం.. ఎందుకో తెలుసా? తను నవ్విందంటే.. వెంటనే నిద్రలోకి వెళ్లిపోతుంది.. దానికి ప్లేస్ టైంతో సంబంధం ఉండదు.. ఒకసారి ఇలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు సడన్‌గా నవ్వడంతో అక్కడే నిద్రపోయింది.. పక్కనే ఉన్న స్నేహితురాలు వెంటనే రక్షించడంతో మునిగిపోకుండా ప్రాణాలతో బయటపడింది. ఇంకోసారి నిల్చుని ఉన్నప్పుడే నిద్రపోవడంతో కిందపడి దెబ్బలు కూడా తగిలాయి.
‘ఇంద్రుడు’ అనే సినిమాలో హీరో విశాల్ ఇలాగే.. నిద్రపోతుంటాడు.. దీనికి కారణం.. నాకోలెప్సీ.. నిద్రకు సంబంధించి ఇదో రుగ్మత. రోజంతా నిద్రమత్తుగా ఉండటంతోపాటు సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ఈ రుగ్మత ఉన్నవారికి స్లీప్ ఎటాక్ వస్తుందన్నమాట. అలాగే బెల్లా కాటాప్లెక్సీతోనూ బాధపడుతోంది. అంటే.. ఏదైనా బలమైన భావోద్వేగానికి లోనైనప్పుడు తన కండరాలన్నీ ఒక్కసారిగా బలహీనమైపోతాయి. బెల్లా విషయంలో ఆ భావోద్వేగం నవ్వు.. ఈ అరుదైన రుగ్మత వల్ల ఆమె ఆఫీసులో, నైట్ క్లబ్‌లో ఇలా ఎక్కడ పడితే.. అక్కడే నిద్రపోతుంది. అయితే, తనకు అన్నీ తెలుస్తుంటాయట.. మనం ఏమి మాట్లాడుతున్నాం.. ఇలా అన్నీ వినిపిస్తూనే ఉంటాయి.. కాకపోతే.. నిద్ర నుంచి లేవలేదు అంతే.. నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.. కాకపోతే.. అది కొంతవరకే ఉపయోగపడుతోందని బెల్లా చెప్పారు. పాపం.. బెల్లా..!
– సాక్షి సెంట్రల్ డెస్క్
చదవండి: మహిళ పాడు పని.. యాక్ థూ అంటున్న జనాలు
Comments
Please login to add a commentAdd a comment