
‘‘విజయభాస్కర్‌గారి దర్శకత్వంలో నేను ‘ప్రేమకావాలి’ సినిమా చేయాల్సింది... మిస్ అయ్యింది. ఆది సాయికుమార్ ‘రేయ్’ చేయాలి... కానీ ‘ప్రేమ కావాలి’ చేశాడు. నేను ‘రేయ్’ చేశాను. విజయభాస్కర్‌గారు కొత్తవాళ్లతో చేసిన ‘ఉషా పరిణయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇలాంటి కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు హీరో సాయి దుర్గ తేజ.. శ్రీ కమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన చిత్రం ‘ఉషా పరిణయం’. కె. విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 2న విడుదలవుతోంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఎంతో ఆప్తుడైన సతీష్ అన్న కూతురు తాన్వీ ఆకాంక్షకి అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఈ మూవీ విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. విజయభాస్కర్ మాట్లాడుతూ– ‘‘14 ఏళ్ల క్రితం సాయి దుర్గ తేజ్‌ని నేనే హీరోగా పరిచయం చేయాల్సింది.. కానీ కుదరలేదు. మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ‘ఉషా పరిణయం’ నిర్మించాను’’ అన్నారు. శ్రీ కమల్ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి (కె. విజయభాస్కర్) పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment