పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్‌ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే వైర్‌లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్‌పోన్‌ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.
తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.
Smartphone under a Microscope
📹 Rajinder Singh
pic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024
ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment