
వాషింగ్టన్: రోజువారీ ఆహార పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పద్ధతి పాటించడంతో తక్కువ ఖర్చు తో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపారు. కెన్యాలోని మెరులో చేపట్టిన ఓ ప్రాథమిక పరిశోధనలో గ్లుటమేట్ అనే ఉప్పు రకానికీ.. దీర్ఘకాలిక వ్యాధులకూ మధ్య ఉన్న సంబంధంపై వారు పరీక్షలు జరిపారు. దీని కోసం 3 నెలలు లేదా అంతకంటే అధిక సమయం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 30 మంది రోగులపై పరీక్షలు జరిపారు.
మొదటగా వారికి గ్లుటమేట్ లేని ఆహారాన్ని అందించడంతోపాటు అధిక నీరును తాగమని కోరారు. కొన్ని వారాల్లోనే వారిలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గడం గుర్తించినట్లు అమెరికాలోని మిచిగాన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు డేనియల్ వివరించారు. గ్లుటమేట్ అనేది సోయా, జున్నుతోపాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభిస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment