మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్‌ ఇదే | Laptop With World Most Dangerous Viruses On Sale For usd1.2 Million | Sakshi
Sakshi News home page

మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్‌ ఇదే

Published Mon, May 27 2019 5:34 PM | Last Updated on Mon, May 27 2019 6:11 PM

Laptop With World Most Dangerous Viruses On Sale For usd1.2 Million - Sakshi

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్‌లు ఈ  ల్యాప్‌టాప్‌ తిష్టవేశాయి. అందుకే 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది.  అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్‌లు ఇందులో పొంచి వున్నాయి. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్‌టాప్‌ వేలమా? పైగా  అంత భారీ ధర పలకడమా? విచిత్రంగా ఉంది కదూ..  

సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.  అతి ప్రమాదకరమైన ఆరు  వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను  వేలానికి వుంచారు. డిజిటల్‌ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును  భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని  గ్వో  చెప్పారు.  కంప్యూటర్‌లోని భయంకరమైన వైరస్‌లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు. 

విండోస్‌ ఎక్స్‌పీ ఆధారిత శాంసంగ్‌ ఎన్‌సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్‌ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్‌ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా నిర్వాహకులు  జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. 

ఐ లవ్‌యూ, మైడూమ్‌, సోబిగ్‌, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి వున్నాయి.  'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో,  గ్వోఓ ఓ డోంగ్‌ దీన్ని సృష్టించారు.  ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement