One town CI
-
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
వివాదాస్పద తీరు.. ఆగడాల్లో సరిలేరు!
ఎక్కడైనా ఒక పోలీసు అధికారికి మంచి పోస్టింగ్ ఇవ్వాలంటే పనితీరు, నిజాయితీ వంటివి చూస్తారు. కానీ ఆ సీఐకి ఈ అర్హతలే లేవు. పైపచ్చు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హత్య కేసుల్లో నిందితులకు సహకరిస్తారని, బాధితులపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకులఅడుగులకు మడుగులొత్తడంలో ఘనాపాటిగా పేరుంది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచి మరీ అందలం ఎక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన రెండు హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. అనంతపురం రూరల్ మండలం కందుకూరులో 2018 మార్చి 30న వైఎస్సార్ సీపీ నేత శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.ఇటుకలపల్లి నుంచి స్వగ్రామం వెళ్తుండగా దారిలో కాపుకాచిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు వారం రోజుల ముందే రెండు వర్గాల నడుమ గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివారెడ్డి సోదరుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందించగా, అప్పట్లో సీఐగా ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్ దాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వారం రోజులకే శివారెడ్డి హత్య జరి గింది. వినతిపత్రం ఇచ్చినప్పుడే నిందితులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే అసలు హత్యే జరిగి ఉండేది కాదని కందుకూరు గ్రామస్తులు నేటికీ చెబుతున్నారు. శివారెడ్డి హత్యకు పరోక్షంగా సీఐ కూడా కారణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు విచారణ అధికారిగా రాజేంద్రనాథ్ ఉంటే బాధితులకు న్యాయం జరగదని మరో పోలీసు అధికారిని ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం.ప్రసాదరెడ్డి హత్య కేసులోనూ..2015 ఏప్రిల్ 29న ఏకంగా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోనే వైఎస్సార్ సీపీ కీలక నేత భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య నేపథ్యంలోనూ రాజేంద్రనాథ్ వ్యవహార శైలిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కారును అప్పట్లో శివప్రసాద్ రెడ్డి హత్య కేసు నిందితులు వాడినట్టు తేలింది. ఆ సమయంలో దగ్గుపాటి ప్రసాద్ రాప్తాడు ఎంపీపీగా ఉన్నారు. ఇప్పుడు దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే కావడంతో రాజేంద్రనాథ్ ఏకంగా కీలకమైన వన్‌టౌన్‌కు పోస్టింగ్ తెచ్చుకోగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సెటిల్మెంట్లలో ఘనుడు!రాప్తాడుకు చెందిన ఓ విలేకరికి, ఆయన అన్నదమ్ములకు మధ్య భూ వివాదం నడుస్తోంది. వీరిలో ఒక వర్గానికి పరిటాల కుటుంబం మద్దతు ఉంది. దీంతో అప్పట్లో మంత్రి అయిన పరిటాల సునీత ఒత్తిడితో విలేకరిపై సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ రెచ్చిపోయారు. విలేకరి చొక్కా పట్టుకుని ‘భూమి మీద నీకు హక్కులేదు, మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా లేదా’ అని బెదిరించారు. దీంతో బాధిత విలేకరి అప్పట్లో తన మిత్రులతో కలిసి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగగా సీఐ క్షమాపణలు చెప్పారు. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ ఘనాపాటిగా రాజేంద్రనాథ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.తాజాగా స్టూడెంట్ యూనియన్ నేతలపై..నేటికీ రాజేంద్రనాథ్ యాదవ్ తన వివాదాస్పద వైఖరిని వీడలేదు. స్టూడెంట్ యూనియన్ నాయకులపై ఇటీవల తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. స్కాలర్షిప్లు మంజూరు చేయాలంటూ అనంతపురంలోని పెన్నార్ భవన్ వద్ద ధర్నాకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలపై చిందులు తొక్కారు. సీఐ వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, తమను కొట్టడానికి కూడా యత్నించారని, విద్యార్థుల పట్ల కూడా అమాన వీయంగా వ్యవహరించారని విద్యార్థి సంఘం నేతలు వాపోయారు. ఇలా తాను ఎక్కడ పనిచేసినా లెక్కలేనన్ని ‘ఘనతలు’ మూటగట్టుకున్న వ్యక్తికి నగరంలో కీలక స్థానాన్ని కట్టబెట్టడం ఉమ్మడి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసే పోలీసు బాస్‌లు రాజేంద్రనాథ్ యాదవ్ విషయంలో ఉదారంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
సీఐ విజయభాస్కర్ వీరంగం
అనంతపురం : అనంతపురం వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్ గౌడ్ వీరంగం సృష్టించారు. ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన పర్మిట్ రూంలో మద్యం తాగుతున్న వారిపై సీఐ జులూం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండానే విచక్షణా రహితంగా దాడి చేశారు. అడిగినంత లంచం ఇవ్వనందునే సీఐ విజయభాస్కర్ దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రతి నెలా ఒక్కో మద్యం షాపు నుంచి రూ.15 వేల ముడుపులు పోలీసులు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. టీడీపీ నేతల ఒత్తిడితో సీఐ విజయభాస్కర్ పనిచేస్తున్నారని మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ దురుసు ప్రవర్తనపై ఎక్సైజ్ అధికారులు కూడా మండిపడుతున్నారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని వైన్ షాపు నెంబర్-5లో సీఐ విజయ భాస్కర్ ఓ వ్యక్తిని కాలితో తన్నటం వీడియోలో రికార్డవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
సీఐ విజయభాస్కర్ వీరంగం
-
సీఐ సస్పెన్షన్
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ రేంజీ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గోదావరిఖని బాపూజీ నగర్లో ఫిబ్రవరి 16న తూడి స్వాతి ఆత్మహత్యకు ఆయనే కారణమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వివరాలు.. తూడి స్వాతి నాలుగేళ్ల కూతురుపై అదే కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తదనంతరం బాలుడు, ఆయన తండ్రి బెయిల్‌పై వచ్చి స్వాతితో పాటు కుటుంబ సభ్యులను తిట్టడం.. వేధించడం చేశారు. దీంతో స్వాతి న్యాయం చేయాలని వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణను కోరినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మానసికంగా వేదనకు గురైన ఆమె గతనెలలో ఆత్మహత్య చేసుకున్నారు. స్పందించిన సీపీ దుగ్గల్ వెంటనే సీఐ కృష్ణను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేస్తూ డీఐజీ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీఐని కమిషనరేట్‌కు అటాచ్ చేసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియకుండా విధులకు గైర్హాజరుకావడం.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం కూడా సస్పెండ్‌కు కారణాలుగా తెలుస్తోంది. -
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
-
సీఐ మురళీకృష్ణ సస్పెన్షన్
ఏలూరు: ఏలూరు నగర వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఏలూరులో ఎస్పీ రఘురామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... విధుల పట్ల సీఐ మురళీకృష్ణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారించారని తెలిపారు. పెద్ద అవుటపల్లి కాల్పు ఘటనలో సీఐ మురళీకృష్ణ పాత్రపై అనుమానాలు ఉన్నాయని... వాటిని నిర్థారించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా సీఐ మురళీకృష్ణతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివిధ దొంగతనాల కేసుల్లో దొంగల నుంచి భారీగా బంగారం, నగదు సీఐ మురళీకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ఆయన కోర్టులో డిపాజిట్ చేయకుండా అతడి వద్దే ఉంచుకున్నారు. అలాగే నగదును తన సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయం పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులుగా వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మురళీకృష్ణపై ఆరోపణలు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేస్తూ డీఐజీ హరికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదికాక గత వారం విజయవాడ సమీపంలో మద్రాసు - కోల్కత్తా జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం పినమడక గ్రామస్తులుగా నిర్థారించారు. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ హస్తం ఉందేమోనని... ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.