తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్‌ | Kamakshi Bhaskarla Sharing Her Dietary Habits | Sakshi
Sakshi News home page

తేళ్లు, బొద్దింకలు తిన్నాను.. తెలుగు హీరోయిన్‌

Published Wed, Feb 26 2025 1:08 PM | Last Updated on Wed, Feb 26 2025 2:18 PM

Kamakshi Bhaskarla Sharing Her Dietary Habits

డాక్టర్ అవ్వబోయి యాక్టర్లు అయిన నటీనటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. కానీ డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టినవారు కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) ఒకరు. చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసిన ఈ తెలుగమ్మాయి.. కొన్నాళ్ల తర్వాత వైద్యవృత్తిని వదిలేసి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మా ఊరి పొలిమేర చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2 తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. 

(చదవండి: రీరిలీజ్‌తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!)

అయితే నటిగా మాత్రమే కామాక్షి అందరికి తెలుసు. ఆమె డాక్టర్‌ అని, ఆరేళ్ల పాటు చైనాలోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి, తన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది కామాక్షి. ‘చైనాలో ఆరేళ్ల పాటు ఉన్నాను. నాకు వంటలు చేయడం వచ్చు. గదిలోనే నేను వంట చేసుకొని తినేదాన్ని. అయితే చైనా ఫుడ్‌ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆ ఫుడ్‌ తిన్నాను. బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశాను(నవ్వుతూ..). నేను ఒక్కడికి వెళ్లినా.. అక్కడ వంటకాలు ట్రై చేస్తాను. 

అందులో భాగంగానే చైనా ఫుడ్‌ తిన్నాను’ అని కామాక్షి చెప్పుకొచ్చింది. అంతేకాదు చైనా వాళ్లు బొద్దింకలు, పాములు, తేళ్లను ఎందుకు తింటారో కూడా వివరించింది. కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదనీ.. తినడానికి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో ఇలా కనిపించిన జీవుల్ని చంపి తినడం అలవాటైందని మీనాక్షి చెప్పుకొచ్చింది.

ఇక ఇండస్ట్రీలొ​కి వచ్చిన తర్వాత తనలో జరిగిన మార్పుల గురించి చెబుతూ..‘నాకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా బయట ప్రపంచం తెలియదు. నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. . కష్టమైనా.. నష్టమైనా.. సంతోషమైన ఇతరులతో పంచుకోవడానికి కాస్త ఆలోచించేదాన్ని. కాలేజ్ కి వెళ్లే సమయంలో కూడా ఇల్లు, కాలేజ్ ఇంతే నాకు తెలిసిన ప్రపంచం. అయితే ఒక్కసారిగా ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనిపించింది. అక్కడే నా ఆలోచన నన్ను పూర్తిగా మార్చేసింది. ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా, సుస్మీతాసేన్‌ వంటి వారిలా తాను తమను తాము ప్రూవ్ చేసుకొని, ఇతర మహిళలను కూడా ఎంకరేజ్ చేసేవారు. ఇక అప్పుడే నాకనిపించింది. నేను కూడా ఆ పొజిషన్లో ఉండాలి. నాలాగా తమ అభిప్రాయాలను బయటకి చెప్పుకోలేని అమ్మాయిలకు అండగా నిలవాలి అని నేను కూడా అనుకున్నాను. ఇక అలా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా మారుతూ వచ్చాయి’ అని కామాక్షి చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement