ఆమె వ్యాధి 'మెడికల్‌ మిస్టరీ'! ఏ భావోద్వేగాన్ని వ్యక్తం చేసినా ఇక అంతే..! | US Woman Describes Her Chronic Illness It Feels Like She Burning | Sakshi
Sakshi News home page

ఆమె వ్యాధి 'మెడికల్‌ మిస్టరీ'! భావోద్వేగాన్ని వ్యక్తం చేసిందో .. చర్మం భగభగ మండిపోద్ది!

Dec 18 2023 5:08 PM | Updated on Dec 18 2023 5:19 PM

US Woman Describes Her Chronic Illness It Feels Like She Burning - Sakshi

కొన్ని రకాల వ్యాధులు వైద్యానికి అంతు చిక్కని మిస్టీరియస్‌ వ్యాధుల్లా ఉంటాయి. బాబోయ్‌ ఇదేం వ్యాధి! అనేలా జుగుప్సకరంగా ఉంటాయి. ఆ వ్యాధిని ఫేస్‌ చేస్తున్న బాధితులకే కాదు చూస్తున్న వాళ్లను కూడా హడలెత్తిస్తాయి. అలాంటి అంతు చిక్కని విచిత్రమైన వ్యాధిని ఎందుర్కొంటోంది 20 ఏళ్ల బెత్ త్సంగరైడ్స్.

అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన బెత్ త్సంగరైడ్స్ అనే 20 ఏళ్ల అమ్మాయి వైద్య విధానానికి అందని ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎలాంటి భావోద్వేగాలకు స్పందించిందా ఇక అంతే!.. ఆమె శరీరీం యాసిడ్‌ పోసినట్లు భగభగమని మండిపోతుంటుంది. వెంటనే చర్మంపై దద్దుర్లతో కూడిన ర్యాషస్‌ వచ్చేస్తాయి. అవి అచ్చం కాలిన గాయాల మాదిరిగా దారుణంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఆమెకు సరిగ్గా 15 ఏళ్ల ప్రాయం నుంచి ఫేస్‌ చేస్తోంది. వైద్యులు సైతం ఆమె వ్యాధిని 'మెడికల్‌ మిస్టరీ'గా వ్యవహరించారంటే.. అది ఎంత విచిత్రమైన వ్యాధో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దీన్ని వైద్య భాషలో 'చలనశీత సమస్యలని' అంటారు. నవ్వడం దగ్గర నుంచి ఏడుపు వరకు ప్రతిదానికి ఆమె ముఖంపైన చర్మం రియాక్షన్‌ ఇచ్చేస్తుంది. దీంతో ఆమె ఆ బాధను భరించలేక బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయింది. అదీ కూడా ఓ గదిలో ఒంటిరిగా ఉండటమే. కనీసం బయటకు వెళ్లి గడిపే అవకాశం కూడా లేదు. వీచే గాలులకు, మంచి సుగంధభరితమైన వాసనలకు ఆమె చర్మం వెంటనే రియాక్షన్‌ చెంది ర్యాషస్‌ వచ్చేయడం మొదలైపోతుంది. ఈ అసాధారణ దీర్ఘకాలిక వ్యాధి కారణంగా సరిగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సాగలేదు, స్నేహితులు కూడా లేకుండా పోయారని ఆవేదనగా చెబుతోంది. ఈ వింత వ్యాధిని టాచీకార్డియో సిండ్రోమ్‌(పీవోటీఎస్‌)గా నిర్థారించారు వైద్యులు.

అమెరికా నేషనల్‌ హెల్త్‌ సర్వే ప్రకారం..ఈ పీవోటీఎస్‌ వ్యాధికి సాధారణంగా మైకము, మూర్ఛ, దడ, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి కానీ ఆమెకు మాత్రం అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా అరుదుగా కొద్దిమందిలోనే కనిపిస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి కారణంగా ఆమె ప్రేగులు, మూత్రపిండాలు సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధి కారణంగా ఆమె మొత్తం ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. ఆమె ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదీపడితే అది తినేందుకు కూడా వీలులేదు. కనీసం బయట ఫుడ్‌ని కూడా ఆస్వాదించలేదు. ఒకవేళ తినాలనుకున్నా చాలా ప్లాన్‌ చేసుకోవాలి, అక్కడ చెఫ్‌లకు తనకు ఇచ్చే ఆహారం ప్రిపరేషన్‌కి సంబంధించిన జాగ్రత్తలు వివరించాలి. ఇంత తతంగం ఉంటేనేగానీ బయటకీ రాలేని స్థితి ఆ అమ్మాయి పరిస్థితి.

ఈ రియాక్షన్‌లతో ఆమె ముఖం మచ్చలు మచ్చలుగా అసహ్యంగా తయారయ్యింది. కనీసం అద్దంలో చూసుకుంటేనే ఒక విధమైన ఇబ్బందికి అనిపిస్తుంది ఆమెకు. అయినప్పటికీ ఆ ఇబ్బందులన్నింటిని తట్టుకుని నూతన ఉత్సహాంతో గడిపేయత్నం చేస్తోంది. తన పరిస్థితి ఇంతే..! తానే బాగుండటానికి ప్రయత్నించాలని సమస్యతో పోరాడేలా తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే యత్నం చేస్తోంది. పైగా ముఖానికి మేకప్‌ వేసుకుని ఆకర్షణీయంగా కనిపించే యత్నం కూడా చేస్తోంది.

.

అయితే వైద్యులు ఈ మేకప్‌ని కూడా అస్సలు వినియోగించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే 'ఆమెకు ఆమె ఎలర్జీ' కదా!. ఐతే బెత్ త్సంగరైడ్స్‌కి మేకప్‌ వేసుకోవడమంటే చాలా ఇష్టమంటా..!. అలా మేకప్‌ వేసుకుని తనను తాను చూసుకోవడం ఇష్టం అని చెబుతుంది బెత్ త్సంగరైడ్స్. నిజానికి ఇలాంటి వ్యాధి పగవాడికి రాకూడదనిపిస్తోంది. అసలు ఎలాంటి భావోద్వేగం చెందించలేని స్థితి అంటే.. ఎంతటి దారుణమైన స్థితి. ఒకరకంగా చెప్పాలంటే జీవనమే స్థంబించనట్లు ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి తనలో ఆత్మవిశ్వాసాన్ని కూడగొట్టుకుని బతికే యత్నం చేస్తున్నందుకు హ్యాట్సాప్‌ అని చెప్పాలి కదూ..!.

(చదవండి: జస్ట్‌ హెయిర్‌ డ్రైయర్‌ వాడినందుకు.. ఏకంగా రూ. 78 వేలు వసూలు చేసిన హోటల్‌ యాజమాన్యం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement