వెంకటేష్‌గారితో పనిచేయడం గొప్ప అనుభూతి - రామ్
‘‘ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి విజయాల తర్వాత మళ్లీ విజయభాస్కర్‌తో ‘మసాలా’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఆనందంగా ఉంది. తమన్ పాటలు, నేపథ్యం సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని వెంకటేష్ అన్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘మసాలా’. డి.సురేష్‌బాబు సమర్పణలో... ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
రామ్ మాట్లాడుతూ -‘‘హీరోలుగా వెంకటేష్‌గారూ నేనూ పోటీపడి నటించామని అందరూ అంటున్నారు. దానికంటే ముఖ్యంగా సురేష్‌గారు, పెదనాన్న రవికిషోర్‌గారు పోటీపడి ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. అందరూ ఇష్టపడి పనిచేసిన సినిమా ఇది. పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.