జుట్టు రాలేందుకు కారణమైన ఓ జన్యువు.. శరీరంలోని కేన్సర్ కణాలను వెతికి వెతికి చంపేయగలదు అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తి స్వయంగా కేన్సర్ కణాలను చంపేసేలా చేసే ఇమ్యునోథెరపీ గురించి మనం వినే ఉంటాం. ఈ పద్ధతి అందరికీ ఒకేలా పనిచేయదు. కేన్సర్ కణాలపై దాడి చేసేందుకు రోగనిరోధక కణాలకు ప్రత్యేకమైన బయో మార్కర్ల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో జుట్టు రాలిపోవడంతో పాటు పలు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు కేన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయన్న ప్రతిపాదనను పరిశీలించేందుకు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
జుట్టు రాలిపోయేందుకు కారణమవుతున్న ఓ జన్యువు చాలా చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ఐకేజెడ్‌ఎఫ్1 అనే ఈ జన్యువు రోగనిరోధక కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. కేన్సర్ కణాల్లోనూ కనిపించిన ఈ జన్యువును ఎలుకల్లో చైతన్యవంతం చేశారు. ఫలితంగా అధిక మొత్తంలో ఉత్పత్తి అయిన టీ–సెల్స్ కణితిపై సమర్థంగా దాడిచేశాయి. అయితే ఈ జన్యువు కొన్ని రకాల కేన్సర్లలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి.. ఆయా కేన్సర్లకు మాత్రమే కొత్త చికిత్స పద్ధతి అనుకూలంగా ఉండవచ్చునని అంచనా.
జుట్టు జన్యువుతో కేన్సర్ కణాలు మటాష్!
Published Thu, Aug 2 2018 1:53 AM | Last Updated on Thu, Aug 2 2018 1:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment