కూరల్లో ఒక్కోసారి మసాలాలు ఎక్కువై టేస్ట్ మారిపోద్ది. పైగా బాగా ఘాటుగా ఉంటుంది. ఎంతలా అంటే గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. బాబోయ్ తినలేం అని పడేద్దామంటే మనసొప్పదు. అంత ఖరీదైన మసాలా దినుసులు వేసి పడేయ్యడం అంటే బాధ అనిపిస్తుంది ఎవ్వరికైనా. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే కూరపడేయాల్సిన బాధ తప్పుతుంది. పైగా రుచికి రచి ఉంటుంది. అవేంటో చూద్దామా!.
- కూరల్లో గరం మసాలా పొడులు మోతాదు మించితే కూర రుచి మారిపోతుంది, చేదు వస్తుంది. అలా చేదు వచ్చినప్పుడు కూరల్లో అర కప్పు చిక్కటి పాలు లేదా టేబుల్ స్పూన్ మీగడ కలపాలి. పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడని వాళ్లు జీడిపప్పు పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే చేదు తగ్గడంతోపాటు కూర రుచి ఇనుమడిస్తుంది కూడా.
- మార్కెట్‌లో కొన్న మసాలా పొడుల్లో ప్యాకెట్ సీలు విప్పినప్పుడు ఉన్నంత సువాసన ఆ తర్వాత ఉండదు. కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్‌లు కొనుక్కుని తెరిచిన వెంటనే మొత్తం వాడేయడం ఒక పద్ధతి. పెద్ద ప్యాకెట్ కొన్నప్పుడు కొద్దిగా వాడిన తర్వాత ప్యాకెట్‌లోకి గాలి దూరకుండా క్లిప్ పెట్టాలి.
- గరం మసాలా పొడులను ఇంట్లోనే ఎక్కువ మోతాదులో చేసి నిల్వ ఉంచుకోవాలంటే... పొడిని తేమలేని సీసాలో పోసి గాలి చొరకుండా మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేసిన పొడి ఏడాదంతా నిల్వ ఉంచినా తాజాదనం తగ్గదు.
(చదవండి: వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!)
Comments
Please login to add a commentAdd a comment