జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. జేసీ వర్గీయులే తనను చంపేందుకు ప్రయత్నించారని హరిప్రియ ఆరోపించారు.