నవ్వుల మసాలా
నవ్వుల మసాలా
Published Thu, Nov 7 2013 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
టైమింగ్‌తో మెప్పించడం వెంకటేష్ స్టైల్. వేగంతో మెరిపించడం రామ్ స్టైల్. వీరికి తోడుగా అంజలి, షాజన్ పదమ్సీ లాంటి ఘాటైన దినుసులు తోడైతే.. ‘మసాలా’ టేస్ట్ అదరహో అనకుండా ఉంటుందా! దర్శకుడు కె.విజయభాస్కర్ ఛాలెంజ్‌గా తీసుకొని తెరకెక్కించిన ‘మసాలా’ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని నవ్వులలోకంలో విహరింపజేసేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత ‘స్రవంతి’రవికిషోర్ అంటున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ -‘‘నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకే అద్భుతమైన స్పందన వచ్చింది.
ముఖ్యంగా ప్రచార చిత్రాల్లో వెంకటేష్ చెబుతున్న డైలాగులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. తమన్ స్వరాలందించిన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. సెన్సార్‌వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం అన్ని తరగతుల వారినీ అలరిస్తుందని నా నమ్మకం’’ అన్నారు. ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: రోహిత్‌శెట్టి, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కృష్ణ చైతన్య, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాణం: శ్రీ స్రవంతి మూవీస్.
Advertisement
Advertisement