Michigan State University
-
US Gunfire: అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం..
వాషింగ్టన్: అమెరికా మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరగడం కలకలం రేపింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. యూనివర్సిటీ అకాడెమీ బిల్డింగ్‌తో పాటు యూనియన్ బిల్డింగ్ వద్ద కాల్పులకు తెగబడాడు. ఈ రెండు చోట్ల జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఇంకా దొరకలేదని పోలసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే పలు క్యాంపస్ బిల్డింగ్‌లను అధికారులు ఖాళీ చేయించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నిందితుడికి సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతను మాస్కు ధరించి ఉన్నాడు. కాల్పుల అనంతరం యూనివర్సిటీ యూనియను బిల్డింగ్ నుంచి అతడు నడుచుకుంటూ వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డు అయింది. చదవండి: సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా వ్యోమగామి -
Yoga: డిప్రెషన్‌కు ఔషధ యోగం!
యోగా ఎంత మంచిదో ఇప్పటికీ మనకందరికీ తెలుసు. అంతేకాదు... పరిశోధనలూ, అధ్యయనాలూ జరుగుతున్న కొద్దీ మన యోగా తాలూకు ప్రాముఖ్యం కొత్త కొత్త విషయాలతో మాటిమాటికీ ప్రపంచానికి తెలియవస్తూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్తగా పాశ్చాత్యుల పరిశోధనల్లో సైతం యోగా గురించి మరో అంశం తాజాగా వెలుగుచూసింది. గర్భం ధరించిన యువతుల్లో అనేక హార్మోన్ల మార్పుల వల్ల భావోద్వేగాల మార్పులు (మూడ్ స్వింగ్స్) సాధారణం. అయితే ప్రతి ఐదుగురు గర్భవతులను పరిశీలిస్తే... వారిలో ఒకరికి ఈ మార్పులు చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంతో ఈ మూడ్ స్వింగ్స్కు ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం కనిపిస్తోంది. గర్భవతుల్లో ఒత్తిడిని ఎంత ఎక్కువగా తగ్గించగలిగితే... మూడ్ స్వింగ్స్ తీవ్రత అంతగా తగ్గుతుందని పరిశోధక బృందం తెలుసుకున్నారు. మూడ్ స్వింగ్స్ కారణంగా కలిగే డిప్రెషన్ లక్షణాల (డిప్రెసివ్ సింప్టమ్స్) ను నివారించేందుకు ఒత్తిడిని తొలగించేలా స్ట్రెస్ బస్టర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న మారియా ముజిక్ మాట్లాడుతూ ‘‘భారతీయుల యోగా మంచి స్ట్రెస్ బస్టర్ అని మనం గతంలోనే విని ఉన్నాం. అయితే అప్పట్లో దీన్ని పూర్తి తార్కాణాలతో నిరూపించేలా పరిశోధన ఫలితాలేమీ లేవు. దాంతో వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాలను రికార్డు చేసే పనిలో పడ్డాం. ఈ పనిలో మాకోవిషయం తెలియవచ్చింది. గర్భవతులు అనుసరించదగిన ఆరోగ్యకరమైన, సురక్షితమైన యోగా ప్రక్రియలతో అటు తల్లికి, ఇటు బిడ్డకు మేలు జరుగుతుందని మా అధ్యయనంలో తేలింది’’ అన్నారు. కొత్తగా తల్లి కాబోయే యువతుల్లో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక సమస్యలు రావడం చాలా సాధారణం. అయితే వీటికి చికిత్స చేయకుండా అలాగే వదిలేయడం వల్ల తల్లికీ, బిడ్డకూ హాని చేకూరడానికి అవకాశాలు ఎక్కువ. పైగా ఇలాంటి మహిళల్లో తల్లీ, బిడ్డా బరువు కోల్పోవడం, ప్రీ ఎక్లాంప్సియా, నెలలు నిండకముందే కాన్పు కావడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. అయితే గర్భవతులు పాటించదగిన సురక్షితమైన యోగా ప్రక్రియలు ఇలాంటి దుష్పరిణామాలను నివారించడమే గాక... తల్లికీ, బిడ్డకూ మధ్య మంచి ప్రేమానురాగాలను కూడా మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో 1226 మంది గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ఆమెకు సముద్రమే అన్నం ముద్ద -
టూత్‌పేస్ట్‌తో ఊపిరితిత్తుల వ్యాధులు దూరం!
మిచిగాన్ : మనిషి ప్రతినిత్యం ఉపయోగించే వాటిలో టూత్పేస్ట్ది ఓ ప్రత్యేక స్థానం. నిజం చెప్పాలంటే టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకున్న తర్వాతే రోజు మొదలవుతుంది అందరికీ. ఇది కేవలం పళ్లని శుభ్రం చేయడానికే కాదు.. ప్రాణాంతక జబ్బులను తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. టూత్‌పేస్ట్‌లో ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసన్ బ్యాక్టీరియాను చంపుతుందని, దాన్ని టుబ్రామిసిన్ అనే యాంటీ బ్యాక్టీరియా జౌషదంతో కలిపినపుడు అది రోగ సంబంధ క్రిములను 99 శాతం చంపగలిగిందని వారు తెలిపారు. ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే సిస్టిక్ ఫైబ్రోసిస్(ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి)ను నివారించగల్గిందని పేర్కొన్నారు. అయితే టుబ్రామిసిన్ ఉపయోగించటం వల్ల దుష్ప్రభావాలు ఉండటంతో దీని వాడకాన్ని తగ్గించడం జరిగిందన్నారు. పూర్తిగా కాకుండా కొద్ది మొత్తంలో వాడటం ద్వారా వ్యాధి నివారణకు తోడ్పడుతుందన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి పూర్తి స్థాయిలో నివారణ కనుక్కునే దిశగా అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే..? ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది ఒకటి. వంశపారపర్యంగా వచ్చే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ప్రతి 3000 మందిలో కనిపిస్తుంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా ఊపిరితిత్తులలో శ్లేష్మం పేరుకుపోతుంది. ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను చంపడం చాలా కష్టం. సూడోమోనాస్ ఎరుగినోస అనబడే ఈ బ్యాక్టీరియా బయోఫిల్మ్ రక్షణలో ఉండి మామూలు మందులతో నియంత్రణ కష్టంగా మారుతుంది. -
ఆహార మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
వాషింగ్టన్: రోజువారీ ఆహార పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పద్ధతి పాటించడంతో తక్కువ ఖర్చు తో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపారు. కెన్యాలోని మెరులో చేపట్టిన ఓ ప్రాథమిక పరిశోధనలో గ్లుటమేట్ అనే ఉప్పు రకానికీ.. దీర్ఘకాలిక వ్యాధులకూ మధ్య ఉన్న సంబంధంపై వారు పరీక్షలు జరిపారు. దీని కోసం 3 నెలలు లేదా అంతకంటే అధిక సమయం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 30 మంది రోగులపై పరీక్షలు జరిపారు. మొదటగా వారికి గ్లుటమేట్ లేని ఆహారాన్ని అందించడంతోపాటు అధిక నీరును తాగమని కోరారు. కొన్ని వారాల్లోనే వారిలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గడం గుర్తించినట్లు అమెరికాలోని మిచిగాన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు డేనియల్ వివరించారు. గ్లుటమేట్ అనేది సోయా, జున్నుతోపాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభిస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. -
సెటైక్ గాడ్జెట్స్
కిటికీ అద్దం... కరెంటు! కిటికీ అద్దాలు వెలుగుతోపాటు కొంచెం కరెంటు కూడా అందిస్తే ఎలా ఉంటుంది? ఫొటోలో కనిపిస్తున్న గాజుముక్క ఈ పనే చేస్తుంది. మిషిగన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు దీన్ని. ఈ రకమైన అద్దాల తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా పారదర్శకంగా ఉంటూ సౌరశక్తిని గ్రహించేలా చేయగలగడం ఇదే తొలిసారి. మనిషి కంటికి కనిపించని పరారుణ, అతినీలలోహిత కిరణాల్లోని శక్తిని ప్రత్యేక పదార్థాల సాయంతో సేకరించి... గాజు అంచుల్లో ఏర్పాటు చేసే సూక్ష్మస్థాయి సౌరశక్తి ఘటకాలకు సరఫరా చేయడం ద్వారా ఈ అద్దాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం వీటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. వీటిని విద్యుదుత్పత్తికి మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లుగానూ ఉపయోగించుకునే అవకాశముందని ఈ పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్త రిచర్డ్ లంట్ అంటున్నారు. పరికరం చిన్న...ప్రయోజనం మిన్న..! వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి, వ్యయప్రయాసలూ ఎక్కువే. కానీ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పరికరాన్ని చూశారుగా... రక్త, మూత్రపరీక్షలను చిటికెలో చేసేస్తాయి. మొబైల్‌ఫోన్‌ను జత చేస్తే.. ఫలితాలను ఎక్కడికైనా పంపవచ్చు. తగిన సలహా, సూచనలు పొందవచ్చు కూడా. హార్వర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని భారతదేశంలోనే పరీక్షిస్తున్నారు. కేవలం రూ.1500తో తయారు చేయగల ఈ పరికరం ఏ మొబైల్ఫోన్తోనైనా పనిచేస్తుంది. ఏ రకమైన పరీక్ష నిర్వహించాలన్నది సెలెక్ట్ చేసుకునేందుకు, రెండు బటన్లు ఉంటాయి. పరీక్షించాల్సిన పదార్థంలోకి కొసను ముంచి విద్యుత్తు వోల్టేజీ పంపినప్పుడు రసాయన సమ్మేళనాలను గుర్తించి విశ్లేషణ జరుపుతుంది. మధుమేహం, మలేరియా వంటి వ్యాధులతోపాటు వాతావరణ కాలుష్యాలను, నీటి కాలుష్యాన్ని కూడా ఈ పరికరం ద్వారా గుర్తించగలగడం మరో విశేషం. కరవును గుర్తించేందుకు నాసా ఉపగ్రహం... నాలుగు చినుకులు పడగానే దుక్కిదున్నడం... విత్తులేయడం రైతుల పని. కురిసిన వర్షం సరిపోకపోతే పంట చేతికందకపోవడమూ కద్దు. మరి నేల పైభాగంలో ఎంత తేమ ఉందో తెలిస్తే? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రెండు నెలల్లో ప్రయోగించే ‘సాయిల్ మాయిశ్చర్ ఆక్టివ్, పాసివ్ (ఎస్‌మ్యాప్)’ ఉపగ్రహం ఇదే పనిచేయనుంది. భూమికి 365 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ప్రపంచం మొత్తమ్మీద ఉపరితల తేమను లెక్కకట్టడం దీని లక్ష్యం. ఉపరితలం నుంచి అయిదు సెంటీమీటర్ల లోతువరకూ ఉండే తేమను గుర్తిస్తుంది ఈ ఉపగ్రహం. ఎస్‌మ్యాప్ ఒకసారికి దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోని తేమను లెక్కిస్తుంది. రెండు మూడు రోజులకు భూమి మొత్తం వివరాలు సేకరించగలుగుతుంది. కరవు పరిస్థితులను ముందుగానే తెలుసుకొనేందుకు ఎస్‌మ్యాప్ ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్త నరేంద్ర దాస్ తెలిపారు. కంటి పరీక్షలకు హైటెక్ కెమెరా! బాష్ ఇంజినీరింగ్ కంపెనీ తొలిసారి కంటి పరీక్షలను సులువు చేయగల, చేతిలో ఇమిడిపోయే సరికొత్త హైటెక్ కెమెరాను తయారు చేసింది. ఈ పరికరం తాలూకూ ఆలోచన, ఆచరణ మొత్తం భారత్‌లోనే పూర్తికావడం విశేషం. అరచేతిలో పట్టుకుని పరీక్షించగలిగేలా ఉండటం ద్వారా ఈ పరికరాన్ని ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. డయలేషన్ లేకుండా (కళ్ల పరీక్షకు ముందు చుక్కల మందు వేయడాన్ని డయలేషన్ అంటారు) కూడా కళ్లను పరీక్షించగలగడం దీని మరో ప్రత్యేకత. కంటి జబ్బులను గుర్తించేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించారు. కంటి ముందు, వెనుకభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను గుర్తించేలా దీని నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్లజోడు దుకాణాలు మొదలుకొని ఆసుపత్రుల వరకూ అందరూ సులువుగా ఉపయోగించవచ్చు. -
పరిశోధన బయట ఆడిస్తే... భక్తిపరులౌతారు!
పిల్లల్ని తరచు బయటికి తీసుకు వెళుతుంటే వారి మనసు వికసిస్తుంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఇప్పుడు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మరొక మంచి విషయాన్ని కూడా కనిపెట్టారు. వారానికి కనీసం 5 నుంచి 10 గంటల పాటు పార్కులో, మైదానాలలో ఆడుతుండే పిల్లల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయట! ప్రకృతితో పిల్లలకు ఏర్పడే అనుబంధం వారిలో ఆత్మసంతృప్తిని, భక్తి ప్రపత్తులను కలిగిస్తుందని; పరిపూర్ణమైన మానవులుగా వారు ఎదుగుతారని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఆధ్యాత్మిక అధ్యయనాల విభాగం సహాయ ఆచార్యులు గ్రెటెల్ వాన్ వియరన్ చెబుతున్నారు. ‘‘ఆధునిక జీవితం మనిషికి, ప్రకృతికి మధ్య దూరాన్ని పెంచుతూ పోతోంది. దీని పర్యవసానం ఏమిటి? ముఖ్యంగా మన పిల్లలపై ఈ దూరం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలకు జవాబు వెతుక్కునే ప్రయత్నంలో మాకు ఒక పెద్ద అధ్యయనమే అవసరమైంది. తరచూ ఆరు బయట ఆటలాడే పిల్లలకు, ఇండోర్ గేమ్స్‌కు మాత్రమే పరిమితమైపోయి, ఎప్పుడోగాని బయటికి వెళ్లని పిల్లలకు మధ్య వ్యత్యాసాలను మా అధ్యయనంలో సునిశితంగా గమనించాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న పిల్లల్లో ప్రశాంతత, విధేయత; ప్రకృతిలోని విశేషాల పట్ల గౌరవభావం వంటివి మాకు కనిపించాయి’’ అని విరయన్ వెల్లడించారు. పిల్లల్ని, వారి పెద్దల్ని ఇంటర్వ్యూ చేయడం, పిల్లలు గీసిన బొమ్మల్ని శ్రద్ధగా పరిశీలించడం, వారి డైరీలను విశ్లేషించడం వంటి పద్ధతులను వియరన్ బృందం తమ అధ్యయనానికి అవలంభించింది. వీరి అధ్యయన ఫలితాలను బట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రార్థనా స్థలాలు ఎలాగో, ప్రకృతి కూడా అలాగేనని! కనుక పిల్లల్ని వీలైనప్పుడల్లా రమణీయమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం పెద్దల బాధ్యత.