
చంద్రునిపై చివరిగా నడిచిన వ్యోమగామి మృతి
హూస్టన్: చంద్రునిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి జీన్ సెర్నన్(82) కన్నుమూశారు. çహూస్టన్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం జీన్ మరణించినట్లు ఆయన అధికార ప్రతినిధి మెలిస్సా రెన్ వెల్లడించారు. 1972 డిసెంబర్‌లో అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అపోలో 17 మిషన్‌కు జీన్ కమాండర్‌గా పనిచేశారు. చంద్రునిపై కాలుమోపిన వారిలో తనది చివరిపేరుగా ఉండకూడదని జీన్ తపించేవారని, ఇంకా ఎంతోమంది వెళ్లాలని కోరుకునేవారని కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రమండలంపై ఇప్పటివరకు 12 మంది కాలుమోపారు.