Gene cernan
-
జుట్టు జన్యువుతో కేన్సర్ కణాలు మటాష్!
జుట్టు రాలేందుకు కారణమైన ఓ జన్యువు.. శరీరంలోని కేన్సర్ కణాలను వెతికి వెతికి చంపేయగలదు అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తి స్వయంగా కేన్సర్ కణాలను చంపేసేలా చేసే ఇమ్యునోథెరపీ గురించి మనం వినే ఉంటాం. ఈ పద్ధతి అందరికీ ఒకేలా పనిచేయదు. కేన్సర్ కణాలపై దాడి చేసేందుకు రోగనిరోధక కణాలకు ప్రత్యేకమైన బయో మార్కర్ల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో జుట్టు రాలిపోవడంతో పాటు పలు ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు కేన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయన్న ప్రతిపాదనను పరిశీలించేందుకు కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. జుట్టు రాలిపోయేందుకు కారణమవుతున్న ఓ జన్యువు చాలా చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ఐకేజెడ్ఎఫ్1 అనే ఈ జన్యువు రోగనిరోధక కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. కేన్సర్ కణాల్లోనూ కనిపించిన ఈ జన్యువును ఎలుకల్లో చైతన్యవంతం చేశారు. ఫలితంగా అధిక మొత్తంలో ఉత్పత్తి అయిన టీ–సెల్స్ కణితిపై సమర్థంగా దాడిచేశాయి. అయితే ఈ జన్యువు కొన్ని రకాల కేన్సర్లలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి.. ఆయా కేన్సర్లకు మాత్రమే కొత్త చికిత్స పద్ధతి అనుకూలంగా ఉండవచ్చునని అంచనా. -
చంద్రునిపై చివరిగా నడిచిన వ్యోమగామి మృతి
హూస్టన్: చంద్రునిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి జీన్ సెర్నన్(82) కన్నుమూశారు. çహూస్టన్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం జీన్ మరణించినట్లు ఆయన అధికార ప్రతినిధి మెలిస్సా రెన్ వెల్లడించారు. 1972 డిసెంబర్లో అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్‌కు జీన్ కమాండర్‌గా పనిచేశారు. చంద్రునిపై కాలుమోపిన వారిలో తనది చివరిపేరుగా ఉండకూడదని జీన్ తపించేవారని, ఇంకా ఎంతోమంది వెళ్లాలని కోరుకునేవారని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రమండలంపై ఇప్పటివరకు 12 మంది కాలుమోపారు.