వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు! | Loose Maggi Sold Like Vegetables On A Street Cart | Sakshi
Sakshi News home page

వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!

Published Thu, Mar 14 2024 6:20 PM | Last Updated on Thu, Mar 14 2024 6:28 PM

Loose Maggi Sold Like Vegetables On A Street Cart - Sakshi

మ్యాగీ న్యూడిల్స్‌తో రకరకాల రెసిపీలు చేసిన వైరల్‌ వీడియోలు చూశాం. ఇప్పుడు ఏకంగా మ్యాగీని తోపుడు బండిమీద వేసి కూరగాయాలు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఒక వ్యక్తి తోపుడు బండిపై పెద్ద ఎత్తున ఒపెన్‌గా మ్యాగీ న్యూడిల్స్‌ని వేసుకుని లూజ్‌కి అమ్మేస్తున్నాడు. పైగా ఆ క్వాండిటీకి సరిపడా మషాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాడు. ఏదో కూరగాయాలు, పండ్లు మాదిరి తూచి అమ్మేస్తుండటం అందర్నీ షాక్‌కి గురి చేసింది.

అయితే చాలామంది అతడి వద్దకొచ్చి కావల్సినంత కొనుక్కుని పట్టుకుపోతుండటం విశేషం. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు.  మ్యాగీ ప్యాకెట్లలో ఉంటే ఎలాంటీ అనారోగ్య సమస్యలు రావు, కానీ ఇలా ఘోరంగా బండిపై ఓపెన్‌గా అమ్మితే ప్రజల ఆరోగ్యం ఏం కావాలంటూ ఫైర్‌ అవ్వుతూ పోస్టులు పెట్టారు. ఈ వీడియోకి మిలియన్సల్లో వ్యూస్‌, లక్షల్లో లైక్‌లు వచ్చాయి. 

(చదవండి: వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!..ఏకంగా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement