Microscope
-
స్మార్ట్‌ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి. -
స్మార్ట్ఫోన్లకు మైక్రోస్కోప్.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే?
వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్ స్మార్ట్‌ఫోన్‌కు మైక్రోస్కోప్ చూపునిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్‌కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో ఉన్నంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. ఈ లెన్స్ స్మార్ట్‌ఫోన్ లెన్స్‌లో సాధారణంగా కనిపించే వస్తువులను వాటి పరిమాణానికి పన్నెండువందల రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. దీని ద్వారా తీసే ఫొటోల రిజల్యూషన్ 700ఎన్ఎం ఉంటుంది. ఈ మైక్రోస్కోపిక్ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అమర్చుకుంటే, రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, చంద్రుడిని అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సుదూర దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఐ మైక్రోస్కోప్’ ఈ లెన్స్‌ను ‘ఐమైక్రో క్యూ3’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 35 డాలర్లు (రూ.2,910) మాత్రమే! -
ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ముస్కోప్గా నామకరణం చేసిన ఈ ఆవిష్కరణ ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటీ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. దీని తయారీకి తక్కువ ఖర్చు అయిందని పేర్కొన్నాయి. వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉప యోగపడుతుందని పేర్కొన్నాయి. ఆఫ్–ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్ చిప్‌లతో తయారు చేసిన ఈ పరికరం వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. దీన్ని డాక్టర్ శిశిర్‌కుమార్ ఆవిష్కరించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఆయనను అభినందించారు. సాంకేతికత ప్రయోజనాలను సమాజానికి అందిం చేందుకు హైదరాబాద్ ఐఐటీ కృతనిశ్చయంతో పని చేస్తోందని చెప్పారు. డాక్టర్ శిశిర్ కుమార్ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజతి, ఎంటెక్ విద్యార్థి సౌరవ్ కుమార్ ఈ మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ కెమెరాను సూక్ష్మదర్శిని చేసే గాడ్జెట్
స్మార్ట్‌ఫోన్‌తో ఇప్పుడు బోలెడన్ని పనులు చేయవచ్చు. తాజాగా ఈ పనుల జాబితాలోకి చేరింది సూక్ష్మదర్శిని. ఆస్ట్రేలియాలోని ఏఆర్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నానోస్కేల్ బయోఫొటానిక్స్ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఓ చిన్న గాడ్జెట్‌ను తగిలించుకుంటే చాలు.. స్మార్ట్‌ఫోన్ కెమెరాతోనే అతిసూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్ల వంటివాటిని చూసేయవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే ఈ సరికొత్త సూక్ష్మదర్శిని మిల్లీమీటర్ కంటే రెండు వందల రెట్లు చిన్నవైనవాటిని చూడగలదు. వీటితో రక్తకణాలు, కణ కేంద్రకం వంటి సూక్ష్మమైనవాటినీ చూడవచ్చునని అంటున్నారు డాక్టర్ అంటోనీ ఓర్త్. పరిశోధనశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ దీని ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చునని చెప్పారు. ఈ గాడ్జెట్ తయారీ వెనుక ఉన్న టెక్నాలజీని తాము అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని తద్వారా ఎవరైనా దీన్ని తయారు చేసి వాడుకోవచ్చునని ఓర్త్ తెలిపారు. -
అణుస్థాయి ఫొటోలు తీశారు
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పొచ్చు అంటారు. కంటికి కనిపించే వాటి విషయంలో ఇది నిజమే కానీ.. మైక్రోస్కోప్ వాడినా కంటికి చిక్కని అతి సూక్ష్మమైన వైరస్లు, అణువుల సంగతేంటి? నానోమీటర్ల స్థాయిలో ఉండే వీటిని ముందు చూసి.. ఫొటోలు తీయగలగాలి. అప్పుడే వాటి గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలను తగ్గించుకునేందుకు కొత్త మందులను ఆవిష్కరించేందుకు వీలవుతుంది. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ విధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీతలు జాక్స్ డుబోషే, జొయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లు బయో కెమిస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. అతిసూక్ష్మమైన అణువుల చిత్రాలను తీయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లు అందుబాటులో ఉన్నా అవి మృత పదార్థాల్లోని అణువుల చిత్రాలు తీసే వరకే పనికొచ్చాయి. పరిశీలించాల్సిన పదార్థాన్ని శూన్యంలో ఉంచడం.. దానిపైకి శక్తిమంతమైన ఎలక్ట్రాన్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే ఎలక్ట్రాన్ కిరణాల శక్తికి జీవాణువులు జీవించి ఉండటం కష్టం. 1990లో రిచర్డ్ హెండర్సన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుతోనే అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రాన్ కిరణాల శక్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ఏడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ల స్పష్టత ఉన్న చిత్రాలను తీయగలిగారు. పదార్థాలను శీతల నైట్రోజన్‌లో ఉంచడం ద్వారా స్పష్టత మరింత పెరిగింది. కొన్ని మార్పుల ద్వారా ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అత్యంత స్పష్టమైన చిత్రాలు పొందేందుకు ఉపయోగిం చొచ్చని స్పష్టమైంది. జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్‌లు ఈ మార్పులను ప్రయోగపూర్వకంగా చూపించారు. ఫలితంగా రూపుదిద్దుకున్న సరికొత్త టెక్నాలజీ పేరే క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. క్రయో అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. ఈ అంశం ఆధారంగా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పనిచేస్తుంది. సాధారణ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 2డీ చిత్రాలనే తీయొచ్చు. పైగా చాలా అస్పష్టంగా ఉంటాయి. ఫ్రాంక్ 1975– 86 మధ్య కాలంలో అభివృద్ధి చేసిన ఇమేజ్ ప్రాసెసింగ్ పద్ధతితో త్రీడీ చిత్రాలు మరింత స్పష్టంగా రావడం మొదలైంది. వేర్వేరు 2డీ చిత్రాలను కలపడం ద్వారా ఇది సాధ్యమైంది. ఇంకోవైపు డుబోషే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీకి నీటిని జోడించడం ద్వారా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నాలజీని పూర్తిస్థాయికి చేర్చారు. -
మైక్రోస్కోప్... మడతడిపోది!
మైక్రోస్కోప్ అంటే అంత పెట్టె, దానికి తగిలించిన గొట్టం, ఆ గొట్టానికి భూతద్దాలు... ఈ పటాటోపమంతా మనకు తెలిసిందే. టెక్నాలజీ చాలా మారినా మైక్రోస్కోప్ రూపురేఖల్లో మాత్రం చాలాకాలం వరకు పెద్దగా మార్పులు రాలేదు. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఇంచక్కా మడతడిపోయే మైక్రోస్కోప్ మన ముందుకొచ్చింది. మీరట్ యువకుడు మనుప్రకాశ్ దీనిని రూపొందించాడు. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఈ యువకుడు, కాస్త వినూత్నంగా ఆలోచించి, ఏ4 సైజు కాగితం పరిమాణంలో తేలికగా మడత పెట్టడానికి వీలయ్యే మైక్రోస్కోప్‌ను తయారు చేశాడు. కాన్పూర్‌లో చదువయ్యాక ఇతడు అమెరికా వెళ్లి, అక్కడ ఎంఐటీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేశాడు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ప్రకాశ్ ల్యాబ్స్ పేరిట సొంత లాబొరేటరీని నిర్వహిస్తున్నాడు. కాగితంపైనే లెన్సులు, గొట్టం ఇమిడిపోయి ఉండేలా మనుప్రకాశ్ తయారు చేసిన ఈ మైక్రోస్కోప్‌ను... మడతపెట్టేసి, బ్యాగులో ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. దీని ధర కూడా కారుచౌక. కేవలం 50 సెంట్లు (మన కరెన్సీలో సుమారు రూ.30) మాత్రమే! -
సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు?
కంటికి నేరుగా కనిపించని జీవ జాలాలను సూక్ష్మజీవులు అంటారు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్ మొదలైనవి సూక్ష్మజీవులకు ఉదాహరణ. వీటిలో వైరస్ తప్ప మిగతా సూక్ష్మజీవులు మానవ సంక్షేమానికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా హాని కలిగించేవి కూడా ఉన్నాయి. వీటి ఉనికికి సంబంధించిన అధ్యయనం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. జెకారియస్ జాన్సన్ 1590లో సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. ఆ తర్వాత ఆంటోని వాన్ లీవెన్ హాక్ సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. కొన్ని సూక్ష్మజీవులను అతి శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. దీన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అంటారు. దీన్ని నాల్, రస్కా 1932లో కనుగొన్నారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా సూక్ష్మ జీవిని సుమారు లక్ష రెట్లు పెద్దదిగా చేసి చూడొచ్చు. సూక్ష్మజీవులు - బ్యాక్టీరియా బ్యాక్టీరియాను ఆంటోని వాన్ లీవెన్ హాక్ 1676లో కనుగొన్నారు. బ్యాక్టీరియా అని పేరు పెట్టినవారు ఎహెరెన్ బర్గ. బ్యాక్టీరియా విశ్వవ్యాప్తం. దాదాపు అన్ని రకాల ఆవాసాల్లో జీవించగలుగుతుంది. ఆంథ్రాక్స్ను కలగజేసే బ్యాక్టీరియాను కనుగొన్నందుకు రాబర్ట కోచ్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఎడ్వర్డ జెన్నర్ (1796) బ్యాక్టీరియా వ్యాధులను - నిర్మూలించే వ్యాక్సినేషన్‌ను కనుగొన్నారు. బెజరింక్ (1888) లెగ్యూమ్ మొక్కల వేరుబుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియాను కనుగొన్నారు. బ్యాక్టీరియాను ‘మిత్రులు, శత్రువులు’, ‘ప్రకృతి పారిశుధ్య కార్మికులు’గా పేర్కొం టారు. బ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవకణం. అతిపెద్ద బ్యాక్టీరియా - ఎపులోపిసియం పిసెల్సోని. అతి చిన్న బ్యాక్టీరియా పీపీఎల్ఓ(ప్లూరో న్యుమోనియా లైక్ ఆర్గానిజం). పెద్దపేగులో ఉండే బ్యాక్టీరియా ఎశ్చరీసియా కోలి. గంగా నదిలో ఉండే బ్యాక్టీరియా - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్. మట్టిలో ఉండే బ్యాక్టీరియా - క్లాస్ట్రీడియం. బ్యాక్టీరియా కణంలో సుమారు 70% నీరు, 21% ప్రోటీన్స, 4.5% కేంద్రకామ్లాలు, 3% లిపిడ్స, 1.5% పాలీశాఖరైడ్స ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు కశాభాలను కలిగి ఉంటాయి. ఇవి చలనానికి, ఇతర జీవులను అంటుకొని ఉండటానికి తోడ్పడతాయి. బ్యాక్టీరియా వివిధ ఆవాసాల్లో జీవిస్తుంది. ఒక గ్రామ్ మృత్తికలో 106 - 107 బ్యాక్టీరియాలుంటాయి. మంచినీటిలో కంటే మురుగునీటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాలు పరాన్నజీవులుగా, సహ జీవులుగా, కొన్ని పూతికాహారులుగా జీవిస్తాయి. రైజోబియం, ఇ-కొలీ అనే బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తాయి. వ్యాధులను కలిగించేవి పరాన్నజీవ బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియాలు... వేడి బుగ్గల్లో, అతిశీతల ప్రదేశాల్లో, ఆమ్ల (ఎసిడోఫిలిక్), క్షార (ఆల్కలోఫిలిక్), లవణ (హాలోఫిలిక్) స్వభావం ఉండే ప్రదేశాల్లో నివసిస్తాయి. బ్యాక్టీరియా కణ కవచం మ్యూరిన్/మ్యూరామక్ ఆమ్లంతో నిర్మితమై ఉంటుంది. కణ కవచంపై ప్లాజెల్లా (కశాభాలు) ఉంటాయి. కణత్వచం ముడతలను మీసోజోమ్ అంటారు. ఇది శ్వాసక్రియలో తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో కేంద్రకం లోపించి కేవలం డీఎన్ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. తక్కువ పరిమాణంలో ఉన్న డీఎన్ఏను ప్లాస్మిడ్ అంటారు. ఇది డీఎన్ఏ టెక్నాలజీ / జెనెటిక్ ఇంజనీరింగ్‌లోనూ తోడ్పడుతుంది. బ్యాక్టీరియాలో నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్. కొన్ని బ్యాక్టీరియాల్లో క్రోమాటోఫోర్ ఉండటం వల్ల అవి పిండి పదార్థాలను తయారు చేసుకోగలుగుతాయి. బ్యాక్టీరియాలో ద్విదావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ప్రతి 18 - 20 నిమిషాలకు ఒకసారి కణాలు ద్విగుణీకరణం చెందుతాయి. బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి విధానాలు 1. జన్యుపరివర్తన: దీన్ని ప్రెడ్గ్రిఫిట్ అనే శాస్త్రజ్ఞుడు ఎలుకల్లో ఉండే స్రెప్టోకోకస్ న్యుమోనియే అనే బ్యాక్టీరియాలో కనుగొన్నాడు. ఒక కణంలోని జన్యు పదార్థం అది పెరిగి యానకం ద్వారా వేరే కణంలోకి బదిలీ అవుతుంది. 2. సంయుగ్మం: ఈ విధానాన్ని లెడెన్బర్గ, టాటం అనే శాస్త్రజ్ఞులు ఇ. కొలి బ్యాక్టీరియాలో కనుగొన్నారు. కణాలు పరస్పరం తాకడం వల్ల జన్యుమార్పిడి జరుగుతుంది. 3. జన్యు వాహనం: దీన్ని లెడెన్బర్గ, జిండర్ అనే శాస్త్రజ్ఞులు సాల్మోనెల్లా టైఫిమ్యారియం అనే బ్యాక్టీరియాలో కనుగొన్నారు. దీంట్లో వైరస్ (బ్యాక్టీరియోఫేజ్) ద్వారా కణంలోకి జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. అభిరంజన లక్షణాన్ని బట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాగా గుర్తిస్తారు. దీనిలో క్రిస్టల్ వయోలెట్‌ను ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని క్రిస్టియన్ గ్రామ్ కనుగొన్నారు. గ్రామ్ పాజిటివ్సలో ట్రైకోయిక్ ఆమ్లం ఉంటుంది. బ్యాక్టీరియా - ప్రయోజనాలు పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా - లాక్టోబాసిల్లస్ పెద్దపేగులో ఉండి ఆ12 విటమిన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ృ ఇ.కొలీ జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ఎక్కువగా తోడ్పడేది ృ ఇ.కొలీ గోబర్‌గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా - మిథనోకోకస్, మిథనో బాసిల్లస్ గంగానదిలో హానికర సూక్ష్మజీవులను నశింపజేసేది - డీలో విబ్రియో బ్యాక్టీరియో వోరస్ వ్యవసాయ రంగంలో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియాలు - నైట్రోసో మోవాస్, నైట్రోబాక్టర్, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, క్లాస్ట్రీడియం మొదలైనవి. లెగ్యూమ్ (పప్పుధాన్యాలు) మొక్కల్లో నత్రజని స్థాపన చేసేది - రైజోబియం. రెట్టింగ్ (నార తీయడం), టానింగ్ (తోళ్లను పదును పెట్టడం), పొగాకు క్యూరింగ్, కిణ్వణం మొదలైన ప్రక్రియల్లో ఉపయోగపడేవి... క్లాస్ట్రీడియం బ్యుటలకం, క్లాస్ట్రీడియం ఫెల్సీనియం. వివిధ రకాల యాంటీ బయోటిక్స్ కూడా బ్యాక్టీరియాల నుంచి లభిస్తాయి. {స్టెప్టోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ గ్రిసియస్ (దీన్ని వాక్స్మెన్ కనుగొన్నాడు) టెట్రాసైక్లిన్ (ఆరోమైసిన్) - స్ట్రెప్టోమైసిస్ ఆరోఫేసియస్ ఎరిథ్రోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఎరిథ్రియస్ నియోమైసిన్ - స్ట్రెప్టోమైసిన్ ఫ్రాడియే టెర్రామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ రియోసస్ కనామైసిన్ - స్ట్రెప్టోమైసిస్ కెనోమైసిటియస్ క్లోరో మైసిటిన్ - స్ట్రెప్టోమైసిన్ వెనిజులె పాలిమిక్సిన్ బి- బాసిల్లస్ పాలిమిక్సా సింథటిక్ రబ్బర్ తయారీలో అసిటో బాక్టర్ను ఉపయోగిస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో ట్రాన్సజెనిక్ ప్లాంట్స్‌ను తయారు చేసేందుకు బాసిల్లస్ దురెంజియన్సిస్, ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేసియన్స, ఇ-కొలీ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యురేనియం, కాపర్ గనుల్లోనూ థయోబాసిల్లస్ ఫెరాక్సిడెన్స వంటి బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. జున్ను పరిశ్రమల్లో తయారయ్యే యోగార్టను లాక్టోబాసిల్లస్ సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి తీస్తారు. పర్యావరణ పరిరక్షణలో ఎక్రోమోబాక్టర్, అసిటోబాక్టర్, ఫ్లావో బ్యాక్టీరియం వంటివి 2, 4ఈ, ఈఈఖీ వంటి వాటిని నశింపజేస్తాయి. పాలను పెరుగుగా మార్చడానికి ముందు పాలను వేడి చేసి చల్లార్చుతారు. దీన్నే పాశ్చరైజేషన్ అంటారు. పాలను 50 ృ 600ఇ వరకు వేడి చేసి హానికర బ్యాక్టీరియాను నశింప జేస్తారు. ఈ విధానాన్ని లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. ఇతడిని సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. కలరా సంభవించినప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. దీన్ని తయారు చేసేందుకు ఒక గ్లాసు నీటిలో 3 చెంచాల చెక్కర, 1 చెంచా ఉప్పును కలపాలి. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాల నిర్మూలనకు ఈ్కఖీ(ట్రిపుల్ యాంటీజెన్) ఇంజెక్షన్ చేస్తారు. డిప్తీరియా నిర్ధారణకు షేక్ పరీక్ష చేస్తారు. ధనుర్వాతం కండరాలకు సంభవిస్తుంది. టైఫాయిడ్ వ్యాధి పేగు భాగానికి సోకుతుంది. దీని నిర్ధారణకు వైడల్ పరీక్ష చేస్తారు. క్షయ వ్యాధి ఊపిరితిత్తులు, ఎముకలకు సోకుతుంది. దీని నిర్మూలనకు ఆఇఎ టీకా, నివారణకు ఈైఖీ చికిత్స చేస్తారు. గనేరియా, సిఫిలిస్ అనేవి ఖీఈ వ్యాధులు (్ఛ్ఠఠ్చడ ఖీట్చటఝజ్ట్ట్ఛీఛీ ఛీజీట్ఛ్చట్ఛట) గొర్రెల్లో ఆంథ్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంథ్రోసిస్ ద్వారా సంభవిస్తుంది. కుక్కలు, పశువుల్లో ట్యుబర్ కులోసిస్ అనేది మెకో బ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ వల్ల సంభవిస్తుంది. పశువుల్లో మైకోబ్యాక్టీరియం బోవిస్ వల్ల ఆక్టినో మైకోసిస్, విబ్రియోటిటస్ వల్ల విబ్రియోసిస్ వ్యాధులు సంభవిస్తాయి. కలుషిత ఆహారాన్ని తిన్నప్పుడు ‘బొటులిజం’ అనే వ్యాధి సంభవిస్తుంది. మొక్కలు - బ్యాక్టీరియా వ్యాధులు వరిబ్లైట్ - జాంథోమోనాస్ ఒరెజై సిట్రస్ కాంకర్ (నిమ్మగజ్జి) - జాంథోమోనాస్ సిట్రె ఆపిల్ బ్లైట్ - ఎర్వీనియా అమైలోవొరా ఆపిల్, పియర్ వ్రణాలు - ఆగ్రో బ్యాక్టిరాయం ట్యుమిఫేసియన్స పత్తి కోణీయ ఆకుమచ్చ తెగులు - జాంథోమోనాస్ మాల్వేసియారం సొలనేసి మొక్కల వడల తెగులు - సూడోమోనాస్ సొలనేసి యారం గతంలో అడిగిన ప్రశ్నలు 1. ట్యుబర్ క్యులోసిస్ వ్యాధి దేని వల్ల వస్తుం ది? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) వైరస్ 2) ప్రోటోజోవా 3) పోషకాహార లోపం 4) బ్యాక్టీరియా 2. డయేరియాను తగ్గించడానికి వాడే ద్రావ ణం ైఖను విస్తరించండి? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) Oral Rehydration Solution 2) Oral Recharging Solution 3) Oral Replenishing Solution 4) Oral Reducing Solution 3. కింది వాటిలో దేన్ని నిర్ధారించడం కోసం ‘వైడల్ పరీక్ష’ చేస్తారు? (పోలీస్ కానిస్టేబుల్ -2012) 1) మలేరియా 2) టైఫాయిడ్ 3) ట్యుబర్ క్యులోసిస్ 4) పచ్చజ్వరం 4. తాజా పాలకు కొంచెం ఆమ్లత్వం ఉండటా నికి కారణం? (ఎస్ఐ -2012) 1)ఇౌ2 మాత్రమే 2) ఏ2ఇై3 మాత్రమే 3) లాక్టిక్ బ్యాక్టీరియా మాత్రమే 4) పైవన్నీ 5. ఏ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? (ఎస్ఐ -2012) 1) తట్టు 2) ధనుర్వాతం 3) కంఠవాతం 4) ఊపిరితిత్తుల క్షయ 6. పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి కారణం? (ఎస్ఐ -2011) 1) సిట్రిక్ ఆమ్లం 2) ఎసిటిక్ ఆమ్లం 3) లాక్టిక్ ఆమ్లం 4) టార్టారిక్ ఆమ్లం 5) ఆక్సాలిక్ ఆమ్లం మాదిరి ప్రశ్నలు 1. బ్యాక్టీరియా శుద్ధ వర్ధనం చేసిన మొదటి వ్యక్తి? 1) లూయీస్ పాశ్చర్ 2) ఆంటోని వాన్ లీవెన్ హాక్ 3) ఎడ్వర్డ జెన్నర్ 4) రాబర్ట కోచ్ 2. ఒక గ్రాము సారవంతమైన మట్టిలో ఎన్ని బ్యాక్టీరియాలుంటాయి? 1) 100 మిలియన్లు 2) 1 మిలియన్ 3) 500 మిలియన్లు 4) 1 బిలియన్ పైగా 3. ఒక బ్యాక్టీరియా కణం ప్రతి నిమిషానికి ద్విదావిచ్ఛితి చెందుతూ ఒక కప్పును ఒక గంటలో నింపినట్లయితే మొదటి సగం కప్పు నిండటానికి ఎంత సమయం అవసరం? 1) 15 ని. 2) 30 ని. 3) 59 ని. 4) 61 ని. 4. బ్యాక్టీరియో ఫేజెస్ అంటే? 1) బ్యాక్టీరియాలో నివసించే వైరస్ 2) బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్ 3) బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్ 4) వైరస్ పైన దాడిచేసే బ్యాక్టీరియా -
నానోస్కోప్‌కు నోబెల్
ఇద్దరు అమెరికన్లు, ఒక జర్మన్ శాస్త్రవేత్తకు పురస్కారం మీటరులో వంద కోట్ల వంతు అణువులనూ చూసేలా ఆప్టికల్ మైక్రోస్కోపును అభివృద్ధిపర్చిన శాస్త్రవేత్తలు స్టాక్‌హోం(స్వీడన్): అతిచిన్న అణువులను సైతం కోట్ల రెట్లు పెద్దగా చేసి చూపించే సూక్ష్మదర్శినికి మరింత లోతైన ‘దృష్టి’ని ఇచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్(61), జర్మన్ శాస్త్రవేత్త స్టెఫాన్ హెల్(51)లను బుధవారం రసాయన శాస్త్ర విభాగంలో విజేతలుగా నోబెల్ కమిటీ ప్రకటించింది. ఎరిక్ బెట్జిగ్ వ ర్జీనియాలోని హోవార్డ్ హగ్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో, మోర్నర్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్‌గా హెల్ కొనసాగుతున్నారు. సైన్స్ పరిశోధనల్లో ఎంతో కీలకమైన ఆప్టికల్ మైక్రోస్కోపును నానోస్కోపుగా మార్చేందుకు వీరి ఆవిష్కరణలు దోహదపడ్డాయని నోబెల్ కమిటీ పేర్కొంది. నానోస్థాయిలో ఒక మీటరులో వంద కోట్ల సైజు మాత్రమే ఉన్న ప్రొటీన్ అణువులను సైతం అధ్యయనం చేసేందుకు వీరి పరిశోధనలు మార్గం చూపాయని కమిటీ ప్రశంసించింది. ముగ్గురు విజేతలకు కలిపి మొత్తం 6.78కోట్ల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి, సోమవారం ఆర్థిక విభాగాల్లో నోబెల్ ప్రకటిస్తారు. ఏమిటీ ఆప్టికల్ మైక్రోస్కోపు? వస్తువులపై కాంతిని ప్రసరింపచేసి వాటిని పెద్దగా చూపించే సూక్ష్మదర్శినులను ఆప్టికల్ మైక్రోస్కోపులుగా పిలుస్తారు. కాంతి తరంగాలు వస్తువులపై పడినప్పుడు వాటికి అవరోధం కలుగుతుంది. దీని ఆధారంగానే ఈ సూక్ష్మదర్శినులు ఆ వస్తువులను గుర్తిస్తాయి. అయితే.. కాంతి తరంగదైర్ఘ్యంలో సగం కన్నా తక్కువ సైజులో ఉన్న వస్తువులను అంటే.. 0.2 మైక్రోమీటర్ల సైజు కన్నా తక్కువగా ఉండే అణువులను ఆప్టికల్ మైక్రోస్కోపులతో చూడటం ఎప్పటికీ సాధ్యం కాదని భావించేవారు. 1873లో ఎర్నెస్ట్ ఎబ్ అనే శాస్త్రవేత్త ఈ పరిమితికి సంబంధించి ఓ సిద్ధాంతమూ ప్రతిపాదించారు. దీంతో నాడీకణాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి అతి సూక్ష్మకణాల లోపలి అణువులను, వాటి చర్యలను చూడటం సాధ్యం కాలే దు. వీటికన్నా శక్తిమంతమైన ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినులు వచ్చినా.. సజీవ కణాలను అధ్యయనం చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో.. సజీవ కణాల లోగుట్టును తేల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన ఎరిక్, మోర్నర్, హెల్లు ఆప్టికల్ మైక్రోస్కోపులను మరింత శక్తిమంతంగా మార్చేందుకు ఉపయోగపడే రెండు కొత్త పద్ధతులను ఆవిష్కరించారు. ఇవీ ఆవిష్కరణలు: ఆప్టికల్ మైక్రోస్కోపు సామర్థ్యం పెంచేందుకు హెల్.. 2000 సంవత్సరంలో ‘స్టిమ్యులేటెడ్ ఎమిషన్ డిప్లిషన్(స్టెడ్) మైక్రోస్కోపీ’ పద్ధతిని ఆవిష్కరించారు. ఇందు లో 2 లేజర్ కాంతి పుంజాలను ఉపయోగించా రు. ఒక కాంతిపుంజం అణువులు కాంతిని ప్రతి బింబించేలా ప్రేరేపించగా ఇంకో కాంతి పుంజం నానోమీటరు సైజు కన్నా పెద్ద సైజు అణువులు కాంతిని ప్రతిబింబించకుండా అడ్డుకుంది. దీంతో వీటిని స్కాన్ చేసి, వచ్చిన చిత్రాన్ని అభివృద్ధిపర్చగా.. అత్యంత నాణ్యమైన చిత్రాలు వచ్చాయి. అలాగే.. బెట్జిగ్, మోర్నర్లు వేర్వేరుగానే ‘సింగిల్-మాలిక్యుల్ మైక్రోస్కోపీ’కి 2006లో బీజం వేశారు. ఈ పద్ధతిలో వీరు కాంతిని ప్రతిబింబించే అణువులు తమంతట తామే ఆన్, ఆఫ్ అయ్యేలా చేశారు. ప్రతిసారీ కొన్ని అణువులు మాత్రమే కాంతితో వెలిగేలా చేసి చిత్రాలు తీయడం ద్వారా నానోస్థాయి చిత్రాలను రూపొందించగలిగారు. దీంతో 0.2 మైక్రోమీటర్లు(ఒక మైక్రో మీటరు అంటే మీటరులో పది లక్షల వంతు) మాత్రమే కాదు.. ఏకంగా ఒక నానోమీటరు(మీటరులో 100 కోట్ల వంతు) సైజు ఉన్న అణువులనూ అధ్యయనం చేసేందుకు వీలు ఏర్పడింది. దీంతో ఈ రెండు పద్ధతుల వల్ల నానోస్కోపీ రంగంలో 15 ఏళ్లలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెదడు, శరీర కణాల లోగుట్టును తెలుసుకుని అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇతర అనేక వ్యాధుల చికిత్సలు కనుగొనేందుకు, జీవశాస్త్రంలో మరిం త అవగాహనకు ప్రస్తుతం అవకాశం ఏర్పడింది. నోబెల్ శాంతి బహుమతి రేసులో పోప్, స్నోడెన్ శుక్రవారం ప్రకటించనున్న నోబెల్ శాంతి బహుమతిని పోప్ ఫ్రాన్సిస్, ఎడ్వర్డ్ స్నోడెన్‌లు గెలుచుకునే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అయిన స్నోడెన్ ఆ దేశ రహస్య పత్రాలను లీక్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతనెలలో ప్రకటించిన ప్రత్యామ్నాయ నోబెల్ శాంతి బహుమతి సంయుక్త విజేతల్లో స్నోడెన్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కూడా నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు. -
ఇక స్మార్ట్‌ఫోన్ తో మైక్రోస్కోప్!
లండన్: ప్రయోగాల కోసం ఉపయోగించే సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు)ని ఇక మనం కూడా సొంతంగానే తయారు చేసుకోవచ్చట. మన దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. మార్కెట్లో దొరికే నట్లు, బోల్టులు, లేజర్ లైట్లు, ప్లైవుడ్ వంటి కొన్ని పరికరాలు, వస్తువులను కొని బిగించుకుంటే ఇక సూక్ష్మదర్శిని రెడీ అయినట్లే. ఖరీదైన సూక్ష్మదర్శినులకు ఏమాత్రం తీసిపోకుండా.. ఈ స్మార్ట్‌ఫోన్ సూక్ష్మదర్శిని కూడా వస్తువులను 175 నుంచి 400 రెట్లు పెద్దగా చూపిస్తుందట. అతిచౌకగా సూక్ష్మదర్శిని తయారీ ప్రాజెక్టులో భాగంగా మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఈ సరికొత్త సూక్ష్మదర్శినిని తయారు చేశారు. మామూలు సూక్ష్మదర్శినులు చాలా ఖరీదు కావడంతో ఇప్పటికీ చాలా కాలేజీలు, స్కూళ్లలో సైన్స్ ప్రయోగాలకు అవసరమైన సూక్ష్మదర్శినులు అందుబాటులో ఉండటం లేదని, అందుకే తాము ఈ ‘డూ-ఇట్-యువర్సెల్ఫ్ మైక్రోస్కోప్’ (డీఐవై) తయారీ ప్రాజెక్టును చేపట్టామని వర్సిటీ విద్యార్థులు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రోస్కోపు తయారీకి మొత్తం ఖర్చు దాదాపు రూ.600(10 డాలర్లు) మాత్రమే కావడం విశేషం. -
ఎలా పనిచేస్తుంది?
మైక్రోస్కోప్ మనం కంటితో స్పష్టంగా చూడలేని వాటిని చూసేందుకు భూతద్దాన్ని ఉపయోగిస్తాం. ఇంకా చిన్న వాటిని అంటే... అంటే కంటికి అసలు కనిపించనటువంటి అతి సూక్ష్మమైన పదార్థాలను చూడాలంటే మాత్రం మైక్రోస్కోప్‌లో చూడాల్సిందే! సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్‌ను ఎవరు కనిపెట్టారో, అది ఎలా పని చేస్తుందో చూద్దాం... డచ్‌కి చెందిన జకారియా జాన్సన్ అనే ఓ కళ్లజోళ్ల వ్యాపారి క్రీ.శ. 1590లో మైక్రోస్కోప్‌ని రూపొందించాడు. ఆ తర్వాత అందులో అనేకమైన మార్పులు జరిగాయి.1840 ప్రాంతం నుంచి ఇంచుమించు మనం ఇప్పుడు చూస్తున్న తరహా మైక్రోస్కోప్‌లు మార్కెట్లోకి వచ్చాయి. మెక్రోస్కోప్లో విల్లంబులా వంగి ఉండే బోలుగా ఉండే ఒక గొట్టానికి రెండు వైపులా రెండు కుంభాకార దర్పణాలు అంటే ఉబ్బెత్తుగా ఉండే అద్దాలు అమర్చి ఉంటాయి. లక్ష్యం వైపు అంటే మనం చూడదలచుకున్న వస్తువు వైపు చూసే అద్దానికి (దీనినే ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు) ఒక చిన్న గొట్టం, దానికి ఒక పలుచని అద్దం అమర్చి ఉంటుంది. మనం కన్ను పెట్టి చూసే అద్దానికి (దీన్ని ఐ లెన్స్ లేదా ఐ పీస్ అంటారు) పెద్ద గొట్టం, దానికి పెద్ద అద్దం అమర్చి ఉంటాయి. మనం చూడదలచిన పదార్థాన్ని మైక్రోస్కోప్ ప్లాట్‌ఫామ్ మీద, ఆబ్జెక్టివ్ లెన్స్‌కు సమీపంలో ఉంచుతారు. ఇది ఆ పదార్థాన్ని దాని అసలు పరిమాణం కన్నా కొన్ని వందల రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. దాని మూలంగా మనం ఆ పదార్థంలో ఏమేమి ఉన్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నాయో స్పష్టంగా చూడగలం. ఇవి కాంతిని ఆధారంగా చేసుకుని, వస్తువును పెద్దదిగా చేసి చూపిస్తాయి కాబట్టి వీటిని ఆప్టికల్ మైక్రోస్కోప్స్ అంటారు. అదే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో అయితే... కాంతికి బదులుగా ఎలక్ట్రాన్ కిరణాలు ఉంటాయి. సాధారణంగా వీటిని బయొలాజికల్ లేదా ఇన్ ఆర్గానిక్ పదార్థాలను చూడటానికి ఉపయోగిస్తారు. దీని మూలంగా పదార్థం నిర్మాణాన్ని, అందులో ఉండే లోపాలను పరిశీలించగలం. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, వస్తువు అసలు పరిమాణం కన్నా కొన్ని మిలియన్ల రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. ఇదీ మైక్రోస్కోప్ పని విధానం. -
పేపర్‌తో మైక్రోస్కోప్
న్యూయార్క్: మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను చక్కగా చూడడానికి ఉపయోగించే మైక్రోస్కోప్(సూక్ష్మదర్శిని) గురించి మనందరికీ తెలిసిందే. ప్రయోగశాలల్లో, ఆసుపత్రుల్లో మాత్రమే ఎక్కువగా ఉపయోగించే ఈ మైక్రోస్కోప్‌ల ఖరీదు సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటుంది. అలాంటి మైక్రోస్కోప్‌లను కాగితంతో కారుచౌకగా అభివృద్ధి చేస్తే...సామాన్యుడికి అందుబాటులో...ఏకంగా జేబులో పెట్టుకొని తిరిగే విధంగా రూపొందిస్తే.... అది నిజంగా అద్భుతమే కదా... ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాడు భారత సంతతికి చెందిన అమెరికా పరిశోధకుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మనుప్రకాష్ తన బృందంతో కలసి కాగితంతో మైక్రోస్కోపును అభివృద్ధి చేశాడు. ‘ఫ్లొడ్స్కోప్’గా పిలిచే ఈ మైక్రోస్కోప్ అత్యంత చవకైనది కూడా. మూడు భాగాలుగా ఉండే దీని నిర్మాణంలో ఒక ఎల్.ఈ.డీ. లైట్, లెన్స్ కూడా అమర్చారు. ఈ మైక్రోస్కోపును పూర్తిగా విప్పేసి మన జేబులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కేవలం ఒక్క నిమిషంలో మళ్లీ మైక్రోస్కోపును పూర్తిస్థాయిలో బిగించుకోవచ్చు.