స్మార్ట్‌ఫోన్‌ కెమెరాను  సూక్ష్మదర్శిని చేసే గాడ్జెట్‌ | Smartphone camera microscopic gadget | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ కెమెరాను  సూక్ష్మదర్శిని చేసే గాడ్జెట్‌

Published Wed, Feb 21 2018 12:17 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Smartphone camera microscopic gadget - Sakshi

స్మార్ట్‌ఫోన్‌తో ఇప్పుడు బోలెడన్ని పనులు చేయవచ్చు. తాజాగా ఈ పనుల జాబితాలోకి చేరింది సూక్ష్మదర్శిని. ఆస్ట్రేలియాలోని ఏఆర్‌సీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నానోస్కేల్‌ బయోఫొటానిక్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఓ చిన్న గాడ్జెట్‌ను తగిలించుకుంటే చాలు.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతోనే అతిసూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివాటిని చూసేయవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే ఈ సరికొత్త సూక్ష్మదర్శిని మిల్లీమీటర్‌ కంటే రెండు వందల రెట్లు చిన్నవైనవాటిని చూడగలదు.

వీటితో రక్తకణాలు, కణ కేంద్రకం వంటి సూక్ష్మమైనవాటినీ చూడవచ్చునని అంటున్నారు డాక్టర్‌ అంటోనీ ఓర్త్‌. పరిశోధనశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ దీని ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చునని చెప్పారు. ఈ గాడ్జెట్‌ తయారీ వెనుక ఉన్న టెక్నాలజీని తాము అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని తద్వారా ఎవరైనా దీన్ని తయారు చేసి వాడుకోవచ్చునని ఓర్త్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement