
ఇంటిప్స్
వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉడికేటప్పుడే వేస్తే వాటి సువాసన ఆవిరై పోతుంది.
వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉడికేటప్పుడే వేస్తే వాటి సువాసన ఆవిరై పోతుంది. కాబట్టి దించిన తర్వాత పైన చల్లి సర్వ్ చేయాలి.కొత్తిమీర, పుదీన వంటి వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే తాజాగా దొరకనప్పుడు వాడుకోవచ్చు. ఈ పొడులను వాడేటప్పుడు తరిగిన తాజా ఆకు ఒక టేబుల్ స్పూన్ వాడే చోట మూడవ వంతు పొడిని వాడితే సరిపోతుంది.
బంగాళాదుంపలను వీలయినంత వరకు తొక్క తీయకుండానే ఉడికించాలి. ముక్కలుగా తరిగి లేదా తొక్క తీసి ఉడికించడం ద్వారా పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ఆపిల్‌ను మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే రుచి తగ్గుతుంది. కాబట్టి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి.