Stress hormone cortisol
-
ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ..
High Fibre Food For Weight Loss: ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా లాక్డౌన్ మూలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ తలెత్తిన సమస్య బరువు పెరగడం. బరువు పెరిగారనగానే వీలైనంతగా డైటింగ్ చేసి... పొట్ట మాడ్చుకుని, కొద్దిగా బరువు తగ్గగానే ఆ ఉత్సాహంతో యధావిధిగా తినేయడం.. ఆనక మునపటి కంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం... లైపో సక్షన్ వంటి వాటి వరకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం... ఇవన్నీ అవసరమా..? ఇంతకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గచ్చు. దానిపై అవగాహన కోసమే ఈ వ్యాసం. సాధారణంగా బరువు పెరగడం తగ్గడం అనేది శరీరతత్వాన్ని బట్టి, వంశపారంపర్య కారణాలను బట్టి కూడా ఉంటుంది. బరువు పెరగడానికి గల కారణాలేమిటో తెలుసుకుంటే తగ్గడానికి మార్గం సులువే అవుతంంది. నిత్యం యోగాసనాలు, వర్కవుట్స్ వంటివి చేసే సినీతారలు, ఇతర సెలబ్రిటీలు కూడా బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ అందరికీ అలా వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగపడవచ్చు. చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. తరచు మంచి నీటిని తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతారు. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా బరువు కోల్పోయినట్టు తేలింది. పెరగడానికి ముఖ్య కారణాలు నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక వ్యాధులు వస్తాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు. బరువు తగ్గడానికి ఉపకరించే ఆహారాలు పసుపు: రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఎల్.డి.ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్నుతగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. యాలకులు: తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. మిరప: మిరపలోని క్యాప్సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు. కరివేపాకు: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును కరివేప చకచకా ఊడ్చేస్తుంది. దీనిని కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. వెల్లుల్లి: ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది. క్యాబేజీ: బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూర తింటేనే మేలు. చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే.. పెసరపప్పు: కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు. తేనె: మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు. మజ్జిగ: గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు ఉంటాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు. సజ్జలు: అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది. ఆలివ్ ఆయిల్: వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. చెక్క... మొగ్గ: చెక్క అంటే దాల్చిన చెక్క. మొగ్గ అంటే లవంగ మొగ్గ. ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. పుచ్చకాయ, మరమరాలు వంటివి కూడా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనసు ఇతర పదార్థాల మీదికి మళ్లదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కూడా పాటించండి.. ►ఆహారాన్ని నెమ్మదిగా... నమిలి తినాలి. దీనివల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. ►మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ►పీచు పదార్థాలు ఎక్కువ గా ఉండే ఆహారం వల్ల ఆకలి వేయదు. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. ►ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ►బీన్స్, ఓట్స్ సెరల్స్, మొలకలు, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఇవన్నీ మీ రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు తగ్గడమే కాదు... అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధులనుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు. చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం.. -
Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Most Expensive Spice In The World: సుగంధ ద్రవ్యాలు లేదా మసాలాదినుసుల్లో అత్యంత ఖరీదైనది ఏది? సందేహమెందుకు.. కుంకుమపువ్వు! ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఏమిటి దీని ప్రత్యేకత అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంగతులు మీకోసం.. కుంకుమ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఆరోగ్య రహస్యాలు కుంకుమ పువ్వులో దాగి ఉండటం వల్లనే అంత ధర పలుకుతోంది మరి..! చర్మం, జుట్టుకు మాత్రమేకాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఔషధగుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆరోగ్యం, సుగంధ పరిమళం కోసం అధికంగా వినియోగిస్తారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా అడ్డుకోవడంలో, మెరుగైన కంటిచూపుకు, జ్ఞాపకశక్తి పెంపుకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందుకే అనేక మంది తమ రోజువారీ ఆహారంలో కుంకుమ పువ్వును చేర్చుతారు. జీర్ణ సమస్యల నివారణలో కుంకుమ పువ్వులోని పోషకాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, ప్రేగుల్లో గ్యాస్ చేరకుండా నిరోధిస్తుంది. తద్వారా కడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా విరేచనాల లక్షణాలను తగ్గిస్తుంది. ఆకస్మికంగా సంభవించే కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. గుండె ఆరోగ్యానికి దివ్యౌషధం కుంకుమపువ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, తద్వారా రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని ఔషధ గుణాలు హృదయ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుతాయి. ఆర్టరీస్ (ధమను) ల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుని, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసి, చంపుతాయి. దీనిలోని యాంటీకాన్సర్ కారకాలు చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి ఇతక క్యాన్సర్ల కణాలను కూడా ప్రభావితం చేస్తాయి. చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! పీరియడ్స్ రుగ్మతలను తగ్గిస్తుంది కుంకుమపువ్వు తినడం వల్ల స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే చిరాకు, తలనొప్పి, కడుపు నొప్పి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తకుండా నివారిస్తుంది. కుంకుమపువ్వు వాసన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మూడ్ సమస్యలు కుంకుమపువ్వుకు 'సన్‌షైన్ స్పైస్' అనే పేరు కూడ ఉంది. మానసిక స్థితిని మెరుగుపరిచే లక్షణం కలిగి ఉంటడమే అందుకు ప్రధాన కారణం. చదవండి: Junk Food And Diabetes: డయాబెటిస్ రావడానికి జంక్ ఫుడ్ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా! -
గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!
Permanent Solution To The Problem Of Baldness: అద్దం ముంచు నిలబడి నున్నని బట్టతలను నిమురుకుంటూ.. ఫ్చ్.. దీనికి విరుగుడే లేదా (విగ్గుకాకుండా)? అని ఒక్కసారైనా అనుకోనివారుండరేమో..!అలాంటివారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్! మన శరీరంలో ఒక ప్రొటీన్ స్థాయిలను పెంచడం ద్వారా బట్టతల సమస్యకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిది సాధ్యమే అని చెబుతోంది కూడా. బట్టతలతో ఎన్నో సమస్యలు తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లందరూ కోరుకుంటారు. కానీ నియంత్రణలేకుండా ఊడే జుట్టువారిలో ఇది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. అందులోనూ వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువ. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. ఈ ప్రొటీన్‌తో బట్టతలకు శాశ్వత పరిష్కారం ఐతే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. ఆ హార్మోన్ వల్లనే జుట్టు రాలుతుంది.. ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్‌ను నియంత్రిస్తే హెయిర్ ఫోలిసిల్ స్టెమ్ సెల్ (హెచ్ఎఫ్సీ) యాక్టివేట్ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. మళ్లీ ఈ విధంగా జుట్టు పెరుగుతుంది బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది. వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. -
అమ్మ కాబోతున్నారా!
యోగా గర్భిణి తగినంత శారీరక విశ్రాంతి తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, హెవీ సుగర్ ఉండేవి, శాట్యురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించాలి. ఒత్తిడి కారణంగా ఉద్భవించే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ గర్భంలోని బిడ్డపై ప్రభావం చూపుతుంది. తద్వారా పుట్టిన బిడ్డ ఎక్కువగా ఏడవడం, నిద్రలేమితో బాధపడడం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా గర్భిణి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయితే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడాన్ని కూడా గమనిస్తుంటాం. వాటిని నివారించడానికి ఈ ఆసనాలు దోహదం చేస్తాయి. తొలి దశలో వాకింగ్ రోజుకు 20 నుంచి 30 నిమిషాల వరకూ నిదానంగా మాత్రమే నడవాలి. అయితే లో లైన్ ప్లాసెంటా అనే ప్రత్యేకమైన సమస్య ఉంటే మాత్రం వ్యాయామం చేయకూడదు. అలాంటి వాళ్లు రాజయోగ ప్రాణయామ చేయవచ్చు. తొలి 3 నెలల పాటు కేవలం నిలుచుని చేసేవి. అప్పర్బాడీకి చేసే వ్యాయామాలు మాత్రమే చేయాలి.నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు యోగాసనాలు అవసరం. గర్భం దాల్చక ముందు యోగ సాధన అలవాటు ఉన్నవారు లేదా అప్పుడే ప్రారంభిస్తున్నవారు కూడా చేయవచ్చు. మూడు రకాలు... నవమాసాలు పూర్తయ్యేవరకూ యోగా చేయవచ్చు. అయితే దీనిని 3 రకాలుగా విభజించుకోవాలి. గర్భం దాల్చిన తొలి త్రైమాసికంలో (3నెలల్లో) మామూలు ఆసనాలు సాధన చేయవచ్చు. రెండవ త్రైమాసికంలో కాస్త తేలికపాటి ఆసనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక చివరిదైన... మూడవ త్రైమాసికంలో బాగా సులభంగా ఉండేవి మాత్రమే చేయాలి. అయితే ఆసనాలు వేసేటప్పుడు ఏదైనా ఆధారాన్ని వినియోగించుకోవాలి. గోడ లేదా కుర్చీ, లేదా దిండ్లును గాని సపోర్ట్‌గా ఉపయోగించుకోవాలి. కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... బోర్లా పడుకుని చేసే ఆసనాలు మాత్రం నిషిద్ధం. ఏవేవి చేయాలంటే... నిలబడి చేసే ఆసనాల్లో తాడాసన, వృక్షాసన, కటి చక్రాసన, ఉత్కటాసన, అర్ధ చంద్రాసన, సాధారణ త్రికోణాసన, వీరభధ్రాసన వేరియంట్ 1, వేరియంట్2 లు చేయవచ్చు. కూర్చుని చేసే వాటిలో స్వస్తికాసన, కటి చక్రాసన, వక్రాసన, బద్దకోణాసన (బటర్ ఫ్లై), భరద్వాజాసన, పక్కవైపునకు వంగి చేసి వికృష్ట జానుశిరాసన చేయాలి. అరచేతులు, మోకాలి మీద నిలబడి చేసే ఆసనాల్లో (నీల్ డౌన్ పోశ్చర్స్) మార్జాలాసన, వ్యాఘ్రవాలచాలన, బాలాసన, అర్ధ అథోముఖ శ్వానాసన, ప్రసారిత మార్జాలాసన వంటివి సూచించదగ్గవి. వెల్లకిలా పడుకుని చేసే ఆసనాల్లో సేతుబంధాసన, మోచేతులు నేలపై ఆధారంగా ఉంచి మోకాళ్లు వంచి 40డిగ్రీల యాంగిల్లో చేసే విచిత్ర కర్ణి, 90 డిగ్రీల యాంగిల్లో చేసే విపరీత కర్ణి, సర్వాంగాసన వంటివి చేయాలి. ∙కాళ్లు కంఫర్టబుల్‌గా, సుఖవంతంగా ఎడంగా ఉంచి, మోకాలిని మడిచి, కటి ప్రదేశం, పొత్తికడుపు భాగాలు ఓపెన్ అయ్యేట్టుగా రిలాక్స్ చేస్తూ సాధన చేయడం చాలా ముఖ్యం. ఎటువంటి అలసటనూ దరి చేరనీయకుండా చేయాలి. యోగసాధన... కండరాలని, టిష్యూలను లిగమెంట్స్, జాయింట్స్‌ని రిలాక్స్ చేయడానికి ఉపయోగపడాలి. ముఖ్యంగా ఆసనాల సాధన... పొట్ట భాగంపై ఏ మాత్రం ఒత్తిడి లేకుండా అక్కడి కండరాలు రిలాక్స్ అవుతూ సున్నితంగా మసాజ్ అయ్యేలా ఉండాలి. ఫలితాలు ఘనం... గర్భిణులు యోగ సాధన చేయడం వల్ల అనూహ్యమైన లాభాలు అందుతాయి. ముఖ్యంగా నార్మల్ డెలివరీకి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఇప్పటికే ప్రయోగాత్మకంగా రుజువైంది.పాశ్చాత్యదేశాల్లో దీనిని బాగా అనుసరిస్తున్నారు. ప్రసవానికి ముందు చేసే ప్రీ నాటల్ యోగా, ప్రసవానంతరం చేసే పోస్ట్ నాటల్ యోగాలను పాశ్చాత్యులు అత్యధికంగా సాధన చేస్తున్నారు. - సమన్వయం: సత్యబాబు