పేపర్‌తో మైక్రోస్కోప్ | Paper microscope | Sakshi
Sakshi News home page

పేపర్‌తో మైక్రోస్కోప్

Published Thu, Apr 3 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

పేపర్‌తో మైక్రోస్కోప్

పేపర్‌తో మైక్రోస్కోప్

న్యూయార్క్: మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను చక్కగా చూడడానికి ఉపయోగించే మైక్రోస్కోప్(సూక్ష్మదర్శిని) గురించి మనందరికీ తెలిసిందే. ప్రయోగశాలల్లో, ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ఈ మైక్రోస్కోప్‌ల ఖరీదు సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటుంది. అలాంటి మైక్రోస్కోప్‌లను కాగితంతో కారుచౌకగా అభివృద్ధి చేస్తే...సామాన్యుడికి అందుబాటులో...ఏకంగా జేబులో పెట్టుకొని తిరిగే విధంగా రూపొందిస్తే.... అది నిజంగా అద్భుతమే కదా... ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు భారత సంతతికి చెందిన అమెరికా పరిశోధకుడు. 

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మనుప్రకాష్ తన బృందంతో కలసి కాగితంతో మైక్రోస్కోపును అభివృద్ధి చేశాడు. ‘ఫ్లొడ్‌స్కోప్’గా పిలిచే ఈ మైక్రోస్కోప్ అత్యంత చవకైనది కూడా. మూడు భాగాలుగా ఉండే దీని నిర్మాణంలో ఒక ఎల్.ఈ.డీ. లైట్, లెన్స్ కూడా అమర్చారు.  ఈ మైక్రోస్కోపును పూర్తిగా విప్పేసి మన జేబులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కేవలం ఒక్క నిమిషంలో మళ్లీ మైక్రోస్కోపును పూర్తిస్థాయిలో బిగించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement