పక్కా మాస్ 'మసాలా' | Another Crazy Multi-Starrer movie with Venkatesh and Ram | Sakshi
Sakshi News home page

పక్కా మాస్ 'మసాలా'

Published Thu, Oct 3 2013 1:40 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పక్కా మాస్ 'మసాలా' - Sakshi

పక్కా మాస్ 'మసాలా'

వినోదాన్ని పండించడంలో వెంకటేశ్, రామ్ ఇద్దరిదీ ఒక ప్రత్యేకమైన శైలి. క్లాస్, మాస్, ఫ్యామిలీ, లవ్... ఇలా ఏ జానర్‌లో సినిమా చేసినా వీరిద్దరూ వినోదాన్ని మాత్రం మిస్ కారు. మంచి జోష్‌తో కనబడే వెంకీ, రామ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే వినోదం ఏ రేంజ్‌లో ఉంటుందో అంచనా వేయొచ్చు.
 
 హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ ఆధారంగా వెంకీ, రామ్ కలిసి చేస్తున్న సినిమా ‘మసాలా’. విజయ భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 13న విడుదల చేయనున్నారు. 
 
 ఈ నెలాఖరునే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అంజలి, షాజన్ పదమ్‌సీ కథానాయికలు. పక్కా మాస్ మసాలా అంశాలతో ఈ సినిమా రూపొందుతోందని, వినోదానికి పెద్ద పీట వేశామని, సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయని ‘స్రవంతి’ రవికిషోర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement