మసాలా రెడీ
Published Mon, Oct 28 2013 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
దినుసులన్నీ సమపాళ్లల్లో కుదిరితే ఆ మసాలా రుచే వేరు. అందుకే, మసాలా తయారు చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు దర్శకుడు విజయ్‌భాస్కర్ కూడా అంతే శ్రద్ధ తీసుకుని సిల్వర్ స్క్రీన్ కోసం మంచి ‘మసాలా’ తయారు చేశారు. ఇలాంటి మసాలా చిత్రాలు చేయడంలో వెంకటేష్, రామ్ స్టయిలే వేరు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ చేసే సందడి ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ అంటున్నారు విజయ్‌భాస్కర్. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కి రీమేక్ ఇది. ఇందులో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదంసీ నటించారు. థమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని, పక్కా మాస్ మసాలా అంశాలతో రూపొందించిన చిత్రం ఇదని రవికిషోర్ తెలిపారు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సంభాషణలు అమితంగా ఆకట్టుకుంటాయని, అన్ని వర్గాలవారు ఎంజాయ్ చేయదగ్గ చిత్రం ఇదని విజయ్‌భాస్కర్ చెప్పారు.
Advertisement
Advertisement