Vijaya Bhaskar
-
ఉషా పరిణయం చిత్రాన్ని ఆదరించాలి: సాయి దుర్గ తేజ్
‘‘విజయభాస్కర్గారి దర్శకత్వంలో నేను ‘ప్రేమకావాలి’ సినిమా చేయాల్సింది... మిస్ అయ్యింది. ఆది సాయికుమార్ ‘రేయ్’ చేయాలి... కానీ ‘ప్రేమ కావాలి’ చేశాడు. నేను ‘రేయ్’ చేశాను. విజయభాస్కర్‌గారు కొత్తవాళ్లతో చేసిన ‘ఉషా పరిణయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇలాంటి కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు హీరో సాయి దుర్గ తేజ.. శ్రీ కమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన చిత్రం ‘ఉషా పరిణయం’. కె. విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఎంతో ఆప్తుడైన సతీష్ అన్న కూతురు తాన్వీ ఆకాంక్షకి అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఈ మూవీ విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. విజయభాస్కర్ మాట్లాడుతూ– ‘‘14 ఏళ్ల క్రితం సాయి దుర్గ తేజ్‌ని నేనే హీరోగా పరిచయం చేయాల్సింది.. కానీ కుదరలేదు. మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ‘ఉషా పరిణయం’ నిర్మించాను’’ అన్నారు. శ్రీ కమల్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి (కె. విజయభాస్కర్) పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. -
నా విలువలను వదులుకోను : కె. విజయభాస్కర్
‘‘సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందనే మాటని ఒప్పుకోను. ఎన్ని ఓటీటీలు వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గదు. అన్నీ సమ΄ాళ్లలో జోడించి ఎంటర్టైన్ చేయగలిగితే తప్పకుండా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. అలా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసే చిత్రమే మా ‘ఉషా పరిణయం’’ అని డైరెక్టర్ కె. విజయభాస్కర్ అన్నారు.‘నువ్వే కావాలి, నవ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కె.విజయ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉషా పరిణయం’. ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా, తన్వీ ఆకాంక్ష హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. విజయ భాస్కర్ చెప్పిన విశేషాలు. ⇒ ఎవరి కోసం కథ రాస్తామో వాళ్లను దృష్టిలో పెట్టుకుని కామెడీ రాస్తాం. ‘మన్మథుడు’ చిరంజీవిగారికి మ్యాచ్ కాదు. ‘జై చిరంజీవ’ వెంకటేశ్‌కి సరిపోదు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో వెంకటేశ్‌ని తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ‘ఉషా పరిణయం’ కథని మా అబ్బాయి శ్రీ కమల్ కోసం రాయలేదు. ఈ స్క్రిప్ట్‌ని ముగ్గురు హీరోలకు చె΄్పాను.. కానీ కుదరలేదు. ‘జిలేబి’ మూవీ తర్వాత నాకు సరిపోయే కథతో సినిమా చేయమని కమల్ అడిగాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కి ‘ఉషా పరిణయం’ కథ సరిపోతుందనిపించి ముందుకెళ్లాం. శ్రీ కమల్, తన్వీ జోడీ అద్భుతంగా కుదిరింది. వారి నటన కూడా చాలా బాగుంటుంది. ⇒ ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ‘ఉషా పరిణయం’. ప్రేమ ఎప్పుడూ హింసని కోరుకోదనేపాయింట్ని సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చె΄్పాను. ⇒మా సినిమా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ, మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్లే సినిమాని కూడా కుటుంబమంతా కలిసి చూసేట్లు తీయాలి. నా దృష్టిలో దర్శకుడికి విలువలు ముఖ్యం. నేను సినిమా అయినా వదులుకుంటాను కానీ, నా విలువలను వదులుకోను. నా చిత్రాలను నా తల్లి, భార్య, పిల్లలతో కలిసి చూడాలనుకుంటాను. -
మళ్లీ లాక్డౌన్ ఉండదు.. అయితే..
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు అధికం అవుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ అన్నారు. గత ఏడాది వంటి భీతావహ పరిస్థితులు, సెకెండ్ వేవ్ లేనందున మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరగడం, లాక్డౌన్ విధింపు ఖాయమని జరుగుతున్న ప్రచారంపై శుక్రవారం ఆయన మీడియా ముందు స్పందించారు. కరోనా ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విద్యాసంస్థలను మూసివేసింది. జన సంచారాన్ని కూడా అదుపుచేయడం అవసరం. కరోనాకు సరైన మందులేకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ అనివార్యమైంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినందున లాక్డౌన్ అవసరం లేదు. అయితే ప్రజలు మాస్క్ ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధాకరం. ఎన్నికల ప్రచారంలో మాస్క్‌పై కూడా హెచ్చరిస్తున్నాను. కరో నా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. 5వేల వ్యాక్సిన్ కేంద్రాలు సిద్ధం.. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసామని తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా ప్రజల సహ కారం మరింత అవసరం. మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల వేగంగా ఉంది. తమిళనాడులో అంతటి వేగం లేకున్నా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు వహించడం తప్పనిసరి. మాస్క్ ధరించకుండా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లడం వల్లనే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నా అదృష్టవశాత్తు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలి దశలో 60 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ పరిమితం చేసినా ఆ ఆంక్షలు సడలించి బీపీ, షుగర్ అనారోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఎలాంటి రుగ్మతలు లేకున్నా 45 ఏళ్లు దాటితే చాలు ఈనెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించు కోవడంతోపాటు వ్యాక్సిన్ వేసుకుంటేనే వైరస్‌ను అదుపుచేయగలం. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రయివేటు ఆస్పత్రులు, మండల కార్యాలయాల్లో మొత్తం 5వేల వ్యాక్సిన్ కేంద్రాలను సిద్ధం చేసాం. కరోనా ఆంక్షలు పాటించని 61,246 మంది నుంచి మార్చి 16వ తేదీ మొదలు శుక్రవారం వరకు 1.31 కోట్ల జరిమానా వసూలు చేశాం. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ప్రజలు మాస్కులు ధరించక పోవడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల అయోమయం.. కరోనా వైరస్ మళ్లీ ప్రబలడం విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలో పడేసింది. 2021–22 విద్యా సంవత్సరంలో బడులు, కాలేజీలు యథాప్రకారం పనిచేస్తాయా లేదా అనేది స్పష్టం కాలేదు. తెరిచిన విద్యాసంస్థలను ఇటీవల మూసివేసారు. మరి ఈ తరుణంలో ఫీజలు కట్టడమా, మానడమా అనే సందేహంతో సతమతం అవుతున్నారు. గత ఏడాది పరిస్థితి పునరావృతమైతే ఫీజుల రూపంలో వేలాది రూపాయలను నష్టపోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారు. -
సీఐ విజయభాస్కర్ వీరంగం
అనంతపురం : అనంతపురం వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్ గౌడ్ వీరంగం సృష్టించారు. ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన పర్మిట్ రూంలో మద్యం తాగుతున్న వారిపై సీఐ జులూం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండానే విచక్షణా రహితంగా దాడి చేశారు. అడిగినంత లంచం ఇవ్వనందునే సీఐ విజయభాస్కర్ దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రతి నెలా ఒక్కో మద్యం షాపు నుంచి రూ.15 వేల ముడుపులు పోలీసులు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. టీడీపీ నేతల ఒత్తిడితో సీఐ విజయభాస్కర్ పనిచేస్తున్నారని మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ దురుసు ప్రవర్తనపై ఎక్సైజ్ అధికారులు కూడా మండిపడుతున్నారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని వైన్ షాపు నెంబర్-5లో సీఐ విజయ భాస్కర్ ఓ వ్యక్తిని కాలితో తన్నటం వీడియోలో రికార్డవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
సీఐ విజయభాస్కర్ వీరంగం
-
ఆయన చెప్పిందే వేదం...
రేణిగుంట: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్... రేణిగుంట చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్లే ప్రతి లారీ డ్రైవర్‌కు ఈ పేరు సుపరిచితమే... చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ముడుపులు సమర్పించుకోవాల్సిందే... దారి మళ్లించి వెళ్లిన వాహనాలను వెంబడించి మరీ అక్రమ వసూళ్లు చేపట్టే ఘనుడు ఈయన... రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఆయన చెప్పిందే వేదం... ఆయన మాటకు ఎదురుచెప్పిన తోటి సిబ్బందినే ఇబ్బందులకు గురిచేసిన నైజం ఆయన సొంతం. గత నాలుగేళ్లుగా ఆయన రేణిగుంట చెక్‌పోస్ట్‌లో చేపట్టిన అక్రమ వసూళ్లు అక్షరాలా రూ.100 కోట్లంటే సగటు ప్రభుత్వ ఉద్యోగి కళ్లు తేలెయ్యాల్సిందే.. అన్నీ రోజులు ఒకలా ఉండవన్న సత్యం ఆయనను పలకరించింది. శనివారం ఏకకాలంలో ఆయన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.100కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బంది వెన్నులోనూ వణుకు మొదలైంది. రోజుకు అక్రమ వసూళ్లు రూ.3లక్షలు పైమాటే రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్ మీదుగా ప్రతి నిత్యం వేలాది వాహనాలు కడప, చెన్నై, నెల్లూరు,చిత్తూరు మార్గల నుంచి రాకపోకలు సాగిస్తుంటా యి. ప్రధానంగా వివిధ లోడ్లతో వెళ్లే లారీలే ఇక్కడ పనిచేసే వారి అక్రమార్జనకు ప్రధాన వనరు. సీటులో ఏ అధికారి ఉన్నా లారీ డ్రైవర్లు వాహనాలను ఆపి బిల్లుల మాటున ముడుపులు సమర్పించి వెళ్లాల్సిందే. ప్రతి వాహనదారుడు రూ.500 నుంచి రూ.10వేల వరకు సమర్పించి వెళుతుంటారు. ఇక్కడ జరిపే అక్రమ వసూళ్లు రోజుకు రూ.3లక్షలు పైనే ఉంటుందని తెలుస్తోంది. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే రూ.14,950 లెక్కలో లేని నగదును గుర్తించిన ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. రోజువారీ వసూళ్లు కాకుండా గూడూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వందలాది లారీలలో వెళ్లే సిలికా ఇసుక వ్యాపారుల నుంచి నెలసరి మామూళ్లు రూ.లక్షల్లో వసూలు చేస్తారు. అలాగే ఈ మార్గం గుండా కబేళాలకు తరలించే మూగజీవాల అక్రమ తరలింపుదారుల నుంచి భారీస్థాయి మామూళ్లు వసూలవుతున్నాయి. ఇదంతా రేణిగుంట చెక్‌పోస్ట్ కేంద్రంగా బహిరంగంగానే ప్రతినిత్యం జరిగే తంతు. అక్రమ వసూళ్ల కోసం ఇక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టకుని వారికి రోజుకు రూ.2వేలు ఇస్తుండటం బహిరంగ రహస్యమే. ఆయనంటే హడల్ ఎంవీఐ విజయభాస్కర్ అంటే వాహనదా రులే కాదు... తోటి సిబ్బందే హడలిపోవాల్సిందే. ఆయన గతంలో కడపలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన 2014 జూన్‌లో ఎంవీఐగా ఉద్యోగోన్నతిపై రేణిగుంట చెక్‌పోస్ట్‌కు వచ్చారు. ఆర్టీఏ ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలకు తోడు రాజకీ య అండదండలు ఆయనకు బలంగా ఉన్నట్లు తోటి సిబ్బంది వద్ద తొలినాళ్లలో హంగామా సృష్టించి తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎవరు అడ్డు చెప్పినా ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తాడు. కార్యాలయ సీనియర్ ఎంవీఐ మరొకరు ఉన్నా తా నే ఇన్చార్జి అని చెప్పుకుంటూ అన్ని వసూళ్లు ఆ యన కన్నుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. వ్యవహార శైలి, అక్రమార్జనపై గతంలో అనేకమా ర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు రేణిగుంట చెక్‌పోస్ట్‌పై గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఓసారి ఏసీబీ దాడులు చేసి అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా గుండెపోటు సాకు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా అప్పట్లో ఓ కిందిస్థాయి ఉద్యోగి బలైనట్లు సమాచారం. ఇక్కడ దాడులు చేసిన ప్రతిసారి పెద్దమొత్తంలో నగదును స్వాదీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పరంపర మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యం లో ఆయన లెక్కకు మించి అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు స్పష్టం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల చిట్టాను బహిర్గతం చేశారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. -
అనంతలో తమ్ముళ్ల ఆరాచకం
-
హరిప్రియపై జేసీ వర్గీయుల హత్యాయత్నం
-
హరిప్రియపై జేసీ వర్గీయుల హత్యాయత్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. అప్పేచెర్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. జేసీ వర్గీయులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు. రెండేళ్ల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత విజయభాస్కర్ సోదరే హరిప్రియ. విజయభాస్కర్ హత్య కేసులో రాజీకి రావాలని గత రెండేళ్లుగా టీడీపీ వర్గీయులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని హరిప్రియ చెప్పారు. కొద్దిరోజుల కిందట కోర్టులో హత్య కేసు విచారణకు రావడంతో అప్పేచెర్లలో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని హరిప్రియ తెలిపారు. జేసీ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని... వైఎస్సార్ సీపీ నేత విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో రాజీ కావాలని చాలారోజులుగా ఒత్తిడి తెస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసిన హరిప్రియ లేఖ ఇది.. -
మళ్లీ విచారణకు విజయ్‌భాస్కర్?
► ఐటీ ఎదుట సతీమణి రమ్య హాజరు ► ఇతరులకు మళ్లీ సమన్లు ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తదితరులకు ఆదాయ పన్నుశాఖ అధికారులు మరోసారి సమన్లు పంపే సూచనలు కనపడుతున్నాయి. సతీమణి రమ్యకు సైతం సమన్లు జారీచేయడం, గురువారం ఆమె విచారణకు హాజరుకావడం మంత్రిని మరింత ఆందోళనకు గురిచేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీగా మారిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని భర్తీ చేసేందుకు మేలో నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటుకు నోటుతో ధన ప్రవాహం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అందిన ఫిర్యాదుల మేరకు గత నెల 7వ తేదీన మంత్రి విజయభాస్కర్, ఆయన స్నేహితులు, అనుచరుల ఇళ్లు, కార్యాలయాలు సహా 32 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.89 కోట్ల మేరకు ఎన్నికలకు ఖర్చు చేసినట్లు విలువైన ఆధారాలు లభించడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదాపడింది. అంతేగాక మంత్రి ఇంటి నుండి రూ.50 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ అధికారులు సమన్లు జారీచేసి తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. ఆ తరువాత అనేకసార్లు మంత్రి విచారణకు హాజరుకాగా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని సీఎం ఎడపాడిపై కొందరు వత్తిడిపెంచారు. అయితే ఆనాడు మంత్రికి టీటీవీ దినకరన్ అండగా నిలిచి మంత్రి పదవి కోల్పోకుండా కాపాడారు. అయితే ప్రస్తుతం దినకరన్ జైల్లో ఉండగా మంత్రికి ఆదరణ కరువై కష్టాల్లో పడిపోయారు. దీనికి తోడు గత రెండువారాలుగా స్థబ్దత పాటించిన ఐటీ అధికారులు అకస్మాత్తుగా మంత్రి సతీమణి రమ్యకు ఈనెల 2వ తేదీన సమన్లు జారీచేసి 3వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె బుధవారం కాకుండా గురువారం హాజరైనారు. చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు ఆమె చేరుకున్నారు. ఐటీ అధికారులు తమ విచారణలో సుమారు 50 ప్రశ్నలను సంధించి రమ్యను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు లె లిసింది. గత నెల 7వ తేదీన ఐటీ తనిఖీలకు గురైన ఎంజీఆర్ సంగీతవర్సిటీ వైస్ చాన్సలర్ గీతాలక్ష్మి, నటుడు శరత్‌కుమార్, మాజీ ఎంపీ చిటలంపాక్కం రాజేంద్రన్‌లను సైతం గతంలో అనేకసార్లు విచారించారు. శరత్‌కుమార్ సతీమణి, నటి రాధికకు చెందిన రాడాన్ టీవీ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు చేసింది. ఇద్దరినీ తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ అరెస్ట్ కాలేదు. మంత్రి సతీమణి రమ్యకు సమన్లు జారీచేయడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక అక్రమాల కేసును ఐటీ అధికారులు మరోసారి ముందుకు తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ఐటీ దాడులతో ముడివడి ఉన్న మంత్రితోపాటూ ఇతరులకు మరోసారి సమన్లు జారీచేసి విచారించనున్నట్లు తెలుస్తోంది. -
అరెస్ట్ చేస్తారా?
♦ మంత్రుల్లో ఆందోళన ♦ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ♦ విజయభాస్కర్ వైపు సీబీఐ చూపు ♦ 122 మంది ఎమ్మెల్యేలపై గురి సాక్షి,చెన్నై: అధికారులకు బెదిరింపులు, ఐటీ ఉచ్చు వెరసి మంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంత్రులు అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్న సమాచారం ఉత్కంఠను రేపుతోంది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ ప్రయత్నాలకు ముగ్గురు మంత్రులు సిద్ధమయ్యారు. ఇక, ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన ఐటీ దాడులు మంత్రులకు సంకట పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ పలుమార్లు ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఆయన్ను పదే పదే ఆదాయ పన్ను శాఖ వర్గాలు విచారిస్తూ రాగా, ఇక ఆయనపై సీబీఐ కూడా దృష్టి సారించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీబీఐ విచారణకు ప్రతి పక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అందుకు తగ్గ పరిశీలనలు సాగుతున్నట్టుంది. విజయ భాస్కర్‌ను సీబీఐ కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో ఎక్కడ ఆయన అరెస్టు అవుతారోనన్న చర్చ బయలు దేరింది. అలాగే, ఐటీ అధికారుల్ని బెదిరించి ఇరుకున పడ్డ మరో ముగ్గురు మంత్రుల్ని పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న ఉత్కంఠ సాగుతోంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ మంత్రులు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఐటీ అధికారుల్ని బెదిరించిన వ్యవహారంలో మంత్రులు ఉడుమలై కే రాధాకృష్ణన్, కామరాజ్, కడంబూరు రాజాలపై అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసుల్ని నమోదు చేశారు. వీరిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణానంతరం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకోవడంతో ఆ ముగ్గురు మంత్రులు ముందస్తు జాగ్రత్తల్లో పడ్డారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో దాఖలు చేయడానికి తగ్గ సూచనల్ని తమ న్యాయవాదులకు జారీ చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులో దాఖలు చేయడానికి న్యాయవాదులు సిద్ధం అవుతున్నారు. 122 మంది ఎమ్మెల్యేల్ని విచారించేనా: కువత్తూరు వేదికగా 122 మంది ఎమ్మెల్యేలను బల పరీక్ష సమయంలో బంధించి ఉన్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ వద్ద సాగిన ఐటీ విచారణలో కువత్తూరులోని ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా ఐటీ వర్గాలుకు చిక్కినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేల్ని విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. అంత మంది ఎమ్మెల్యేల్ని విచారణకు పిలిపించడం కన్నా, సమగ్ర సమాచారంతో అడుగులు వేయడానికి తగ్గ కార్యచరణతో ఐటీ వర్గాలు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
మళ్లీ సమన్లు
► బెదిరించిన ముగ్గురు మంత్రులపై కేసు నమోదు ►అన్నాడీఎంకే (అమ్మ)లో విబేధాలు ► సీఎం ఎడపాడి వర్సెస్ దినకరన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని రాష్ట్ర రాజకీయాలు మరోసారి అల్లకల్లోలంగా మారిపోయాయి. రాష్ట్ర మంత్రులను ఐటీ వెంటాడుతూనే ఉంది. వైద్య మంత్రి విజయభాస్కర్‌కు శుక్రవారం మరోసారి ఐటీ సమన్లు జారీకాగా, ఐటీ అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరణైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్ తరఫున విచ్చలవిడిగా ధన ప్రవాహానికి పాల్పడ్డారనే సమాచారంతో వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.5.5 కోట్ల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.అలాగే విజయభాస్కర్ నగదు పంపిణీలో భాగస్వాములుగా భావిస్తూ మాజీ ఎంపీ రాజేంద్రన్, సమక పార్టీ అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లు,తదితర 35 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించి ఆర్కేనగర్ ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు తేల్చారు. దాడులు పూర్తికాగానే మంత్రిని ఐటీ కార్యాలయానికి పిలిపించుకుని 5గంటలపాటు విచారించగా, ఈనెల 17వ తేదీన మరోసారి హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ శుక్రవారం సమన్లు పంపింది. మంత్రిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రికి సన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్షి సైతం 17వ తేదీన ఐటీ ముందు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులు కామరాజ్, రా«ధాకృష్ణన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రచ్చకెక్కిన ఇంటిపోరు: ఇన్నాళ్లూ చాపకింది నీరులా ఉన్న అన్నాడీఎంకే (అమ్మ)లోని ఇంటిపోరు రచ్చకెక్కింది. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)చే విచారణను ఎదుర్కొంటున్న వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుండి తప్పించాలనే అంశంలో సీఎం ఎడపాడి, దినకరన్‌ల మధ్య విభేధాలు భగ్గుమాన్నాయి. జయలలిత మరణానికి శశికళ, అమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తున్న తరుణంలో వారిని దూరం పెట్టాలని ఎడపాడి భావించారు. అయితే ఎడపాడి మాటను కాదని ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ పోటీ సిద్దం కావడంతో విభేధాలు పొడచూపాయి. మంత్రులు సైతం రెండు బృందాలుగా మారి ఎడపాడి, దినకరన్ పక్షాన నిలిచాయి. ఐటీ దాడులకు గురై విచారణను ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 17వ తేదీన ఐటీ కార్యాలయానికి హజరుకావాలని సమన్లలో ఆదేశించి ఉన్నారు. మంత్రిని పదే పదే విచారిస్తుండగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందరూ అంచనావేస్తున్నారు. అయితే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వానికి మచ్చగా మారిన ఉదంతం నుండి బైటపడేందుకు విజయభాస్కర్‌కు ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయించుకోగా సీనియర్ మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, వేలుమణి, తంగమణి సైతం ఎడపాడికి మద్దతు పలికారు. అయితే దినకరన్ గట్టిగా అడ్డుకున్నారు. సీనియర్ మంత్రులే దినకరన్‌పై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం పార్టీ, ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని కోరుతూ సదరు సీనియర్ మంత్రులు గురువారం రాత్రి దినకరన్‌ను కలుసుకున్నారు. కాగా, లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి తదితరులు శుక్రవారం దినకరన్‌తో సమావేశమైనారు. అయితే మంత్రి విజయభాస్కర్‌ను క్యాబినెట్ నుండి తప్పించే ప్రసక్తే లేదని దినకరన్ స్పష్టం చేయగా, విజయభాస్కర్‌పై తగిన చర్య తీసుకుంటామని గవర్నర్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. అంతేగాక ప్రభుత్వంలో మార్పులకు దినకరన్ ఇంటిలో మంతనాలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. -
మంత్రులపై ఐటీ పంజా
► బెదిరించారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ► ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్,రాధిక దంపతులు ► మంత్రి విజయభాస్కర్‌కు పదవీగండం? ఐటీ సాలెగూడులో చిక్కుకున్న మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురు మంత్రులు బైటకు వచ్చేదారిని వెతుకుతుండగా మరో ఇద్దరు మంత్రులపై ఐటీ పంజా విసిరింది. ఐటీ దాడుల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరంలపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు. మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై, మాజీ ఎంపీ రాజేంద్రన్, వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లపై దాడులు నిర్వహించి రూ.89 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. దాడులు జరుగుతున్న సమయంలో బందోబస్తులో ఉన్న సాయుధ పోలీసులు అడ్డుకుంటున్నా మంత్రులు కామరాజర్, ఉడుమలై రాధాకృష్ణన్, తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి దళవాయి సుందరం దౌర్జన్యంగా విజయభాస్కర్ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేగాక తనిఖీలు చేస్తున్న ఒక మహిళా అధికారిణిని వారు బెదిరించి విధులను అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ ముగ్గురిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు పోలీస్ కమిషనర్‌కు బుధవారం ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. ఐటీ కార్యాలయంలో శరత్‌కుమార్, రాధిక: సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, రాడాన్ సంస్థ అధినేత్రి నటి రాధిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్కుసన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్ష్మి బుధవారం చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చి అధికారుల ముందు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్‌ను ఈ నెల 6వ తేదీన శరత్‌కుమార్ కలిసి మద్దతు ప్రకటించగా, ఆ మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఓటర్లకు పంపిణీ చేయాల్సిన నగదులో రూ.10 లక్షలు శరత్‌కుమార్ ఇంట్లో దొరికినట్లు తెలిసింది. ఆయన సతీమణి రాధికకు చెందిన కార్యాలయంలో సైతం కొన్ని ఆధారాలు దొరకవచ్చని రాడాన్ కార్యాలయంలో దాడులు జరిపారు. ఈనెల 11వ తేదీన శరత్‌కుమార్ ఇంట్లో రెండోసారి, నటి రాధికు చెందిన రాడాన్ టీవీ సీరియల్ సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ మేరకు వారు బుధవారం అధికారుల ముందు హాజరయ్యారు. వీరద్దరిని వేర్వేరుగా విచారించారు. అలాగే, మంత్రి విజయభాస్కర్‌కు సన్నిహితురాలైన గీతాలక్ష్మి ఇంట్లో ఈనెల 7,8 తేదీల్లో తనిఖీలు నిర్వహించి ఐటీ సమన్లు జారీచేయగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఐటీ ఆదేశాలు పాటించాలని కోర్టు అక్షింతలు వేయడంతో గీతాలక్ష్మి సైతం బుధవారం ఉదయం హాజరయ్యారు. స్వపక్షంలోనే విపక్షం: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీలో పాత్రధారి దినకరన్కాగా సూత్రధారిగా వ్యవహరించిన మంత్రి విజయభాస్కర్ ఐటీ అధికారులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. ఈ సమయంలో ఆయనకు అండగా నిలవాల్సిన స్వపక్షీయులే విపక్షీయులుగా మారిపోయారు. ఐటీ దాడుల్లో మొత్తం రూ.89 కోట్ల పంపిణీకి మంత్రి బాధ్యుడిగా భావిస్తున్నారు. అంతేగాక ఆయన ఇంటి నుంచి రూ.5.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన క్వారీల్లో మంగళవారం నాడు 13 గంటలపాటు తనిఖీలు చేశారు. ఐటీ అధికారుల ముందు మంత్రి విజయభాస్కర్ ఒక దోషిగా నిలబడ్డారు. ఈ అవినీతి భాగోతంలో పలువురు మంత్రులకు భాగస్వామ్యం ఉన్నా ఐటీ దృష్టిలో విజయభాస్కర్ మాత్రమే నిందితుడుగా తేలాడు. దీన్ని అవమానంగా భావిస్తున్న అన్నాడీఎంకే నేతలు మంత్రిపై కారాలు మిరియాలు నూరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రతిష్టను దిగజార్చిన మంత్రి విజయభాస్కర్‌ను కేబినెట్ నుంచి తప్పించాలంటూ కొందరు నేతలు సీఎం ఎడపాడిపై ఒత్తిడి చేశారు. ఐటీ అధికారులు విజయభాస్కర్‌ను మరోసారి విచారించనున్న దృష్ట్యా వెంటనే పదవి నుంచి తప్పించాలని పట్టుపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి విజయభాస్కర్‌పై సీబీఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సుందర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్ని తనపై దుమ్మెత్తిపోస్తుండగా సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదులు చేయడంతో మంత్రి విజయభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. మంత్రికి పదవీగండం తప్పదని ప్రచారం జరుగుతోంది. -
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఈ ఎన్నికల కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 12న జరగనున్న ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలా? లేక యథాతథంగా కొనసాగించాలా? అన్న దానిపై ఈసీ సమాలోచనలు జరుపుతోంది. ఈ విషయంలో సోమవారం నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో గెలుపు శశికళకు చెందిన అన్నాడీఎంకే వర్గానికి కీలకం కావడంతో అధికారంలో ఉన్న ఆ వర్గం భారీ మొత్తంలో ప్రజలకు డబ్బు పంచుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలో పలు విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఆర్కే నగర్లో ఓటరుకు రూ. 4000 చొప్పున శశికళ వర్గం పంచుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఆర్కే నగర్‌లోని 2,24,145 మంది ఓటర్లకు పంచేందుకు శశికళ వర్గం అధినాయకత్వం నలుగురు మంత్రులకు రూ. 89.5 కోట్లు ఇచ్చినట్టు మీడియాకు లీకైన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మంత్రి ఇంటివద్ద హైడ్రామా: పత్రాలతో అనుచరుడి పరార్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరుగనిరీతిలో డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అధికారులు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌భాస్కర్ నివాసంలో శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హైడ్రామా ఐటీ అధికారులనే కాదు.. అక్కడ కాపలాగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లను కూడా బిత్తరపోయేలా చేసింది. ఒకవైపు ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే మరోవైపు సీఆర్పీఎఫ్ జవాన్ల నుంచి తప్పించుకొని మరీ ఇంటి నుంచి మంత్రి విజయ్ భాస్కర్ అనుచరుడు పత్రాలను బయటకు చేరవేయడం కెమెరాకు చిక్కింది. తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయాలకు ఈ హైడ్రామా అద్దం పడుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో వందకోట్లకుపైగా డబ్బును వివిధ పార్టీల నేతలు ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ అధికారులు నేరుగా డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు. ఏకంగా 35చోట్ల దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఐటీ అధికారుల దాడుల సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. తన నివాసంలో, తన కుటుంబసభ్యుల నివాసాల్లో కేవలం పదివేలు మాత్రమే దొరికాయని మంత్రి చెప్తుండగా.. అయితే, కీలక పత్రాల కోసమే ఆయన ఇంట్లో ఈ దాడులు నిర్వహించినట్టు ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఆర్కే నగర్ నియోజకవర్గంలోని మార్కింగ్ చేసిన పలు ఇళ్లు వేదికగా డబ్బు పంపిణీ కొనసాగుతున్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా ఇళ్లకు వేసిన మార్కింగ్ కోడ్, వీటి ఆధారంగా చేస్తున్న నోట్లకట్టల పంపిణీ గుట్టును రట్టు చేసేందుకు ఐటీ రంగంలోకి దిగింది. డబ్బు పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్న మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండగానే.. మరో మంత్రి కామరాజు తన అనుచరులతో అక్కడికి చేరుకొని రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. కొంతసేపు ప్రతిఘటించిన సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ తర్వాత వారిని లోపలికి అనుమతించారు. ఈ సందర్భంగా ఇంటిలో నుంచి కొన్ని పత్రాలను తీసుకొచ్చిన అన్నాడీఎంకే నేత థాలవాయ్ సుందరం వాటిని ఐటీ అధికారులకు కనబడకుండా మరో అనుచరుడికి అందించారు. కాస్తా దూరంగా నిలబడిన ఇద్దరు మంత్రులు దీనిని గమనిస్తుండగానే.. ఆ అనుచరుడు తన వెంటపడుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లను తప్పించుకొని మరీ ఆ పత్రాలను బయటకు విసిరేశాడు. బయట ఉన్న అన్నాడీఎంకే శ్రేణులు ఆ పత్రాలను మాయం చేశాయి. డబ్బు పంపిణీకి సంబంధించిన కీలకమైన పత్రాలను ఇలా బయటకు తరలించి ఉంటారని భావిస్తున్నారు. #WATCH Chennai: Security personnel chase TN Minister Vijaya Bhaskar's supporter who tried to flee with documents during IT raid (07.04.2017) pic.twitter.com/iELfRTBby8 — ANI (@ANI_news) 9 April 2017 -
కచ్చదీవుల రచ్చ
► సభలో వాగ్వాదం ► పిచ్చుకల పరిరక్షణపై చర్చ సాక్షి, చెన్నై: కచ్చదీవుల ధారాదత్తం అంశం మళ్లీ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ దీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తాము చర్యలు తీసుకున్నామని అధికార, ప్రతిపక్ష సభ్యులు వా గ్యుద్ధానికి దిగారు. అంతరిస్తున్న పిచ్చుకల పరిరక్షణకు పరిశీలన జరిపేందుకు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఓ తీర్మానం తీసుకొచ్చి చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు. తమిళ జాలర్ల మీద సాగుతున్న దాడులు, గత వారం జరిగిన కాల్పులను గుర్తు చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని స్టాలిన్ నిలదీశారు. దీంతో ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ జోక్యం చేసుకుని, ఆ దీవుల్ని ధారాదత్తం చేసిందెవరోనన్నది జగమెరిగిన సత్యం అని ఎదురు దాడికి దిగడంతో సభలో కాసేపు గందగరోళం నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో బుజ్జగించడం స్పీకర్‌కు తలకు మించిన భారంగా మారింది. స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కచ్చదీవులను ధారాదత్తం చేస్తున్న సమయంలో తమ అధ్యక్షుడు, అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తీసుకున్న చర్యలను ఆధారాలతో వివరించారు. ఇవన్నీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సాగిన ఆధారాలేనంటూ మంత్రితోపాటుగా అన్నాడీఎంకే సభ్యులు విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ సభలో గందరగోళం తప్పలేదు. చివరకు స్పీకర్ ఇరువర్గాల్ని బుజ్జగింప చేసి, కాసేపు స్టాలిన్ కు తదుపరి మంత్రికి మాట్లాడే అవకాశం కల్పించారు. జాలర్ల సంక్షేమం, కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తామే చర్యలు తీసుకున్నామన్నట్టు ఈ ప్రసంగాలు సాగాయి. తదుపరి ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం తీసుకొచ్చి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు ఓ ప్రశ్నను సంధించగా, అందరూ ఆహ్వానించారు. సోమవారం పిచ్చుకల దినోత్సవం అని గుర్తు చేస్తూ, అంతరించి పోతున్న వాటిని పరిరక్షించేందుకు ఏదేని కార్యాచరణ సిద్ధం చేస్తారా? అని ఆయన సంధించిన ప్రశ్నకు తొలుత అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సమాధానం ఇవ్వలేదు. మళ్లీ అదే ప్రశ్నను సంధించగా, పరిశీలిస్తామని, తప్పకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పళ్లికరణైలో పక్షుల శరణాలయం విస్తరణకు తగ్గ ప్రశ్నకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎత్తి చూపుతూ స్టాలిన్ సంధించిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
మొత్తం హాలీవుడ్ చలవే!
ఆ సీన్ - ఈ సీన్ ‘మల్లీశ్వరి’... దగ్గుబాటి వెంకటేశ్, కత్రినా కైఫ్‌లు హీరో హీరోయిన్లుగా, విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన త్రివిక్రమ్ విరచిత హిట్ సినిమా. ఈ సినిమా టైటిల్‌ను అలనాటి ‘మల్లీశ్వరి’ సినిమా స్ఫూర్తితో పెట్టుకున్నారనేది సుస్పష్టమైన అంశం. 1951లో ఎన్టీఆర్, భానుమతీ రామకృష్ణలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రరాజం ‘మల్లీశ్వరి’. మళ్లీ అదే పేరుతో, 2004లో విడుదలయిన చిత్రమిది. అయితే టైటిల్‌ను పాత తెలుగు సినిమా నుంచి తీసుకున్నారు కానీ... కథ, కథనాలను మాత్రం హాలీవుడ్ నుంచే ఎత్తుకొచ్చారు. మన నయా ‘మల్లీశ్వరి’కి మార్గం చూసిన ఆ ఆంగ్ల చిత్రం గురించి తెలుసుకోవాలంటే యాభై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సాధారణంగా... కాపీ కొట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక్కసారి ఆ ధైర్యం వచ్చిందంటే... ఆపై చాలా వరకూ వ్యక్తిగత సృజన చచ్చిపోతుంది. ఆలోచనల్లో పదునూ తగ్గిపోతుంది. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. కథాంశాన్ని విదేశీ సినిమాల నుంచి స్వీకరించడానికి ఏమాత్రం మొహమాటపడని ఈ రచయిత, దాన్ని తెలుగువారి అభిరుచికి అనుగుణంగా వండి వార్చడంలో ఎంతో ప్రతిభను ప్రద ర్శిస్తారు. ఆయనలోని ఆ ప్రతిభను ఆవిష్కరించిన చిత్రం ‘మల్లీశ్వరి’. అయితే ఈ సినిమా కథ విషయంలో ఒరిజినల్ రచయితలకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వని ఈ రచయిత, తెలుగు వెర్షన్ సినిమాను ప్రెజెంట్ చేయడంలో కూడా ఆ స్థాయిని రీచ్ కాలేకపోయారన్నది కాదనలేని నిజం. 1953లో విడుదలైన ‘రోమన్ హాలీడే’ అనే ఆంగ్ల కళాఖండాన్ని... తెలుగులో ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా మార్చే శారు త్రివిక్రమ్. రాజ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి, సాధారణ జీవితాన్ని గడపడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘రోమన్ హాలీడే’. రాజకుమారి అని తెలీక ఆమెను ప్రేమించే హీరో, అతనిని ఆమె సరదాగా ఏడిపించే తీరు, వీరిద్దరి మధ్య హీరో సహాయకుడు... ఈ పాత్రల తీరు ‘మల్లీశ్వరి’లో వెంకటేశ్, కత్రినాకైఫ్, సునీల్ పాత్రలకు స్ఫూర్తి అన్నది స్పష్టం. జన సామాన్యంలోకి వచ్చిన రాజకుమారి అమాయకత్వాన్ని ఎలివేట్ చేసే సీన్లలో కూడా ఇరు సినిమాల మధ్య బోలెడు పోలికలుంటాయి. తేడా ఏమిటంటే... తెలుగు వెర్షన్లో హీరో, హీరోయిన్ల కథలు సమాంతరంగా నడుస్తాయి. వాటికి ‘పెళ్లి కాని ప్రసాద్’ పాయింట్‌ని యాడ్ చేశారు. హీరోని అంతఃపురంలోకి పంపి సరదా సీన్లను క్రియేట్ చేశారు. అయితే ఈ కాపీ ‘రోమన్ హాలీడే’తో ఆగిపోలేదు. కత్రినా కైఫ్ ప్యాలెస్‌లో కుక్కతో ఉండే కామెడీ, మరికొన్ని సీన్లు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి తస్కరించినవే! ఇలా సీన్ల వారీగా లెక్కగ డితే ‘మల్లీశ్వరి’లో ‘రోమన్ హాలీడే’తో పాటు చాలా హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి! మూలకథ ‘రోమన్ హాలీడే’ నుంచి తీసుకొని, హాలీవుడ్ రొమాంటిక్ కామెడీల నుంచి కొన్ని సీన్లను తీసుకుని సినిమాను అల్లుకుంటూ పోయి.. క్లైమాక్స్ దగ్గర మళ్లీ ‘రోమన్ హాలీడే’ మంత్రం పఠించారు రచయిత. ప్రెస్‌మీట్ పెట్టి మల్లీశ్వరిని రాజకుమారిగా పరిచయం చేసే పతాక సన్నివేశాలు సైతం హాలీవుడ్ సినిమా లోనివే. ఈ సీన్లో వెంకటేశ్, సునీల్‌లు జర్నలిస్టులమంటూ ఆ ప్రెస్ మీట్‌కు వెళతారు కదా! అయితే హాలీవుడ్ సినిమాలో హీరో, అతడి సహాయకుడు నిజంగానే జర్నలిస్టులు. ‘మల్లీశ్వరి’లో హీరో, హీరోయిన్లు ఒక్కటవ్వడంతో సినిమా సరదాగా ముగుస్తుంది. కానీ హాలీవుడ్లో మాత్రం సెన్సిబుల్ ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ‘రోమన్ హాలీడే’ విలువను పెంచుతుంది. అదే ఆ సినిమాను అకాడెమీ అవార్డు వరకూ తీసుకెళ్లిందని పిస్తుంది. కానీ మనకు విషాదాంతాలు నచ్చవు కాబట్టి, తెలుగులో అదొక్కటీ మార్చి ఉంటారనుకోవాలి! - బి.జీవన్‌రెడ్డి -
సన్మార్గంలోకి మళ్లడమే నిజమైన మార్పు
శాంతియుత సహజీవనం కోసం భారత రాజ్యాంగం తన పౌరులకు కల్పించిన ఒక వెసులుబాటు ఏమిటంటే... మత స్వేచ్ఛ. దీని ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. అయితే మనలోనే కొందరు బలవంతపు మార్పిడి ప్రయత్నాల ద్వారా ఈ హక్కుకు భంగం కలిగిస్తున్నారు. అటువంటి మరొక ప్రయత్నమే... ‘మార్పిడుల పేరిట జరుగుతున్న గందరగోళాన్ని అరికట్టడానికంటూ’ మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలని కొందరు చేస్తున్న వాదన! మతం మీద, దైవ చిత్తం మీద సరైన అవగాహన లేనివారే ఇలాంటి ప్రయత్నాలను చేస్తుంటారని మనం గుర్తించాలి. వాస్తవానికి ఒక విశ్వాసాన్ని అవలంబింపజేయాలంటే మతం మార్పించే అవసరం లేదు. అలాగే వ్యక్తి పేరును ఫలానా మతాన్ని గుర్తుకు తెచ్చే విధంగా మార్చుకునే పనీ లేదు. ఎంచేతంటే - ఏ మతము కూడా బాహ్య రూపానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. అంతర్గత స్వచ్ఛతే దైవానికి కావలసింది. దుష్ట తలంపుల నుండి, దురలవాట్ల నుండి, దుర్మార్గం నుండి పరివర్తన చెంది సన్మార్గంలోకి, దేవుని సన్నిధిలోకి రావడమే నిజమైన మార్పిడి. సన్మార్గమే దేవుని అభిమతం. ప్రతి ప్రబోధకుడు మతాలకు అతీతంగా పౌరుల మనస్సులను సన్మార్గం వైపు మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం భారతీయ సమాజంలో ఏర్పడిన మత అస్థిమితానికి ఆస్కారం ఉండదు. మతం పేరుతో ఒకరి పట్ల ఒకరు విద్వేషాలు పెంచుకోకుండా, పరస్పర గౌరవాభిమానాలతో మెలిగిన నాడు దేవుని దృష్టిలో ప్రశంసలు పొంది, సుఖశాంతులతో జీవించగలుగుతాం. - యస్. విజయ భాస్కర్ -
నిరంతరం... నిశ్చింతగా..!
చింత లేని వ్యక్తి ఈ లోకంలో ఉండడు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక విషయానికి చింతిస్తూ ఉంటారు. చింతలు మనల్ని మానసికంగా దిగజార్చుతాయి. మన జీవితంలో అధిక భాగం చింతించడానికే సరిపోతుంది. నిజానికి మన అనారోగ్యానికి ఈ చింతలే కారణం. చింతలకు కారణం అవిశ్వాసం! అయితే దేవుడిపై విశ్వాసం ఉన్నవారి దరికి ఏ చింతా చేరలేదని మనం గ్రహించాలి. విశ్వాసం దేవునికి అత్యంత ప్రీతికరమైన గుణం. విశ్వాసం లేకుండా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం అసాధ్యం. దేవునిపై విశ్వాసం గలవారు దేవుని కోసం నిరీక్షిస్తారు. అంతేకాదు, విశ్వాసంలో సానుకూల అలోచనా ధోరణి మనల్ని నడిపిస్తుంది. అందుకే విశ్వాసి తలపెట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఇందుకు భిన్నంగా అవిశ్వాసి వ్యతిరేక ఆలోచనా ధోరణితో, అపసవ్య ప్రవృత్తితో ఉంటాడు. అందుకే అతడు ప్రతి క్షణం సమస్యలతో, సందేహాలతో, చింతలతో సతమతం అవుతూ ఉంటాడు. సానుకూలతా? వ్యతిరేకతా? మనం ఎటువైపు ఉండాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మనం దేని వైపు ఉంటే, దానికి తగిన ఫలితమే మనకు చేకూరుతుంది. ‘నమ్మడం నీ వల్ల సాధ్యం అయితే సమస్తం నీకు సాధ్యమే’ అంటారు ఆధ్యాత్మిక గురువులు. భగవంతునిపై నమ్మకం ఉంచినప్పుడు జీవితంలో అద్భుతాలు జరిగిపోతుంటాయి. కనుక వ్యతిరేక దిశలో ఆలోచించండం మాని సవ్యదిశలో, ఆశావహ దృక్పథంలో ప్రతి ఒక్కరం జీవనయానం సాగించాలి. సృష్టికర్త అయిన దైవాన్ని మనం హృదయపూర్వకంగా ప్రేమించి, విశ్వసించినప్పుడు మన భారం మొత్తం ఆయన మీద మోపినప్పుడు మనం ఏ విషయానికీ చింతించనవసరం లేదు. దేవునికి ఇష్టులముగా నిశ్చింతగా నిరంతరం జీవించవచ్చు. - యస్.విజయ భాస్కర్ -
బెల్టు షాపులపై దాడులు
అనంతగిరి, న్యూస్‌లైన్: బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం ఆయన వికారాబాద్‌లోని సర్కిల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పూడూరు మండలం గట్టుపల్లిలో ఓ మహిళ ఇంట్లో దాడులు చేసి 480 సారా ప్యాకెట్లు, 44 నాకౌట్ బీర్లు, 28 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతో పాటు మంచన్‌పల్లి గ్రామంలో రాంచంద్రయ్య ఇంట్లో తనిఖీలు చేసి 12 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండుకు తరలించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. సారా బట్టీలపై దాడులు మర్పల్లి: పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో షాపూర్ తండా, దామస్తాపూర్ తండా, బంట్వారం మండలం నాగారం తండాలో తనిఖీలు చేశారు. 4,050 లీటర్ల ఊట బెల్లంతో పాటు 110 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. మరో ఘటనలో.. శనివారం సాయంత్రం ఓ ఆటో(ఏపీ 28 వీ 0052)లో మర్పల్లి నుంచి కోటమర్పల్లికి తరలిస్తున్న 192 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మహ్మద్జలీల్ను రిమాండుకు తరలించినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుధాకర్‌వర్మ, ఎస్సైలు శ్రీనివాస్, రఘురాంరెడ్డి, సిబ్బంది ఉన్నారు. వేర్వేరు ఘటనల్లో మద్యం పట్టివేత తాండూరు టౌన్: వేర్వేరు ఘటనల్లో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన కోట్ల మల్లికార్జున్ ఓ ఆటోలో 239 క్వార్టర్ బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన సురేష్ నుంచి 25 క్వార్టర్ బాటిళ్లు, యాలాల మండలం ఎన్కేపల్లి గ్రామస్తుడు బీటీ గోవింద్ వద్ద 45 క్వార్టర్ బాటిళ్లు, పెద్దేముల్ మండలం కోటపల్లికి చెందిన కోమలి శ్రీనివాస్ క్వాలిస్‌లో తరలిస్తున్న 90 బీర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితులు మల్లికార్జున్, సురేష్, బీటీ గోవింద్, శ్రీనివాస్‌లతో పాటు క్వాలిస్ డ్రైవర్ జైపాల్‌రెడ్డి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. క్వాలిస్‌ను సీజ్ చేసినట్లు సీఐ చెప్పారు. -
నటిగా రాణిస్తానని అనుకోలేదు
అనుకోకుండా సినీ రంగంలో అడుగుపెట్టిన తనను తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ఆదరించిందని సినీ హీరోయిన్ ఇషాచావ్లా అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో షూటింగ్లో పాల్గొన్న ఆమె స్థానిక విలేకర్లతో కొద్దిసేపు ముచ్చటించారు. ''నేను ఢిల్లీలో పుట్టాను. అక్కడే పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తిచేశా. తండ్రి ఢిల్లీలో యూపీఎస్ సంస్థలో కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. చదువుకుంటున్న సమయంలో నాకు తెలియకుండానే కెమెరామన్ చోటానాయుడుకు నా ఫొటోలు పంపించారు. ఆయన నన్ను హీరోయిన్గా తీసుకుందామని దర్శకుడు విజయభాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే నాకు కబురు రావడంతో వెళ్లగా ఒక్క రోజులోనే నన్ను ఎంపిక చేశారు. 2010లో విజయభాస్కర్ దర్శకత్వం వహించిన 'ప్రేమకావాలి' నా మొదటి సినిమా. ఆ తర్వాత సునీల్ హీరోగా పూలరంగడు చిత్రంలో నటించా. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాలు చేశాను. నాలుగు తెలుగు చిత్రాల్లో నటించడంతో తెలుగు పూర్తిగా నేర్చుకున్నాను. కన్నడంలో హీరో దర్శన్‌తో నటించిన విరాట్ చిత్రం త్వరలో విడుదలవుతుంది. హిందీలో సల్మాన్‌ఖాన్, తెలుగులో నాగార్జున నా అభిమాన హీరోలు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం" అని ఇషాచావ్లా వెల్లడించారు. -
పాల ధర పెంపు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రభుత్వ, పార్టీ రాజకీయ కార్యకలాపాలతో అలసి సొలసిపోయిన అమ్మ పాడి రైతులకు వరం ప్రకటించి కొడనాడుకు విశ్రాంతికి వెళ్లిపోయారు. ఆవు, గేదె పాల సేకరణ ధర మూడు రూపాయలు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న ఆవిన్తోపాటూ రాష్ట్రంలో అనేక ప్రయివేటు, సహకార పాడిరైతుల సంఘాలు ఉన్నాయి. పశువుల దాణా ధర పెరగడం, సిబ్బంది జీతాలు పెంచక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న సేకరణ ధర గిట్టుబాటు కావడం లేదని కొన్ని నెలలుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వీరి విజ్ఞప్తులపై అధికారులతో ఇటీవల సమీక్షించిన సీఎం సేకరణ ధర పెంచడం న్యాయ సమ్మతమని నిర్ణయానికి వచ్చారు. ఆవుపాలకు ఇప్పటి వరకు లీటరుకు రూ.20 చెల్లిస్తుండగా రూ.23 చెల్లించాలని తీర్మానించారు. అలాగే గేదె పాలకు రూ.28 చెల్లిస్తుండగా ఆ ధరను రూ.31కి పెంచేందుకు ఆమె సమ్మతించారు. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని 22.50 లక్షల సహకార పాల అమ్మకం దారులు పెంచిన ధరలతో లబ్ధిపొందుతారు. పాలసేకరణ ధర పెంపుకారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ.273 కోట్ల 75 లక్షల అదనపు భారం పడుతుంది. పాల సేకరణ ధర పెంపుపై పాడిరైతుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పాలసీ వల్ల ప్రభుత్వానికి రూ.420 కోట్ల రాబడి వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ మంగళవారం ప్రకటించారు. -
తొలియత్నం: ఇదే నాలుగో సినిమా అయ్యుంటే...
సముద్రంలో కెరటం లేచిపడింది, పడి లేచిందా? ఆకాశంలో సూర్యుడు వెలిగి ఆరిపోయాడా, ఆరినవాడు తిరిగి వెలిగాడా? ఏది సత్యం, ఏదసత్యం... ఏది కొలమానం, ఏది గీటురాయి... జీవితం వృత్తమైనప్పుడు నిజం, అబద్ధం, గెలుపు, ఓటమి లాంటి విలువన్నీ పాక్షిక సత్యాలే. కానీ జీవితం ఆ జీవితంలోని కొన్ని క్షణాలను సృజనాత్మకంగా ఆవిష్కరిస్తూ, సక్సెస్‌ను మాత్రమే కొలమానంగా లెక్కించే సినీ వెండితెర చతురస్రంలో విలువలు, లెక్కలకు అతీతంగా గమనం సాగించడం అంత సులువేమీ కాదు. అయితే ఒక విలువతో, నిబద్దతతో పనిచేసినప్పుడు ఈ భౌతిక విలువలకు అతీతంగా నచ్చిన మార్గంలో స్థిరంగా ముందుకు సాగడం సాధ్యమేనని నిరూపించిన దర్శకుడు కె.విజయభాస్కర్. ఆయన మొదటి సినిమా ‘ప్రార్థన’ ఆయనకే కాదు, ప్రేక్షకులకూ ఓ కొత్త అనుభవం. అలాంటి ప్రయోగం చేసే అవకాశం ఇప్పటికీ రాలేదంటున్న విజయభాస్కర్ అంతరంగమిది. బి.గోపాల్గారు ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ‘కానూన్ అప్నా అప్నా’గా హిందీలో తీస్తున్న సమయమది. ఆ సినిమాకు నేను ఆఖరి అసిస్టెంట్‌ని. తరువాత ‘లారీ డ్రైవర్’కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది. గోపాల్‌గారికి చెప్పగానే, చెయ్యగలవా అన్నారు. తలూపాను. సరేనన్నారాయన. కందేపి సాంబశివరావు, సురేశ్ కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అప్పుడప్పుడే ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంటున్న సురేశ్‌ను హీరోగా ప్రమోట్ చేయడం కోసమే ఈ సినిమా చేయాలనుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. హీరోను, బడ్జెట్ పరిధులను దృష్టిలో ఉంచుకుని, కథ రాసుకోవాలి. నాకేమో సినిమా కథ అనగానే రొటీన్‌కు భిన్నంగా ఉండాలనేది ఆలోచన. మా చిన్నప్పుడు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతివారం ఒక పరభాషా చిత్రం చూపించేవారు. దాంతో ప్రపంచ సినిమాతో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ ప్రభావంతో వైవిధ్యమైన కథ రాయాలని తపించాను. రోజుల తరబడి ఇంటి డాబా మీద ఒంటరిగా కూర్చుని కథ రాశాను. ఎక్కడ ఏం రాయాలి, దేని తరువాత మరేం రావాలి లాంటి స్క్రీన్‌ప్లే రూల్స్ తెలీకుండా స్క్రిప్ట్ పూర్తి చేశాను. నిర్మాతకు, హీరోకు కధ వినిపించగానే ‘‘మనం ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇక ఆర్టిస్ట్‌లు ఎవరు అనుకున్నప్పుడు హీరో సురేశ్ పక్కన హీరోయిన్గా ఒక కొత్తమ్మాయిని తీసుకున్నాం. తను అప్పుడే విడుదలైన మణిరత్నం ‘అంజలి’ సినిమాలో ఆనంద్ పక్కన జంటగా నటించింది. అందులో ఒక పాటలో తన పెర్ఫామెన్స్ నచ్చింది. ఆమె పేరును అంజలిగా మార్చి, మా సినిమాలో పెట్టుకున్నాం. హీరో పక్కన స్నేహితులుగా సూర్యకిరణ్, జాకీ (తరువాత ఒకరు దర్శకుడిగా, మరొకరు నటుడిగా ఫేమ్ అయ్యారు) నటించారు. ఇక షూటింగ్ ఎక్కడ చేద్దాం అన్న చర్చ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మా గుంటూరులో అయితే షూటింగ్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అన్నారు. కథ ప్రకారం, మాకు కీలకంగా కావలసింది ఒక మెకానిక్ షెడ్. గుంటూరులో షెడ్ వేసిన తరువాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమా పూర్తిచేశాం. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా సినిమాలో క్వాలిటీ లేకపోయినా, కథ, కథనంలో నవ్యతే ‘ప్రార్థన’ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశం నాకింతవరకూ రాలేదు, బహుశా మరెప్పటికీ రాకపోవచ్చు కూడా. సినిమా ప్రారంభంలోనే ఒక పాప, డ్రిపెషన్‌లో వున్న హీరో, పాప కోసం వెతుకుతున్న విలన్ ఇలా ఒకరికొకరు సంబంధం లేని పాత్రల మధ్య ఏదో సంబంధం వుందన్న ఆలోచన, ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగజేసాను. సరిగ్గా ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ చేసాను. మెకానిక్‌గా పనిచేసే హీరో, ఒక ధనవంతురాలయిన అమ్మాయి ప్రేమించుకుంటారు. హీరోయిన్ విధిలేని పరిస్ధితుల్లో తన తండ్రి దగ్గర పనిచేసే విలన్ బెనర్జీని పెళ్లి చేసుకుంటుంది. ఒక పాపకు జన్మనిచ్చి హీరోయిన్ చనిపోతుంది. ఇక్కడికి ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లోపే విలన్ ఉద్దేశం, హీరో లక్ష్యం ప్రేక్షకులకి తెలిసిపోతాయి. ఇక ఇక్కడి నుంచి ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తూ సెకండ్ హాఫ్ నడపాలి. అదీ ఛాలెంజ్. ఆస్తిని కాపాడుకోవడానికి బెనర్జీకి పాప కావాలి. సవతి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయిన పాప ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. హీరో దగ్గర వుందని సమాచారం తెలిసి వెళతాడు. ఒకసారి నీవల్ల నేను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాను. ఇప్పుడు కూడా అదే తప్పు చేయనంటాడు హీరో. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ. హీరో విలన్‌ను చితక్కొట్టి పంపిస్తాడు. విలన్ బెనర్జీ పాపను తీసుకొచ్చే బాధ్యత ఒక చిన్నపాటి రౌడీకి అప్పగిస్తాడు. పాపకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కథ మలుపు తీసుకుంటుంది. హీరో పాపను హాస్పిటల్లో చేరుస్తాడు. అపెండిసైటిస్ అని తేలడంతో తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. వైద్యం కోసం పక్క ఊరికి వెళ్లిన డాక్టర్ కోసం హీరోతో పాటు మిత్రబృందం ఎదురు చూస్తుంటారు. సమయం పరిగెడుతున్నా డాక్టర్ వచ్చే జాడ కనపడటం లేదు. మరోవైపు తన అసిస్టెంట్స్ ద్వారా విషయం తెలుసుకున్న రౌడీ... డాక్టర్‌ను హాస్పిటల్‌కు రాకుండా చేయాలనుకుంటాడు. ఆ బాధ్యత తన అసిస్టెంట్స్‌కు అప్పగిస్తాడు. హాస్పిటల్ దగ్గర డాక్టర్‌కోసం చాలాసేపు నిరీక్షించిన హీరో లాభం లేదనుకుని, డాక్టర్ ఇంటివైపు బయలుదేరుతాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ తలుపు తీసి లోనికి అడుగుపెట్టి, కిచెన్‌లో కుక్కర్ ఆన్ చేస్తుంది. హాల్లోకి వచ్చి లైట్ వేయగానే, తన కుర్చీలో కనిపించిన వ్యక్తిని చూసి అరుస్తుంది. అతడు వెంటనే ఆమె నోరు మూసి, కుర్చీలో కట్టేస్తాడు. నేను నిన్నేమీ చేయను, కాసేపు హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇక్కడే కూర్చో అని బయట నుంచి తాళం వేస్తాడు. అతడు బయటకు రాగానే డాక్టర్ ఇంటివైపు వస్తున్న హీరో కనిపిస్తాడు. హీరో నుండి తప్పించుకోవడానికి రౌడీ పక్కనే ఉన్న పెద్ద కొబ్బరిచెట్టు ఎక్కుతాడు. హీరో కాలింగ్ బెల్ కొడతాడు. లోపలి నుంచి ఏ అలికిడీ వినిపించదు. తలుపువైపు చూస్తే తాళం వేసి కనిపిస్తుంది. హీరో గుమ్మం మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం నిరీక్షిస్తుంటాడు. లోపల కట్టేసి ఉన్న డాక్టర్‌కు తనకోసం ఎవరో వచ్చారని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి సీనంతా టాప్ యాంగిల్లో ఓ చెట్టు మీద ఉన్న రౌడీ యాంగిల్లో ప్రేక్షకుడికి కనిపిస్తుంటుంది. బయట మెట్ల మీద కూర్చున్న హీరో, లోపల టేబుల్ మీద వాటర్ బాటిల్‌ను తలతో కింద పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్. వాటర్ బాటిల్ కిందపడితే లోపల ఉన్న డాక్టర్ ఉనికి హీరోకి తెలిసిపోతుంది. బయట అసహనంగా టైమ్ చూసుకుంటున్న హీరో, లోపల తన తలతో బాటిల్ పడేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, పైన చెట్టు మీద నుంచి టెన్షన్‌గా చూస్తున్న రౌడీ. ఇంతలో బాటిల్ టేబుల్ నుంచి కిందపడి పెద్ద సౌండ్ చేసే లోపు, రౌడీ కొబ్బరికాయ తెంచి కిందపడేస్తాడు. హీరో అలర్ట్ అయ్యేలోపు చెట్టు కింద పడ్డ కొబ్బరికాయ కనిపిస్తుంది. మళ్లీ టెన్షన్. అటు హాస్పిటల్లో నొప్పితో బాధపడుతున్న పాప, మెట్ల మీద కూర్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్న హీరో, లోపల తన ఉనికిని బయట ఉన్న వ్యక్తికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్, హీరోకు లోపల డాక్టర్ ఉన్నట్లు తెలిసిపోతుందేమోనని చెట్టుమీద టెన్షన్ పడుతున్న రౌడీ... ఇలా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నప్పుడు కిందపడిన నీళ్లు తలుపు సందులోంచి కారుతూ మెట్ల మీద కూర్చున్న హీరో కిందకు వస్తుండగా, సడన్‌గా లేచి వెళ్లిపోతాడు. మళ్లీ టెన్షన్ టెన్షన్. హీరో సందు మలుపు దాటుతుండగా లోపల కిచెన్ నుంచి విజిల్ వినిపిస్తుంది. హీరో మళ్లీ వెనక్కు వచ్చి లోపల ఎవరో ఉన్నారని తలుపు బద్దలుకొడతాడు. రౌడీని ఎదిరించి, డాక్టర్‌ను విడిపించి, సమయానికి హాస్పిటల్‌కు వెళతారు. ఈ సీన్ తీసేటప్పుడు షాట్స్, ప్రాపర్టీస్, యాంగిల్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎందుకంటే సీన్ అంతా చెట్టు మీద ఉన్న వ్యక్తి యాంగిల్ నుంచే జరుగుతుంది. అతని టెన్షన్‌తో పాటుగా ప్రేక్షకులు టెన్షన్ అనుభవించాలి. ప్రేక్షకులను థ్రిల్ చేయడం కోసం ప్రతి డిటైల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. నిజానికి గుంటూరులో కొబ్బరిచెట్టు ఉన్న ఇల్లుకోసం చాలా వెదికాం కానీ దొరకలేదు. చివరకు ఒక పెద్ద కొబ్బరిచెట్టును వేరే చోటు నుంచి తెప్పించి మేం షూట్ చేయాలనుకున్న ఇంటి పెరట్లో నాటించాం. ఇలా ఒక సీన్‌ను ఇంత కన్విన్సింగ్‌గా, ఇంట్రెస్ట్‌గా రాసే సందర్భం నాకు మళ్లీ రాలేదని చెప్పొచ్చు.కథ మూడ్‌కు తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్ ప్రకాశ్ చాలా సహకారం అందించారు. ఏ రకంగా చూసినా అప్పటికి ఇది విభిన్నమైన కథ. ఇదే నా మూడో నాలుగో సినిమా అయితే, బడ్జెట్ పరిమితులు లేకుండా ఇంకొంత క్వాలిటీతో తీసేవాణ్నేమో. ఏదేమైనా జీవితం పట్ల సరైన ప్రాపంచిక దృక్పథం ఉండబట్టే ‘ప్రార్థన’ తరువాత ‘స్వయంవరం’ వరకు ఏడేళ్ల దాకా సినిమా అవకాశం రాకపోయినా నిబ్బరంగా ఉండగలిగాను. ప్రభుదేవాను మొదటిసారి ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం చేశాం. అందుకోసం తను గుంటూరు వచ్చాడు. అయితే మా సినిమా కంటే ముందు (తరువాత) తను కొరియోగ్రఫీ చేసిన మరో సినిమా ముందుగా విడుదలైంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
వెంకటేష్‌గారితో పనిచేయడం గొప్ప అనుభూతి - రామ్
‘‘ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి విజయాల తర్వాత మళ్లీ విజయభాస్కర్‌తో ‘మసాలా’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్లో నటించడం ఆనందంగా ఉంది. తమన్ పాటలు, నేపథ్యం సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని వెంకటేష్ అన్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘మసాలా’. డి.సురేష్‌బాబు సమర్పణలో... ‘స్రవంతి’రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదమ్సీ కథానాయికలు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రామ్ మాట్లాడుతూ -‘‘హీరోలుగా వెంకటేష్గారూ నేనూ పోటీపడి నటించామని అందరూ అంటున్నారు. దానికంటే ముఖ్యంగా సురేష్‌గారు, పెదనాన్న రవికిషోర్‌గారు పోటీపడి ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. అందరూ ఇష్టపడి పనిచేసిన సినిమా ఇది. పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి’’ అన్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నవ్వుల మసాలా
టైమింగ్‌తో మెప్పించడం వెంకటేష్ స్టైల్. వేగంతో మెరిపించడం రామ్ స్టైల్. వీరికి తోడుగా అంజలి, షాజన్ పదమ్సీ లాంటి ఘాటైన దినుసులు తోడైతే.. ‘మసాలా’ టేస్ట్ అదరహో అనకుండా ఉంటుందా! దర్శకుడు కె.విజయభాస్కర్ ఛాలెంజ్‌గా తీసుకొని తెరకెక్కించిన ‘మసాలా’ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వులలోకంలో విహరింపజేసేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ అంటున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ -‘‘నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకే అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రచార చిత్రాల్లో వెంకటేష్ చెబుతున్న డైలాగులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. తమన్ స్వరాలందించిన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. సెన్సార్‌వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని తరగతుల వారినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్‌శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.