‘‘సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందనే మాటని ఒప్పుకోను. ఎన్ని ఓటీటీలు వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గదు. అన్నీ సమ΄ాళ్లలో జోడించి ఎంటర్‌టైన్ చేయగలిగితే తప్పకుండా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. అలా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసే చిత్రమే మా ‘ఉషా పరిణయం’’ అని డైరెక్టర్ కె. విజయభాస్కర్ అన్నారు.
‘నువ్వే కావాలి, నవ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కె.విజయ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉషా పరిణయం’. ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా, తన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. విజయ భాస్కర్ చెప్పిన విశేషాలు.
⇒ ఎవరి కోసం కథ రాస్తామో వాళ్లను దృష్టిలో పెట్టుకుని కామెడీ రాస్తాం. ‘మన్మథుడు’ చిరంజీవిగారికి మ్యాచ్ కాదు. ‘జై చిరంజీవ’ వెంకటేశ్‌కి సరిపోదు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో వెంకటేశ్‌ని తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ‘ఉషా పరిణయం’ కథని మా అబ్బాయి శ్రీ కమల్ కోసం రాయలేదు. ఈ స్క్రిప్ట్‌ని ముగ్గురు హీరోలకు చె΄్పాను.. కానీ కుదరలేదు. ‘జిలేబి’ మూవీ తర్వాత నాకు సరిపోయే కథతో సినిమా చేయమని కమల్ అడిగాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కి ‘ఉషా పరిణయం’ కథ సరిపోతుందనిపించి ముందుకెళ్లాం. శ్రీ కమల్, తన్వీ జోడీ అద్భుతంగా కుదిరింది. వారి నటన కూడా చాలా బాగుంటుంది.
⇒ ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ‘ఉషా పరిణయం’. ప్రేమ ఎప్పుడూ హింసని కోరుకోదనేపాయింట్‌ని సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చె΄్పాను.
⇒మా సినిమా యూత్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ, మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్లే సినిమాని కూడా కుటుంబమంతా కలిసి చూసేట్లు తీయాలి. నా దృష్టిలో దర్శకుడికి విలువలు ముఖ్యం. నేను సినిమా అయినా వదులుకుంటాను కానీ, నా విలువలను వదులుకోను. నా చిత్రాలను నా తల్లి, భార్య, పిల్లలతో కలిసి చూడాలనుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment