గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో...
Published Sun, Jan 12 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
రామ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రామ్. సరైన ఎనర్జిటిక్ పాత్రలు దొరికితే రామ్ ఏ స్థాయిలో విజృంభిస్తాడనడానికి ‘రెడీ’ లాంటి సినిమాలే ఉదాహరణ. ఇటీవలే వెంకటేశ్‌తో కలిసి ‘మసాలా’ చేసిన రామ్, తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గత ఏడాది రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయబోతున్నారు. ‘సింహా’లాంటి సినిమా తీసిన యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రామ్ ఎనర్జీకి తగిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని, కథ సిద్ధమైందని దర్శకుడు చెప్పారు. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తామని, మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.
Advertisement
Advertisement