సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. జేసీ వర్గీయులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు.
రెండేళ్ల కిందట హత్యకు గురైన వైఎస్‌ఆర్ సీపీ నేత విజయభాస్కర్ సోదరే హరిప్రియ. విజయభాస్కర్ హత్య కేసులో రాజీకి రావాలని గత రెండేళ్లుగా టీడీపీ వర్గీయులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని హరిప్రియ చెప్పారు. కొద్దిరోజుల కిందట కోర్టులో హత్య కేసు విచారణకు రావడంతో అప్పేచెర్లలో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని హరిప్రియ తెలిపారు.
జేసీ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని... వైఎస్సార్ సీపీ నేత విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో రాజీ కావాలని చాలారోజులుగా ఒత్తిడి తెస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేసిన హరిప్రియ లేఖ ఇది..
Comments
Please login to add a commentAdd a comment