
కాలితో తంతున్న సీఐ విజయభాస్కర్ గౌడ్
అనంతపురం : అనంతపురం వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్ గౌడ్ వీరంగం సృష్టించారు. ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన పర్మిట్ రూంలో మద్యం తాగుతున్న వారిపై సీఐ జులూం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండానే విచక్షణా రహితంగా దాడి చేశారు. అడిగినంత లంచం ఇవ్వనందునే సీఐ విజయభాస్కర్ దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రతి నెలా ఒక్కో మద్యం షాపు నుంచి రూ.15 వేల ముడుపులు పోలీసులు తీసుకుంటున్నట్లుగా తెలిసింది.
టీడీపీ నేతల ఒత్తిడితో సీఐ విజయభాస్కర్ పనిచేస్తున్నారని మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ దురుసు ప్రవర్తనపై ఎక్సైజ్ అధికారులు కూడా మండిపడుతున్నారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని వైన్ షాపు నెంబర్-5లో సీఐ విజయ భాస్కర్ ఓ వ్యక్తిని కాలితో తన్నటం వీడియోలో రికార్డవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment