
‘కోవిడ్’ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పేరు చెబితేనే జనాలకు వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితి దాపురించింది. వైరస్‌ల నిర్మూలన కోసం శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం కూడా చేశారు. ‘కోవిడ్’ తర్వాత వైరస్‌ల ఆచూకీని కనిపెట్టే సాంకేతికత కూడా అభివృద్ధి చెందింది. తాజాగా వైరస్‌ల జాడ గుర్తించగలిగే ‘విక్లోన్’ అనే ఈ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది.
టైమ్ చూపించడం సహా మిగిలిన పనులన్నీ ఇది ఇతర స్మార్ట్‌వాచీల మాదిరిగానే చేయడమే కాకుండా, చుట్టుపక్కల గాలిలో వైరస్‌లు ఉంటే, వెంటనే అప్రమత్తం చేస్తుంది. గాలిలోని సూక్ష్మకణాలను ఇది లోపలికి పీల్చుకుంటుంది.
ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కణాలు, వైరస్ కణాలు ఉన్నట్లయితే, వాటిని వెంటనే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్’ వైరస్‌ను గుర్తించే ఈ స్మార్ట్‌వాచీని ‘విక్లోన్’ పేరుతో రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment